Hari Hara Veeramallu: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న విలక్షణమైన నిర్మాతలలో ఏఎం రత్నం ఒకరు. కేవలం నిర్మాతగానే కాకుండా ఒక దర్శకుడిగా రచయితగా కూడా తన పేరును నిలబెట్టుకున్నారు. ఇప్పటివరకు ఏం రత్నం తీసిన సినిమాలలో సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంది. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ హీరోగా హరిహర వీరమల్లు సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చారు ఏ ఎం రత్నం.
ఏం రత్నం ఎన్ని సినిమాలు చేసినా కూడా ఆయన కెరీర్ లో గుర్తుండిపోయే సినిమా ఖుషి. పవన్ కళ్యాణ్ నటించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్స్ వసూలు చేసింది. అప్పటినుంచి వీళ్ళిద్దరి మధ్య మొదలైన పరిచయం ఇప్పటికీ సజావుగా సాగుతుంది. పవన్ కళ్యాణ్ కి ఏ ఎం రత్నం అంటే ప్రత్యేకమైన ఇష్టం అనేది రీసెంట్ గా హరిహర వీరమల్లు ప్రమోషన్లు చూసిన తర్వాత చాలామందికి అర్థం అయి ఉంటుంది.
ఆ పొలిటీషియన్ కు కౌంటర్
ఒకప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయితే గత ప్రభుత్వంలో ఉన్న చాలా మంది మంత్రులు కామెంట్ చేసేవారు. రీసెంట్ టైమ్స్ లో కూడా చేస్తూ ఉన్నారు. అలానే హరిహర వీరమల్లు సినిమా గురించి అంబటి రాంబాబు కూడా కామెంట్ చేశారు. ఆ కామెంట్ కి అదిరిపోయే సమాధానం ఇచ్చారు నిర్మాత ఏం రత్నం. “అంబటి రాంబాబు సినిమా టికెట్ రేట్లు పెంచి ప్రజలని దోచుకుంటున్నం అని విమర్శలు చేస్తున్నారు ….అయినా వచ్చి నాతో సినిమా చేస్తే ఆ కష్టం తెలుస్తుంది …రోడ్ల మీద డాన్సులు వేస్తె కాదు.” అని ఏ ఎం రత్నం మాట్లాడారు. ప్రత్యేకించి ఎవరి పేరు తీయని ఏ ఎం రత్నం ఎందుకు ఇలా మాట్లాడారు అంటే.? అంబటి రాంబాబు మాట్లాడే తీరును బట్టి ఆయన రియాక్ట్ అయ్యారు అని చెప్పాలి.
మిక్స్డ్ టాక్
పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా విషయంలో ఎప్పుడు చేయని విధంగా ప్రమోషన్ చేశారు. ముఖ్యంగా ఈ సినిమా రిలీజ్ అయిన అప్పటి నుంచి మిశ్రమ స్పందనతో నడుస్తుంది. ఈ సినిమా కొంతమందికి విపరీతంగా నచ్చింది. మరి కొంతమంది ఈ సినిమాను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమాలలో ఎక్కువ అంచనాలు ఉన్న సినిమా ఓ జి. సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 25న విడుదలకు సిద్ధంగా ఉంది. స్వతహాగా సుజిత్ పవన్ కళ్యాణ్ అభిమాని కావడంతో, ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి.
Also Read: Vishwambhara : కీరవాణిని పక్కనపెట్టి భీమ్స్ తో సాంగ్ చేయించడానికి కారణం ఇదే