BigTV English

Madhavan : సీజీతో ఏజ్ తగ్గించడం… హీరోలందరికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మాధవన్

Madhavan : సీజీతో ఏజ్ తగ్గించడం…  హీరోలందరికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మాధవన్

Madhavan :ఈమధ్య కాలంలో టెక్నాలజీ బాగా పెరిగిపోయింది. ఈ పెరిగిపోయిన టెక్నాలజీని సినిమాలలో చాలా చక్కగా ఉపయోగించుకుంటూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు మేకర్స్. యంగ్ సెలబ్రిటీలను ముసలి వాళ్ళలా.. వయసు పై బడిన వాళ్లను యంగ్ కుర్రాళ్ళుగా చూపిస్తూ ప్రజలను మాయ చేస్తున్నారు. అయితే ఇప్పుడు దీని పైనే హీరో మాధవన్ (Madhavan) అందరికీ గట్టి కౌంటర్ ఇచ్చారు. సీజీతో ఏజ్ తగ్గించడం పై తాజాగా మాట్లాడుతూ ఊహించని కామెంట్స్ చేశారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.


‘ఆప్ జైసా కోయీ’తో ఓటీటీలోకి వస్తున్న మాధవన్..

అసలు విషయంలోకెళితే.. తెలుగు, తమిళ్ చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆర్.మాధవన్ తాజాగా హిందీలో ‘ఆప్ జైసా కోయీ’ అనే చిత్రంతో జూలై 11న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా థియేటర్లలో కాకుండా నేరుగా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఇందులో ‘దంగల్’ బ్యూటీ ఫాతిమా సనా షేక్ (Fathima Sana Shaikh) హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమా నుండి ట్రైలర్ విడుదల చేశారు. ఈ ట్రైలర్లో సంస్కృత ఉపాధ్యాయుడు శ్రీ రేణు త్రిపాఠిగా మాధవన్ నటించగా.. ఫ్రెంచ్ టీచర్ మధు బోస్ పాత్రలో ఫాతిమా చేసింది. 42 సంవత్సరాలు వచ్చినా పెళ్లి చేసుకుని శ్రీ రేణు.. 32 సంవత్సరాల వయసున్న మధు మధ్య జరిగిన పెళ్లి చూపులు, ఆ తర్వాత ఏర్పడిన పరిణామాల నేపథ్యంలో ఈ సినిమా సాగనున్నట్లు సమాచారం.


అంత బడ్జెట్ నా దగ్గర లేదు – ఆర్. మాధవన్

ఒక సాంప్రదాయ కుటుంబానికి చెందిన హీరో.. విశాల భావాలు కలిగిన హీరోయిన్ కుటుంబానికి మధ్య ఏర్పడిన అగాధం వీరిద్దరిని ఎలా దూరం చేసిందనే దానిని ఆసక్తికరంగా ట్రైలర్ లో చూపిస్తూ ప్రేక్షకులను సినిమాపై అంచనాలు పెంచేలా చేశారు. ఇకపోతే ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో పాల్గొన్న ఆర్.మాధవన్ సీజీతో ఏజ్ తగ్గించడం పై ఊహించని కామెంట్లు చేశారు. ‘ఆప్ జైసా కోయీ ‘ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో భాగంగా ఆర్ మాధవన్ మాట్లాడుతూ.. “వయసు తక్కువగా కనిపించేందుకు నేను ఎలాంటి టూల్స్ ఉపయోగించలేదు. అందుకు నా వద్ద బడ్జెట్ కూడా లేదు. ఈ రొమాంటిక్ డ్రామా చిత్రం ప్రేక్షకులను అలరించడానికి మాత్రం సిద్ధంగా ఉంది” అంటూ ఆర్ మాధవన్ తెలిపారు.

హీరోలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మాధవన్..

ఇకపోతే ఈయన చేసిన కామెంట్లు మిగతా హీరోలకు గట్టి కౌంటర్ లా ఉన్నాయని నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో సీజీ వర్క్ ఎక్కువగా సినిమాలలో ఉపయోగిస్తూ.. వయస్సు తగ్గించి మరీ హీరోలను చూపిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సీజీ వర్క్ కోసం నిర్మాతలు కూడా భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే తన వద్ద మాత్రం అంత డబ్బు లేదు అని, తాను తనలాగే నటించానని చెప్పుకొచ్చారు మాధవన్ అంటూ నెటిజన్స్ తమ అభిప్రాయాలుగా వ్యక్తపరుస్తున్నారు.

ఆప్ జైసా కోయి సినిమా విశేషాలు..

ఇకపోతే నేరుగా ఓటీటీలోకి రాబోతున్న ఈ చిత్రాన్ని కరణ్ జోహార్, అదర్ పూనావాలా , అపూర్వ మెహతా, సోనమ్ మిశ్రా సంయుక్తంగా నిర్మించారు. ఇక ఈ సినిమాని వివేక్ సోనీ దర్శకత్వం చేశారు. ఆయేషా రజా, మనీష్ చౌదరి, నమిత దాస్ ఇందులో కీలకపాత్రలు పోషించడం జరిగింది. ఇక ప్యూర్ రొమాంటిక్ డ్రామాగా వస్తున్న ఈ సినిమా ఓటీటీలో ఏ మేరకు ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి.

ALSO READ:Maargan: సినిమా చరిత్రలో తొలిసారి.. విడుదలకు ముందే 6 నిమిషాల సినిమా రిలీజ్!

 

Related News

Actor Satya Dev: మూడ్ సరిగ్గా లేకపోతే చేసేది ఆ పనే… వ్యసనంలా మారిపోయిందంటున్న సత్య దేవ్!

Ntr Dragon: తారక్‌కు క్లైమాక్స్ ఇచ్చేశాడు… నీల్ మావా ప్లాన్ మామూలుగా లేదుగా

Ankita Singh: 3 లక్షలు ఇస్తే 15 నిమిషాలు టైం ఇస్తా… హీరోయిన్ ఓపెన్ ఆఫర్

Lokesh Kanagaraj: నటుడుగా లోకేష్ కనగరాజ్, అందుకే ఇన్ని గెటప్స్

Samantha: నా కొత్త సినిమా ఆగిపోలేదు, షూటింగ్ అప్పుడే మొదలవుతుంది

Rashmika: రష్మికపై డబ్బులిచ్చి ట్రోలింగ్ చేయిస్తుంది ఎవరు.. ?

Big Stories

×