BigTV English
Advertisement

Lavanya Tripathi: తొలిసారి బేబీ బంప్ తో దర్శనమిచ్చిన మెగా కోడలు

Lavanya Tripathi: తొలిసారి బేబీ బంప్ తో దర్శనమిచ్చిన మెగా కోడలు

Lavanya Tripathi: మెగా కోడలు లావణ్య త్రిపాఠి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందాల రాక్షసి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన లావణ్య మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకొని తెలుగు కుర్రకారు గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది. ఇంత మంచి విజయం తరువాత లావణ్య ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా మారుతుంది అనుకున్నారు.  అందం, అభినయం రెండు ఉండడంతో ఈ ముద్దుగుమ్మకు తిరుగులేదు అని చెప్పుకొచ్చారు.  అందుకు తగ్గట్లుగానే లావణ్యకి కూడా మంచి అవకాశాలు అయితే వచ్చాయి కానీ,  విజయాలు మాత్రం దక్కలేదు.


 

కుర్ర హీరోలు, సీనియర్ హీరోలు సరసన నటించిన కూడా ఆమె స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదగలేక పోయింది. ఇక తనతో కలిసి నటించిన  మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో లావణ్య ప్రేమలో పడింది. వీరిద్దరూ కలిసి మిస్టర్ అనే సినిమా లో మొదటిసారి కలిసి నటించారు. మిస్టర్ సినిమా విజయాన్ని అందించలేకపోయినా వీరిద్దరి ప్రేమకు గుర్తుగా మిగిలింది. ఈ సినిమా తర్వాత అంతరిక్షం అనే సినిమాలో మరోసారి కలిసి నటించారు. అప్పటి పరిచయం ప్రేమగా మారి కొన్నేళ్లు రిలేషన్ లో కూడా ఉన్నారు .


 

డేటింగ్ తర్వాత ఇరుకుటుంబ పెద్దలను ఒప్పించి వరుణ్ లావణ్య పెళ్లి బంధంతో ఒకటయ్యారు. పెళ్లి తర్వాత కూడా లావణ్య సినిమాలు చేస్తూ బిజీగా మారింది. అయితే అంతకు ముందులా గ్లామర్ పాత్రలు కాకుండా  పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంచుకుంటూ వస్తుంది.  సినిమాలు మాత్రమే కాకుండా ఓటీటీ రంగంలోకి  కూడా అడుగుపెట్టిన లావణ్య పెళ్లి తరువాత మిస్  పర్ఫెక్ట్ అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకుంది.

 

ఇక ఈ ఏడాదిలోనే లావణ్య – వరుణ్ తేజ్  అభిమానులకు తీపి కబురు చెప్పారు.  త్వరలోనే  తాము తల్లిదండ్రులుగా మారనున్నట్లు తెలిపారు.  లావణ్య ప్రెగ్నెంట్ అయిన తర్వాత వరుణ్ ఓ పక్క సినిమా షూటింగ్స్ తో బిజీగా ఉన్నా కూడా ఇంకోపక్క భార్యతో ఎక్కువ సమయాన్ని గడపడానికి ప్రయత్నిస్తున్నాడు.  లావణ్యను వెకేషన్స్ కు తీసుకెళ్తూ ఆమెకు ఏది కావాలంటే అది దగ్గరుండి చేసి పెడుతున్నాడు…  ఇక నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే లావణ్య..  భర్తతో కలిసి ఎంజాయ్ చేసే ప్రతి మూమెంట్ ను అభిమానులతో పంచుకుంటుంది.

 

అయితే ఇప్పటివరకు లావణ్య బేబీ బంప్ తో ఉన్న ఫోటోలు బయటకు రాలేదు.  దీంతో పలువురు నిజంగానే ఆమె ప్రెగ్నెంటా  అని అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇక తాజాగా లావణ్య మొదటిసారి బేబీ బంప్ తో  దర్శనమిచ్చింది. వెకేషన్ ముగించుకొని హైదరాబాద్ కు తిరిగి వస్తుండగా ఎయిర్ పోర్టులో లావణ్య, వరుణ్ జంటగా కనిపించారు. పింక్ కలర్ నైట్ డ్రెస్ లో లావణ్య బేబీ బంప్ తో కనిపించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. త్వరలోనే మెగా ఇంటికి మరో బుల్లి వారసుడు రానున్నాడని మెగా అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.

Related News

Chinmayi: తాళి వేసుకోవడంపై ట్రోల్స్.. కౌంటర్ ఇచ్చిన చిన్మయి!

Allu Aravind: సరైనోడు 2 అప్డేట్ ఇచ్చిన అల్లు అరవింద్.. ఎప్పుడొచ్చినా సరే అంటూ!

Dulquer Salman: పెళ్లిలో ఫుడ్ పాయిజన్..  దుల్కర్ సల్మాన్ కు నోటీసులు?

Dheeraj Mogilineni: ఇద్దరు ఆడపిల్లలతో రాహుల్ కష్టాలు.. బంపర్ ఆఫర్ ప్రకటించిన నిర్మాత

Mithra Mandali: ఓటీటీకి వస్తున్న మిత్రమండలి.. ఎక్కడ చూడొచ్చు అంటే

NTR: ఎన్టీఆర్ డెడికేషన్ కి సినీ లవర్స్ ఫిదా.. అందుకే గ్లోబల్ యాక్టర్!

Peddi: చికిరి హుక్ స్టెప్ బావుంది.. కాపీ కొట్టకుండా ఒరిజినల్ అయ్యి ఉంటే ఇంకా బావుండేది

Dies Irae Trailer : ‘డీయస్ ఈరే’ ట్రైలర్ వచ్చేసింది.. మిస్టరీ థ్రిల్లర్ సీన్ల తో థియేటర్లు దద్దరిల్లాల్సిందే..

Big Stories

×