Maargan: తమిళ నటుడు విజయ్ ఆంటోని(Vijay Antony) ఇప్పటికే ఎన్నో సినిమాల్లో నటించి హీరోగా ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. ఆయన సినిమాలన్నింటిలో కూడా మంచి మెసేజ్ ఉంటుంది. అలా మంచి కంటెంట్ లను ఎంచుకుంటూ సందేశాత్మక సినిమాలు చేసే విజయ్ ఆంటోని.. కెరియర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ కూడా ఉన్నాయి. అయితే అలాంటి విజయ్ ఆంటోని తమిళ నటుడే అయినప్పటికీ ఆయన నటించిన సినిమాలు తెలుగులో కూడా విడుదలవ్వడంతో తెలుగు అభిమానులకు కూడా దగ్గరయ్యారు. ముఖ్యంగా విజయ్ ఆంటోని నటించిన బిచ్చగాడు (Bicchagadu) సినిమా ద్వారా తెలుగు అభిమానులకు విపరీతంగా ఆకట్టుకున్నారు.అలా బిచ్చగాడు సినిమాకి వచ్చిన ఆదరణతో విజయ్ ఆంటోనీ చేసే ప్రతి సినిమాను తెలుగులో కూడా రిలీజ్ చేసుకుంటున్నారు.
విడుదలకు ముందే 6 నిమిషాల వీడియో రిలీజ్..
బిచ్చగాడు 2 తర్వాత విజయ్ ఆంటోనీ చేస్తున్న తాజా చిత్రం ‘మార్గన్ ‘.. “ది బ్లాక్ డెవిల్” అనే శీర్షికతో జూన్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇదే సినిమా ద్వారా విజయ్ మేనల్లుడు కూడా ఇండస్ట్రీకి విలన్ గా తొలి పరిచయం కాబోతున్నారు. ఇక విడుదలకి కేవలం కొన్ని గంటలే ఉండగా.. ఇలాంటి సమయంలో ఈ సినిమాకి సంబంధించి ఒక షాకింగ్ విషయం వైరల్ అవుతోంది. అదేంటంటే మార్గన్ మూవీ(Maargan Movie) మరికొద్ది గంటల్లో విడుదల కాబోతున్న నేపథ్యంలో.. ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కాకముందే యూట్యూబ్లో విడుదలైంది. దీంతో ఈ మూవీ చూసిన చాలా మంది జనాలు బ్లాక్ బస్టర్.. సూపర్.. అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి విడుదల కాకుండానే ఈ సినిమాను యూట్యూబ్ లో ఎవరు రిలీజ్ చేశారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
అనుక్షణం సస్పెన్స్ క్రియేట్ చేసిన మూవీ..
లియోపాల్ (Leo Paul) డైరెక్షన్ లో విజయ్ ఆంటోనీ హీరోగా నటిస్తున్న మార్గన్ మూవీ మరికొద్ది గంటల్లో విడుదల కాబోతోంది.. అయితే ఈ సినిమా మర్డర్ మిస్టరీగా తెరకెక్కింది. అయితే ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే వరుస ప్రమోషన్స్ చేస్తున్న చిత్ర యూనిట్ తాజాగా సినిమాకి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చింది. అదేంటంటే.. మార్గన్ మూవీ మీద మరింత హైప్ పెంచడం కోసం చిత్ర యూనిట్ తాజాగా యూట్యూబ్లో ఈ సినిమాకి సంబంధించి మొదటి ఆరు నిమిషాల వీడియోను రిలీజ్ చేశారు. దీంతో ఈ 6 నిమిషాల మూవీ చూసి చాలామంది నెటిజన్లు సినిమా అద్భుతంగా ఉంది.. చాలా థ్రిల్లింగ్ గా, సస్పెన్స్ తో అద్భుతంగా ఉంది అని, ప్రతి ఒక్క ఎలిమెంట్ చాలా ఆసక్తికరంగా ఉంది అంటూ కామెంట్లు పెడుతున్నారు.
సినిమా చరిత్రలో ఇదే తొలిసారి..
అంతేకాదు విజయ్ ఆంటోనీ యాక్టింగ్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కెవ్వు కేక అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక థియేటర్లో విడుదల చేయడం కంటే ముందే ఇలా మార్గన్ మూవీ మొదటి ఆరు నిమిషాల విజువల్ వీడియోని రిలీజ్ చేయడంతో.. సినిమా చరిత్రలో ఇదే మొదటిసారి అంటూ కూడా ఈ సినిమాపై ప్రశంశలు కురిపిస్తున్నారు. అంతేకాదు విడుదల చేసిన ఈ ఆరు నిమిషాల వీడియో కూడా సినిమాపై భారీ అంచనాలు పెంచేసింది. అయితే ఈ మార్గన్ మూవీ కేవలం కోలీవుడ్ లోనే కాకుండా టాలీవుడ్ లో కూడా విడుదల కాబోతోంది. ఈ సినిమాని తెలుగులో సురేష్ ప్రొడక్షన్స్(Suresh Productions) రిలీజ్ చేస్తుంది.. ఇక విజయ్ ఆంటోని మార్గన్ మూవీలో బ్రిగడా సాగా (Brigida Saga), సముద్రఖని, ప్రీతిక, మహానటి శంకర్ లు కీలకపాత్రల్లో నటిస్తున్నారు.
