SSMB 29 Update: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి(S.S. Rajamouli) ప్రస్తుతం మహేష్ బాబు(Mahesh Babu)తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. తెలుగు సినీ ఇండస్ట్రీలో అపజయం ఎరుగని దర్శకుడుగా గుర్తింపు పొందిన రాజమౌళి కేవలం టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాదు అంతర్జాతీయ స్థాయిలో కూడా దర్శకుడిగా గుర్తింపు పొందారు. ఇక రాజమౌళి డైరెక్షన్లో సినిమా వస్తుంది అంటే ఆ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొంటాయి. ఇక మహేష్ బాబుతో ఓ అడ్వెంచర్స్ పాన్ ఇండియా మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. రాజమౌళి సినీ కెరియర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
కోలీవుడ్ స్టార్ మాధవన్..
ప్రస్తుతం రాజమౌళి ఈ సినిమా షూటింగ్ పనులలో బిజీగా గడుపుతున్నారు. ఇప్పటికే పలు షెడ్యూల్స్ చిత్రీకరణ పూర్తి కాగా ప్రస్తుతం మరొక షెడ్యూల్ చిత్రీకరణ ప్రారంభించినట్లు సమాచారం. తాజాగా ఈ సినిమా షూటింగ్ సెట్లోకి ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో మాధవన్(Madhavan) అడుగు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో మాధవన్ కోసం ప్రత్యేకమైన పాత్ర రాజమౌళి సిద్ధం చేశారట. ఈ పాత్ర గురించి రాజమౌళి చెప్పగానే వెంటనే మాధవన్ సినిమాకు కమిట్ అయ్యారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈయన కూడా షూటింగ్లో పాల్గొన్నట్టు సమాచారం.
తండ్రి పాత్రలో మాధవన్..
ఇకపోతే ఈ సినిమాలో మాధవన్ మహేష్ బాబుకి తండ్రి పాత్ర(Mahesh Father Role)లో కనిపించబోతున్నారని వార్త వైరల్ అవుతుంది. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాల్సి ఉంది. ఇకపోతే మాధవన్ పాత్ర కోసం రాజమౌళి ముందుగా మరొక కోలీవుడ్ స్టార్ హీరో అయిన విక్రమ్(Vikram) ను, బాలీవుడ్ నటుడు నానా పటేకర్ ను సంప్రదించారట. అయితే కొన్ని కారణాల వల్ల ఈ ఇద్దరు హీరోలు ఈ సినిమాను రిజెక్ట్ చేయడంతో ఆ అవకాశం మాధవన్ అందుకున్నారని తెలుస్తుంది. రాజమౌళి సినిమాలో నటించడం అంటే వారికి కూడా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు లభిస్తుందనే సంగతి తెలిసిందే. అయితే వీరిద్దరి బిజీ షెడ్యూల్ కారణంగానే ఈ సినిమాని వదులుకున్నారని సమాచారం.
గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా…
ప్రస్తుతం ఈ షెడ్యూల్ చిత్రీకరణలో భాగంగా మాధవన్ కి సంబంధించిన సన్నివేశాలు ఉన్న నేపథ్యంలోనే ఈయన కూడా సినిమాలో భాగమైనట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా(Priyanka Chopra) హీరోయిన్ గా నటిస్తుండగా మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా భాగమయ్యారు. ఇక ఈ సినిమా కోసం దాదాపు 800 కోట్లకు పైగా బడ్జెట్ కేటాయించినట్లు తెలుస్తోంది. మొదటిసారి మహేష్ బాబు రాజమౌళి కాంబోలో ఈ సినిమా రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాపై పాన్ వరల్డ్ స్థాయిలోనే అంచనాలు ఉన్నాయి. RRR సినిమా తర్వాత రాజమౌళి డైరెక్షన్లో రాబోతున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై మంచి బజ్ ఉందని చెప్పాలి.. ఇక మహేష్ బాబు చివరిగా గుంటూరు కారం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇక ఈ సినిమా తర్వాత రాజమౌళి సినిమా షూటింగ్ పనులలో బిజీ అయ్యారు.
Also Read: Siri -Srihan: సిరితో పెళ్లి క్లారిటీ ఇచ్చిన శ్రీహన్.. మోగనున్న పెళ్లి భాజాలు!