Maadhavi Latha: మాధవీలతా.. ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడు. నచ్చావులే సినిమాతో కుర్రకారును తనవైపుకు తిప్పుకుంది. ఆ తరువాత వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా మారాలని ప్రయత్నించింది కానీ, ఆ స్థాయికి చేరలేకపోయింది. ఇక సినిమాల కన్నా ఎక్కువ వివాదాలతోనే ఎక్కువ ఫేమస్ అయ్యింది. ఇంకోపక్క రాజకీయాల్లో కూడా ప్రయత్నించింది.
ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ హిందూ సంప్రదాయాలను మంటకలిపే వారిపై మండిపడడం మొదలుపెట్టింది. తనకు ఏది అన్యాయం అనిపిస్తే దానిపై తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఉంటుంది. తాజాగా మాధవీలతా.. ఆలయాల్లో కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు.. శృంగారభరితమైన ఫోటోలు దిగడం, బొడ్డు, నడుము చూపిస్తూ అసభ్యంగా ఫోజులు ఇవ్వడం ఇప్పుడు ఫ్యాషన్ గా మారిపోయింది. అలాంటివారిపై మాధవీలతా మండిపడింది.
పవిత్రమైన ఆలయాల్లో ఇలాంటి ఫోటోలు దిగడం ఏంటి అని ప్రశ్నించింది. ఇలాంటి ఫోటోలు తీస్తుంటే పక్కనే ఉన్న తల్లులు ఏం చేస్తున్నారు అంటూ ఫైర్ అయ్యింది. “అమ్మాయిలకు.. ముఖ్యంగా ఫోటోషూట్ చేసుకొనే అమ్మాయిలకు.. నేనైతే ఒక సలహా ఇస్తున్నా.. నచ్చితే తీసుకోండి.. నచ్చకపోతే మడిచి లోపల పెట్టుకోండి. టెంపుల్ ఏరియాస్ కి వెళ్లి.. బ్యాక్ లెస్ బ్లౌజ్ లు, స్కిన్ షోలు చేసుకుంటూ.. ఓవర్ యాక్షన్ లు చేసుకుంటూ.. ఫోటోషూట్ లు చేసి.. శృంగారాలు ఒలకబోసే ఫొటోషూట్స్ అయితే టెంపుల్స్ లో చేయొద్దు.
ఏషియన్ టెంపుల్స్ కి వెళ్తున్నారు. అక్కడికి వెళ్లి బ్యాక్ లెస్ సోకులు.. నడుము, బొడ్డు చూపిస్తూ.. ఎక్కడ ఏది చేయాలో అది చేయండి. అన్ని చూపించడానికి చాలా ప్రదేశాలు ఉన్నాయి. అక్కడకు వెళ్లండి. నేను అమ్మాయిలను ఫోటోషూట్స్ చేయించుకోవద్దని అనడం లేదు. గ్లామరస్ గా కనిపించొద్దు అనడం లేదు. దేవాలయాలకు వెళ్లి వెధవ వేషాలు వేయొద్దు అంటున్నాను. మూసుకొని వేరే ప్లేస్ లకు వెళ్లి ఫోటోషూట్ లు చేసుకోండి. సెక్సీ.. సెక్సీ గా టెంపుల్ ఏరియాల్లో ఏంటీ ఆ ఫోటోషూట్స్… ఏంటా వీడియో షూట్స్.. చెప్పు తీసుకొని తన్నేవాడు లేక. మళ్లీ కొందరు తల్లులను పక్కన పెట్టుకొని వెళ్తున్నారు. వాళ్ళకైనా బుద్ది ఉండొద్దా. కూతురు అలా చేస్తుంటే అక్కడున్న కర్రనో.. లేక గుడి బయట చెప్పు తీసుకొని తంతే అప్పుడు దారికొస్తారు” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. మాధవీలతా వ్యాఖ్యలకు చాలామంది సపోర్ట్ గా నిలుస్తున్నారు.