Child Health Tips: పిల్లలు నిద్రలో పళ్ళు కొరకడం చాలామందికి సాధారణ అలవాటు అనిపిస్తుంది. కానీ వైద్య పరంగా చూస్తే ఇది సాధారణం కాదు. ఈ సమస్య వెనుక ప్రధాన కారణం పొట్టలో నులి పురుగులు ఉండటమే. పురుగులు శరీరంలోకి వెళ్లి జీర్ణవ్యవస్థను ప్రభావితం చేస్తాయి. దీనివల్ల పిల్లలు నిద్రలో పళ్ళు గట్టిగా కొరుక్కోవడం, ఆకలి తగ్గడం, పొట్ట నొప్పి, బరువు తగ్గడం వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి దీన్ని అలవాటుగా తీసుకోకుండా ఒక సంకేతంగా భావించి సరైన చికిత్స తీసుకోవడం చాలా ముఖ్యం.
పిల్లలకే కాదు పెద్దలకు కూడా సమస్య
పొట్టలో నులి పురుగులు అనేది చిన్న పిల్లలకే కాకుండా పెద్దవారిలో కూడా కనిపించే సాధారణమైన ఆరోగ్య సమస్య. చాలామంది పెద్దగా పట్టించుకోరు కానీ, ఈ పురుగులు శరీరానికి నష్టం కలిగించడమే కాకుండా, ఆరోగ్యాన్ని బలహీనపరుస్తాయి. వీటికి ఒక చిన్న లక్షణం ఏమిటంటే, రాత్రిపూట నిద్రలో పళ్లు కొరుక్కోవడం. సాధారణంగా పిల్లలు నిద్రలో పళ్లు కొరుకుతుంటే అది సరదాగా అనిపించినా, దీని వెనుక ఉన్న అసలు కారణం మాత్రం పొట్టలో ఉండే నులి పురుగులే అని వైద్యులు చెబుతున్నారు.
నులి పురుగులు అంటే?
నులి పురుగులు అంటే శరీరంలోకి వెళ్లి, మనం తినే ఆహారాన్ని తినే కీటకాలు. ఇవి సాధారణంగా శుభ్రత లేకపోవడం, సరిగా కడగని కూరగాయలు లేదా పండ్లు తినడం, కలుషితమైన నీరు తాగడం వంటివి కారణాల వల్ల వస్తాయి. ఒకసారి ఇవి శరీరంలోకి వెళ్ళాక నిద్ర పట్టకపోవడం, పొట్ట నొప్పి, వాంతులు, ఆకలి తగ్గడం, బరువు తగ్గడం వంటి సమస్యలు కలిగిస్తాయి. ముఖ్యంగా ఎక్కువగా కనిపించే లక్షణం రాత్రి పూట పళ్ళు గట్టిగా కొరుక్కోవడం. ఇది చిన్నపిల్లల్లో ఎక్కువగా కనబడుతుంది గానీ, పెద్దల్లో కూడా ఉంటుంది. దీన్ని చాలామంది ఒక అలవాటుగా తీసుకుంటారు కానీ, వాస్తవానికి ఇది శరీరంలో ఉన్న పురుగుల సంకేతమని ఇప్పటి వరకు ఎవరూ గుర్తించని భయంకరమైన రహస్యం.
Also Read: Warm Water: ఒళ్లు నొప్పులు తగ్గించే సింపుల్ చిట్కా.. ఇలా చేస్తే చాలు
ఇంట్లో ఉన్నవాటితో ఇలా చేస్తే ఫలితం ఉంటుంది
ఇలాంటి సమస్యను తగ్గించడానికి మన ఇంట్లోనే ఉన్న ఒక సులభమైన గృహ చికిత్స చాలా ఉపయోగపడుతుంది. అదే రాత్రిపూట పడుకునే ముందు వేడి పాలలో కొంచెం పసుపు వేసి తాగడం. పసుపులో సహజమైన యాంటీబయాటిక్ గుణాలు ఉంటాయి. ఇవి శరీరంలో ఉన్న బాక్టీరియా, కీటకాలు, పురుగులను తగ్గిస్తాయి. అలాగే పసుపు రక్తాన్ని శుభ్రం చేస్తుంది. పాలు తాగడం వల్ల శరీరానికి కావలసిన పోషకాలు లభిస్తాయి. ఆ పాలలో పసుపు కలిస్తే, అది శరీరంలోకి వెళ్ళినప్పుడు నులి పురుగులను చంపి బయటకు పంపడంలో సహాయపడుతుంది. అంతేకాదు, రాత్రిపూట తాగడం వల్ల అది నేరుగా జీర్ణవ్యవస్థపై పనిచేస్తుంది. ఫలితంగా పళ్లు కొరుక్కోవడం తగ్గిస్తుంది.
ఒక్కరోజు వాడితే సరిపోదు కనీసం 15రోజులు
ఇలా ఒకరోజు చేసి వదిలేస్తే తగ్గదు.. కనీసం 10 నుంచి 15 రోజుల పాటు ప్రతి రాత్రి పసుపు కలిపిన పాలు తాగితే మంచి ఫలితం కనబడుతుంది. అలాగే శరీరం మొత్తం శుభ్రంగా ఉంచుకోవడం చాలా అవసరం, పిల్లలకు గోర్లు పెరగనివ్వకుండా కత్తిరించడం, చేతులు తరచూ సబ్బుతో కడుక్కోవడం, పండ్లు, కూరగాయలు సరిగా కడిగి వాడటం చాలా ముఖ్యం.
వైద్యులను సంప్రదించాల్సిందే!
నులి పురుగులు ఎక్కువై పోతే కేవలం గృహ చికిత్సతో సరిపోదు. అలాంటి సందర్భంలో వైద్యులను సంప్రదించి సరైన మందులు తీసుకోవాలి. పిల్లలకు డాక్టర్ సలహా లేకుండా మందులు ఎప్పుడూ ఇవ్వకూడదు. కాబట్టి దీనిని నిర్లక్ష్యం చేయకుండా, వెంటనే కారణం తెలుసుకొని తగిన చికిత్సలు చేయించుకోవాలి.