భారతీయ ప్రభుత్వరంగ టెలికాం సంస్థ BSNL.. తన వినియోగదారులకు చక్కటి రీఛార్జ్ ప్లాన్స్ తీసుకొస్తుంది. ప్రైవేట్ టెలికాం సంస్థలకు సాధ్యం కాని రీతిలో చౌక ధరలకే కొత్త కొత్త ప్లాన్స్ పరిచయం చేస్తుంది. వీటి ద్వారా చక్కటి ప్రయోజనాలను అందిస్తుంది. తమ కస్టమర్లకు మెరుగైన సేవలు అందించడంతో పాటు కొత్త కస్టమర్లను పెంచుకునేలా ప్లాన్స్ చేస్తోంది. ఇతర టెలికాం కంపెనీలతో పోలిస్తే, BSNL రీఛార్జ్ ప్లాన్స్ తక్కువ ధరకు ఎక్కువ ప్రయోజనాలను అందిస్తుండటంతో ఎక్కువ మంది ఈ సంస్థ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇక ప్రస్తుతం అందుటులో ఉన్న BSNL క్రేజీ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లలో ఒకదాని గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీని ధర ఎంత? ఏ ఏ ప్రయోజనాలు అందిస్తుంది? వ్యాలిడిటీ ఎన్నిరోజులు అనేది చూద్దాం..
BSNL పాపులర్ రీఛార్జ్ ప్లాన్స్ లో ఇదీ ఒకటి. దీని ధర రూ. 319. అపరిమిత కాలింగ్, ఇంటర్నెట్ డేటా సౌకర్యాన్ని పొందే వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని ఈ రీఛార్జ్ ప్లాన్ ను రూపొందించింది కంపెనీ. ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ రీఛార్జ్ ప్లాన్.
ఈ రూ. 319 రీఛార్జ్ ప్లాన్ తో మొత్తం 65 రోజుల వ్యాలిడిటీని పొందే అవకాశం ఉంటుంది. స్మార్ట్ ఫోన్ లో ఈ ప్లాన్ ను రీఛార్జ్ చేసిన తర్వాత, అపరిమిత కాలింగ్ ప్రయోజనాన్ని పొందుతారు. అంతరాయం లేకుండా ఏ నెట్ వర్క్ వారికైనా కాల్ చేయవచ్చు. వారితో ఎంతసేపు అయినా మాట్లాడవచ్చు. ఈ రీఛార్జ్ ప్లాన్ లో మొత్తం 10 GB ఇంటర్నెట్ డేటాను పొందే అవకాశం ఉంటుంది. 10 GB ఇంటర్నెట్ డేటా 65 రోజుల వరకు అందుబాటులో ఉంటుంది. ఈ ప్లాన్ లో మీకు రోజువారీ డేటా పరిమితి లభించదు. అంటే ఈ 10 GB డేటాను 65 రోజుల పాటు ఉపయోగించుకోవాల్సి వస్తుంది. ఎక్కువ డేటా ఉపయోగించేవారికి ఈ డేటా సరిపోదు. ఇక ఈ ప్లాన్ ను రీఛార్జ్ చేసిన తర్వాత, 65 రోజుల పాటు 300 ఉచిత SMSలను కూడా పొందుతున్నారు.
Read Also: 72 రోజుల వ్యాలిడిటీ, డైలీ 2GB డేటా.. BSNL నుంచి మరో అదిరిపోయే ప్లాన్!
ఒకవేళ మీరు సరసమైన, ఎక్కువ రోజుల వ్యాలిడిటీ కోసం మంచి రీఛార్జ్ ప్లాన్ కోసం చూస్తున్నట్లయితే, రూ. 319 ప్లాన్ బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అయితే, ఎక్కువ ఇంటర్నెట్ ఉపయోగించే వారికి ఈ డేటా సరిపోదు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలకు ఈ రీఛార్జ్ ప్లాన్ బాగుంటుంది. సో, తక్కువ డేటా ఉపయోగించి, ఎక్కువగా కాల్స్ మాట్లాడుకునే వారికి ఈ రీఛార్జ్ ప్లాన్ అనుకూలంగా ఉంటుంది.
Read Also: రోజూ 2జీబీ డేటా, 160 రోజుల వ్యాలిడిటీ.. సెప్టెంబర్ లో BSNL బెస్ట్ రీఛార్జ్ ప్లాన్ ఇదే!