Mad Movie : టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎటువంటి అంచనాలు లేకుండా థియేటర్ లోకి వచ్చిన సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అవుతున్నాయి. గత కొన్నేళ్లగా చిన్న సినిమాల హవా నడుస్తుంది. అలా ఎన్నో సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కూడా కురిపించాయి. వాటిలో మ్యాడ్ చిత్రం ఒకటి. 2023లో తెలుగులో విడుదలైన సినిమా. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌పై హారిక సూర్యదేవర, సాయిసౌజన్య నిర్మించిన ఈ సినిమాకు కల్యాణ్ శంకర్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీలో లడ్డు పాత్ర ప్రేక్షకులను బాగా అలరించింది. ఈ పాత్రను చాలా మంది మిస్ చేసుకున్నారు. తాజాగా లిటిల్ హార్ట్ హీరో ఈ పాత్రను మిస్ చేసుకున్న విషయాన్ని బయటపెట్టాడు..
లిటిల్ హార్ట్ సినిమా త్వరలోనే విడుదల కాబోతుంది. ఈ మూవీలో మౌళి, శివాని నగారం హీరో, హీరోయిన్లు గా నటించారు. ఈ మూవీ ప్రమోషన్ లో భాగంగా హీరో పలు చానల్స్ కి ఇంటర్వ్యూ ఇస్తూ వస్తున్నాడు. మరో వైపు సినిమా ప్రమోషనల్ కార్యక్రమాలను చేపట్టారు. ఈ సందర్భంగా హీరో మాట్లాడుతూ.. మ్యాడ్ మూవీ గురించి ప్రస్తావించారు. ఈ చిత్రంలోని బాగా ఫేమస్ అయినా లడ్డు పాత్రకు ముందుగా తనని సంప్రదించినట్లు చెప్పారు. ఆ సినిమాలో లడ్డూ పాత్ర కోసం కళ్యాణ్ శంకర్ ఎలాంటి ఆడిషన్ లేకుండా నన్ను సంప్రదించారు. కానీ కొన్ని చేదు అనుభవాల కారణంగా నేను చేయకూడదని నిర్ణయించుకున్నాను.. అది చేసి ఉంటే నా రేంజ్ వేరేలా ఉండేదని ఆయన అన్నారు. మ్యాడ్ కు సీక్వెల్ గా వచ్చిన మూవీ కూడా మంచి రెస్పాన్స్ ను అందుకుంది.
Also Read :మళ్లీ థియేటర్లలోకి అవతార్.. రిలీజ్ ఎప్పుడంటే..?
ఈ మూవీ టైటిల్ కు తగ్గట్లే ఉంటుంది. నో టచింగ్స్.. ఓన్లీ హార్ట్ టచింగ్స్’ ట్యాగ్‌లైన్‌తో వస్తుంది. ఇందులో 90స్ మిడిల్ క్లాస్ బయోపిక్ ఫేమ్ మౌళి తనూజ్ హీరోగా నటిస్తుండగా.. సాయి మార్తాండ్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది.. శివాని హీరోయిన్ గా నటిస్తుంది. ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ నిర్మిస్తోన్న ఈ సినిమాకు సిన్‌జిత్ యర్రమల్లి సంగీతం అందిస్తున్నారు.. బన్నీ వాస్, వంశీ నందిపాటి థియేట్రికల్‌గా రిలీజ్ చేస్తున్నారు. ఇకపోతే ఈ నెల 5న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. తాజాగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు. ఈ ఈవెంట్ లోనే మౌళి మ్యాడ్ గురించి మాట్లాడారు. ఇప్పటివరకు ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ప్రతి అప్డేట్ యువతని బాగా ఆకట్టుకుంది. ఆ థియేటర్లలోకి వచ్చిన తర్వాత ఈ మూవీ ఎలా ఉండబోతుందో చూడాలి..