Urvashi Rautela:బాలీవుడ్ నటి అందాల తార ఊర్వశీ రౌటేలా (Urvashi Rautela) ఏ హీరోయిన్ కి సాధ్యం కానీ రేంజ్ లో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. తాజాగా సౌదీ అరేబియాలోని జెడ్డా లో ప్రదర్శన ఇచ్చిన తొలి భారతీయ మహిళా కళాకారిణిగా రికార్డు సృష్టించింది. అంతేకాదు ఈ వేదికపై ప్రదర్శన ఇవ్వడానికి సుమారుగా రూ.7కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం. పైగా ఈ వేదికపై తన తదుపరి చిత్రాలైన ‘వెల్కమ్ 3’, ‘కసూర్ 2’ చిత్రాల గురించి కూడా చెప్పుకొచ్చింది. ఇకపోతే ఈ స్టేజ్ పై నలుపు, వెండి రంగు దుస్తులలో ఈమె ఇచ్చిన అద్భుతమైన ప్రదర్శన చాలామందిని మంత్రముగ్ధుల్ని చేసింది. ముఖ్యంగా ఈమె ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఏది ఏమైనా సౌదీ అరేబియాలోని జెడ్డాలో ప్రదర్శన ఇచ్చిన తొలి ఇండియన్ మహిళగా రికార్డు సృష్టించి అందరిని ఆకట్టుకుంది.
ఊర్వశీ రౌటేలా కెరియర్..
ఊర్వశీ కెరీర్ విషయానికి వస్తే.. భారతీయ నటిగా, మోడల్గా మంచి పేరు సొంతం చేసుకుంది. అటు తెలుగులోనూ.. ఇటు హిందీలోనూ సినిమాలు చేస్తూ భారీ పాపులారిటీ అందుకుంది ఈ ముద్దుగుమ్మ. మోడల్గా కెరియర్ మొదలు పెట్టిన తొలినాళ్లల్లో ‘మిస్ దివా యూనివర్స్ 2015’ టైటిల్ గెల్చుకుంది. 1994 ఫిబ్రవరి 25న ఉత్తరాఖండ్ , హరిద్వార్ లో జన్మించింది. ఇక 2013లో ‘సింగ్ సాబ్ ది గ్రేట్’ అనే సినిమాతో నటిగా ఇండస్ట్రీ రంగ ప్రవేశం చేసింది. తర్వాత 2016 లో వచ్చిన సనమ్ రే, గ్రేట్ గ్రాండ్ మస్తీ, 2018 లో వచ్చిన హేట్ స్టోరీ 4, 2019లో వచ్చిన పాగల్ పంతి వంటి కొన్ని ముఖ్యమైన చిత్రాలలో నటించి, బాలీవుడ్లో తనకంటూ ఒక గుర్తింపును సొంతం చేసుకుంది.
తెలుగు, కన్నడలో కూడా గుర్తింపు..
‘Mr.ఐరావతం’ అనే సినిమాతో కన్నడ సినీ పరిశ్రమకు పరిచయమైన ఈమె.. హిందీ , కన్నడ లోనే కాకుండా బెంగాలీ చిత్రాలలో కూడా నటించింది. ఇక తొలిసారి 2023లో చిరంజీవి (Chiranjeevi) హీరోగా నటించిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో స్పెషల్ సాంగ్ తో తెలుగు ఆడియన్స్ ను పలకరించిన ఈమె ఆ తర్వాత ఏజెంట్, బ్రో, స్కంద వంటి సినిమాలలో కూడా నటించింది. గత ఏడాది బాలకృష్ణ (Balakrishna) హీరోగా వచ్చిన ‘డాకు మహారాజ్ ‘ సినిమాలో నటించిన ఈమె ప్రస్తుతం తెలుగులో బ్లాక్ రోజ్ సినిమాలో నటిస్తోంది. ఇక హీరోయిన్గా తెలుగులో ఈమె నటిస్తున్న మొదటి సినిమా కావడం గమనార్హం.
కేన్స్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన ఊర్వశీ..
ఇదిలా ఉండగా ఇటీవల జరిగిన కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో రోజుకొక అద్భుతమైన ట్రెండీ ఔట్ఫిట్ తో అందరి దృష్టిని ఆకర్షించింది. అంతేకాదు కేన్స్ ఫిలిం ఫెస్టివల్ రెడ్ కార్పెట్ పై తన వస్త్రధారణ అలాగే తాను ఉపయోగించే వస్తువులతో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది ఊర్వశి. ఏది ఏమైనా ఎప్పటికప్పుడు ప్రత్యేకత చాటుకుంటూ అందరిని అబ్బురపరుస్తోంది.
ALSO READ:Mirai Movie: మిరాయ్ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్.. ‘వైబ్ ఉంది బేబీ’
?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==