ఆ 6 నిమిషాల వీడియోలో ఏముందంటే?
ఇకపోతే తాజాగా విడుదల చేసిన ఈ 6 నిమిషాల వీడియోలో ఏముంది అనే విషయానికి వస్తే.. ఒక అమ్మాయి స్కూటీలో తన ఇంటి వద్ద నుంచి బయలుదేరగానే.. ఆఫీసర్స్ అందరూ ఆమెనే ఫాలో చేస్తారు. ముఖ్యంగా కిల్లర్ ఆమెను టార్గెట్ చేశారని తెలుసుకున్న ఆఫీసర్లు.. ఎలాగైనా సరే ఆమెను ఫాలో చేసి ఆ కిల్లర్ పట్టుకోవాలని, అమ్మాయి ప్రాణాలను కాపాడాలని ప్రయత్నం చేస్తారు. మరోవైపు ఒక అమ్మాయి రాత్రి సమయంలో తన బాయ్ ఫ్రెండ్ కి బాయ్ చెప్పి.. కొద్ది దూరంలో వున్న తన ఇంటికి నడుచుకుంటూ వెళ్తుంటుంది. మధ్యలో సైకో కిల్లర్ లేజర్ లైట్ వేసి మరీ ఆమెను పట్టుకొని, ఆమె మెడ పైన ఒక సూది గుచ్చుతాడు. అయితే ఆ సూది వేసిన మరుక్షణంలోనే నేల జారి..ఆ అమ్మాయి మొత్తం నలుపు రూపంలోకి మారిపోతుంది.
ఆధ్యంతం ఉత్కంఠ రేపే సన్నివేశాలు..
కట్ చేస్తే మరుసటి రోజు అదే స్థలంలో మున్సిపాలిటీ కార్మికులు చెత్తను క్లీన్ చేస్తూ ఉంటారు. అక్కడ చెత్త డబ్బాలలో ఈగలు ముసరడం చూసి షాక్ అయిన ఒక ఆమె.. ఏంటని దగ్గరికి వెళ్లి చూడగా అందులో ఆ అమ్మాయి డెడ్ బాడీ ఉంటుంది. ఇంక అంతే అక్కడ ఆ బాడీని చూసి ఒక్కసారిగా భయపడిపోతుంది. ఇక అక్కడ ఉండే పారిశుద్ధ కార్మికులంతా వచ్చి ఆ శవాన్ని చూసి భయంతో పోలీసులకు ఇన్ఫామ్ చేస్తారు. ఆ అమ్మాయి ఫోటో మరో క్షణంలో అంతర్జాలం లోకి రాగా.. అలా సోషల్ మీడియాలో వచ్చిందో లేదో క్షణాల్లో వైరల్ అయిపోతుంది. కట్ చేస్తే ఎక్కడో నార్త్ లో మద్యం మత్తులో పడి ఉన్న విజయ్ ఆంటోనీ ని చూపిస్తారు. అక్కడ ఒక పోలీస్ ఆఫీసర్ విజయ్ ఆంటోనీకి కాల్ చేసి వాట్స్అప్ కి నీకు ఒక ఫోటో పంపించాను.. వెంటనే చూడు అని చూపించగా.. ఆ అమ్మాయి ఫోటో చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడి లేస్తాడు విజయ్ ఆంటోని. కట్ చేస్తే ఆ ఫోటోలో అమ్మాయికి ఎలా అయితే జరిగిందో.. తన కూతురుకి కూడా అలాగే జరిగి ఉంటుంది అని చూపించారు. ఇక వెంటనే బ్యాగ్ సర్దేసుకొని హైదరాబాద్ కి బయలుదేరుతాడు విజయ్ అంటోని. ఇందులో విజయ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. మొత్తానికైతే ఈ చూసిన ఆరు నిమిషాల వీడియో కచ్చితంగా సినిమా చూడాలి అనే సస్పెన్స్ క్రియేట్ చేసిందని చెప్పవచ్చు.ఇకపోతే ఈ వీడియో చూశాక ఆ సైకో కిల్లర్ ఎవరు? ఎందుకు బ్లాక్ డెవిల్ గా అమ్మాయిలను మార్చేస్తున్నారు..? అసలు అతడు వేస్తున్న ఆ ఇంజక్షన్ లో ఏముంది? ఇలా ప్రతి అంశం సస్పెన్స్ క్రియేట్ చేస్తూ సినిమా ఖచ్చితంగా చూడాలనే ఆసక్తి కలిగిస్తోందని చెప్పవచ్చు.
also read:Salman Khan: బెదిరింపుల వేళ కొత్త కార్ కొన్న సల్మాన్ ఖాన్..ఎన్ని కోట్లంటే?