Lavanya Tripathi:లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi).. మెగా కోడలుగా మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది ఈ చిన్నది. మిస్టర్, అంతరిక్షం వంటి చిత్రాలలో తనతో కలిసి నటించిన మెగా హీరో వరుణ్ తేజ్ (Varun Tej) తో ప్రేమలో పడి, ఎట్టకేలకు 2023లో వివాహం చేసుకున్నారు. గత ఏడాది లావణ్య తల్లి కాబోతుంది అన్న విషయాన్ని వరుణ్ తేజ్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించగా.. ఈ ఏడాది సెప్టెంబర్ 10వ తేదీన పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది లావణ్య. ఇక మెగా కుటుంబంలోకి వారసుడు ఎంట్రీతో మెగా కుటుంబం సంబరాలు చేసుకుంటుంది. ముఖ్యంగా మెగా ఫ్యామిలీలో సంబరాలు అంబరాన్ని అంటాయి అనడంలో సందేహం లేదు.
ముఖ్యంగా తమ ఇంట్లోకి అడుగుపెట్టిన ఒక కొత్త ప్రపంచానికి ఆహ్వానం పలుకుతూ.. కుటుంబ సభ్యులు ఫోటోలు షేర్ చేస్తూ.. తమ ఆనందాన్ని పంచుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఈ విషయం తెలిసిన అభిమానులు కూడా “కొణిదెల వారి ఇంట్లోకి వారసుడు వచ్చాడు” అంటూ మెగా ఫ్యాన్స్ కూడా సంబరాలు చేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా లావణ్య త్రిపాఠి తల్లి అయిన తర్వాత విడుదలైన మొదటి చిత్రం తనల్ (Thanal). ఇది తమిళ్ సినిమా. ఈరోజు (సెప్టెంబర్ 12) విడుదల అయింది.
తొలి సినిమా రిలీజ్..
ఒకవైపు ఇంట్లోకి వారసుడు వచ్చాడు అన్న ఆనందం, మరొకసారి తల్లి అయిన తర్వాత ఈమె నటించిన తొలి సినిమా రిలీజ్ కావడంతో లావణ్య ఆనందానికి అవధులు లేవని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే తాను తల్లి అయిన తర్వాత విడుదలైన సినిమా కావడంతో ఈ సినిమాపై పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది లావణ్య. లావణ్య మాట్లాడుతూ..” తనల్ మూవీ నాకు చాలా ప్రత్యేకం. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా నా నటనను ప్రశంసిస్తుంటే.. ఇప్పుడు మరింత ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఈ సినిమా మొదటి భాగం చాలా రొమాంటిక్ గా, రెండవ భాగం ఎమోషనల్ సీన్స్ తో అందరి హృదయాలను హత్తుకుంటుంది. ఇందులో నా పాత్ర కూడా కథకు చాలా కీలకంగా ఉంటుంది. అంతకుమించి ఈ పాత్రలో నటించే అవకాశాన్ని కల్పించిన డైరెక్టర్ రవీంద్ర మాధవ (Raveendra Madhava) కు నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతేకాదు ఇందులో హీరో అధర్వ (Adharva) తో కలిసి నటించడం మరింత ఆనందంగా ఉంది” అంటూ తన అభిప్రాయాన్ని పంచుకుంది లావణ్య.. ప్రస్తుతం లావణ్య షేర్ చేసిన ఈ కామెంట్ లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
లావణ్య సినిమాలు..
లావణ్య తెలుగులో ‘సతీ లీలావతి’ అనే సినిమాలో నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. త్వరలోనే ఇది కూడా విడుదలకు సిద్ధం కాబోతోంది.ఏది ఏమైనా పెళ్లి అయిన తర్వాత వరుస సినిమాలు చేస్తూ అటు ప్రేక్షకులను కూడా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది ఈ ముద్దుగుమ్మ.
ALSO READ: Film industry: భవనంపై నుండి దూకి ప్రముఖ డైరెక్టర్ మృతి!