Siri -Srihan: సిరి హనుమంత్ (siri hanumanth) శ్రీహన్(Srihan) పరిచయం అవసరం లేని పేరు. సోషల్ మీడియా ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో ఈ జంట ఒకటి. టిక్ టాక్ వీడియోలు, యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఇద్దరు ప్రస్తుతం ఇండస్ట్రీలో సెలబ్రిటీలుగా కొనసాగుతూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇక ఇద్దరు కూడా బిగ్ బాస్ (Bigg Boss)కార్యక్రమంలో కంటెస్టెంట్లుగా పాల్గొని సందడి చేశారు. అయితే వీరు బిగ్ బాస్ కార్యక్రమంలో ఉన్నప్పుడు వీరి మధ్య గొడవలు చోటు చేసుకున్నయని దాదాపు వీరి రిలేషన్ కు బ్రేకప్ చెప్పుకొనే పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి అంటూ సిరి గతంలో తెలియచేశారు.
బిగ్ బాస్ కంటెస్టెంట్లుగా సిరి.. శ్రీహాన్..
సిరి బిగ్ బాస్ కార్యక్రమంలో మరొక కంటెస్టెంట్ తో చాలా చనువుగా ఉన్న నేపథ్యంలోనే శ్రీహాన్ కోప్పడినట్లు ఇద్దరి మధ్య విభేదాలు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మాత్రం ఆ విభేదాలను పక్కనపెట్టి ఇద్దరు చాలా సంతోషంగా గడపడమే కాకుండా కెరియర్ పై పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టారు. సిరి ప్రస్తుతం సినిమాలు వెబ్ సిరీస్లలో నటిస్తూ బిజీగా ఉండగా శ్రీహాన్ సైతం సినిమా అవకాశాలను అందుకుంటున్నారు. త్వరలోనే శ్రీహన్ వర్జిన్ బాయ్స్ (Virgin Boys)అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. జూలై11వ తేదీ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
వచ్చే ఏడాది పెళ్లి..
ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా సిరితో రిలేషన్ గురించి అలాగే పెళ్లి(Wedding) గురించి శ్రీహాన్ కు ప్రశ్నలు ఎదురయ్యాయి. వీరిద్దరూ ప్రేమించుకుంటూ గత ఆరు సంవత్సరాలుగా రిలేషన్ లో ఉన్న విషయం తెలిసిందే. అంతే కాకుండా పెళ్లి కాకుండానే వీరిద్దరూ ఒక బాబుని దత్తత తీసుకొని బాబు బాధ్యతలను కూడా చూసుకుంటున్నారు. ఈ క్రమంలోనే వీరిద్దరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారా? అనే ప్రశ్న తరచూ అభిమానులకు కలుగుతుంది. ఈ క్రమంలోనే శ్రీహన్ పెళ్లి గురించి తాజాగా క్లారిటీ ఇచ్చారు.
ఐఫోన్ రిటర్న్ గిఫ్ట్..
సిరితో పెళ్లి గురించి ప్రశ్నలు ఎదురవడంతో వచ్చే ఏడాది కచ్చితంగా మా పెళ్లి జరుగుతుందని తెలియజేశారు. మాకంటూ కొన్ని డ్రీమ్స్ ఉన్నాయి, త్వరలోనే అవి నెరవేరబోతున్నాయని అనంతరమే పెళ్లి చేసుకోబోతున్నాము అంటూ ఈయన పెళ్లి గురించి క్లారిటీ ఇవ్వడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక వర్జిన్ బాయ్స్ సినిమా విషయానికి వస్తే..మిత్రా శర్మ(Mitraaw Sharma), గీతానంద్, శ్రీహాన్, జెన్నీఫర్ ఇమాన్యుల్, రోనిత్, అన్షుల హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మరి కొద్ది రోజులలో విడుదలకు సిద్ధమవుతుంది. దయానంద దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నుంచి ఇదివరకు విడుదల చేసిన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై మంచి అంచనాలను పెంచేసింది. ఇక ఈ సినిమా చూసిన అభిమానులకు ఐఫోన్లు గిఫ్ట్ గా ఇవ్వబడుతుందని థియేటర్లలో డబ్బులు వర్షం కురుస్తుంది అంటూ విభిన్నంగా ఈ సినిమాని ప్రమోట్ చేస్తున్న సంగతి తెలిసిందే.
Also Read: HBD Rishab Shetty: డైరెక్టర్ టూ పాన్ ఇండియా స్టార్.. రిషబ్ శెట్టి సినీ ప్రస్థానం!