Mahavatar Narasimha Crosses coolie war 2: ఈవీకెండ్ మూవీ లవర్స్‌కి పండగే పండగే పండగ. బాక్సాఫీసు మూడు సినిమా నువ్వా-నేనా అన్నట్టు పోటీ పడుతున్నాయి. నిన్నే కూలీ, వార్ 2లు విడుదలైన సంగతి తెలిసిందే. స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా వార్ 2, కూలీ చిత్రాలు థియేటర్లలోకి వచ్చాయి. భారీ అంచనాలు,బజ్‌తో థియేటర్లలో విడుదలైన ఈ సినిమాలు ఆడియన్స్ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. దీనికి విడుదలకు ముందు సినిమాలకు ఇచ్చిన హైప్. ఆడియన్స్‌తో కొత్త థ్రిల్ చేస్తాయంటూ ప్రచారం చేసింది మూవీ టీం. దీంతో ఎన్నో అంచనాలతో థియేటర్‌కు వెళ్లిన ఆడియన్స్‌ని ఈ రెండు సినిమాలు నిరాశపరిచాయి. ఫలితంగా మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్నాయి. దీంతో వార్ 2, కూలీకి మిశ్రమ స్పందన రావడంతో ఓ చిన్న సినిమా వీటికి గట్టి పోటీ ఇస్తుంది.
కూలీ కంటే వార్ 2నే టాప్
అదే మహావతార్ నరసింహా. ఈ మూవీ విడుదలై 22 రోజులు అవుతుంది. ఇప్పటికీ బుక్ మై షోలో వార్ 2, కూలీకి గట్టి పోటీ ఇస్తూ టికెట్స్ బుక్ అవుతున్నాయి. ఈ వారం లాంగ్ వీకెండ్ వచ్చింది. శుక్రవారం (ఆగష్టు 15), శనివారం, ఆదివారం. మూడు రోజుల సెలవులు. వీకెండ్ అంటేనే ముందుకు గుర్తొచ్చేది బాక్సాఫీసు సందడి. కొత్త సినిమాల రిలీజ్ కోసం ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అందులో లాంగ్ వీకెండ్ రావడంతో ఆడియన్స్ థియేటర్లకు క్యూ కడుతున్నారు. మిక్స్‌డ్ టాక్ వచ్చినప్పుటికి ర పెద్ద హీరోలు, పెద్ద సినిమాలు కావడంతో మూవీ లవర్స్ థియేటర్లకు క్యూ కడుతున్నారు. బుక్ మై షోలో టికెట్స్ భారీగా అమ్ముడుపోతున్నాయి. ఒక్క గంటల్లోనే వేలల్లో టికెట్స్ బుక్ అయ్యాయి. అయితే ఇక్కడ ఒకే రోజు కూలీ, వార్ 2 విడుదల కావడం, ఒకే టాక్ రావడంతో రెండో రోజు ఇందులో ఏదీ ఎక్కువ వసూళ్లు చేస్తుందా? అని అంత అంచనాలు వేశారు.
రిలీజ్ వరకు కూలీకి వెయ్యి కోట్లు కొడుతుందని ఇండస్ట్రీవర్గాలు నమ్మాయి. సౌత్‌లోనూ కూలీకే ఎక్కువ బజ్ ఉంది. కానీ, రిలీజ్ తర్వాత అంచనాలు తారుమారు అయ్యాయి. కూలీ, వార్ 2లకి ఒకే టాక్ వచ్చింది. దీంతో ఇప్పుడు ఈరెండు చిత్రాల్లో ప్రేక్షకాదరణ ఎక్కువ దేనికి ఉందని చూస్తే.. వార్ 2నే ముందంజలో ఉంది. ఒక గంటలో వార్ 2 టికెట్స్ బుక్ మై షోలో 62.44వేల టికెట్స్ బుక్ అవ్వగా.. కూలీ రెండో రోజు 39.64 టికెట్స్ బుక్ అయ్యాయి. చిన్న సినమా మహావతార్ నరసింహకు 22వ రోజు కూడా 20.8 వేల టికెట్స్ బుక్ అయ్యాయి. ఇవి అన్ని భాషల్లో కలిపి. ఇలా చూస్తుంటే.. కూలీ, వార్ 2 వంటి పెద్ద సినిమాను చిన్న సినిమా గట్టి పోటి ఇస్తుందనిపిస్తోంది. 22వ రోజు కూడా ఈ సినిమాకు 20వేలకు పైగా టికెట్స్ బుక్క్ అవ్వడం, అది కూడా గంటలోనే.
చిన్న సినిమా ముందు బోల్తా పడ్డ కూలీ, వార్ 2
అంటే మరికొన్ని రోజుల్లో కూలీ, వార్ 2లు బజ్ తగ్గిపోయినా.. మహావతార్ నరసింహాకే ఆడియన్స్ ఓటేస్తున్నారనిపిస్తుంది. నిన్నటితో కూలీ రిజల్ట్ తేలిపోయింది. తెలుగు ఆడియన్స్ కూడా ఎన్టీఆర్ వార్ 2 చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారనిపిస్తుంది. అయితే ఈ రెండు సినిమాల కంటే కూడా మహావతార్ నరసింహా చూసేందుకు ప్రేక్షకులు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. భారీ వసూళ్లలతో బాక్సాఫీసు దండయాత్ర చేస్తాయనుకున్న కూలీ, వార్ 2 ఫలితాలు ఏంటో నిన్నటి తేలిపోయింది. దీంతో చాలా మంది ప్రేక్షకులు వీటి కంటే అదే మహావతార్ నరసింహా చూసేందుకు ఆడియన్స్ ఆసక్తి చూపిస్తున్నారు. యానిమేటెట్ చిత్రంగా ఎలాంటి అంచనాలు లేకుండ థియేటర్లలో విడుదలై మౌత్ టాక్‌తోనే దూసుకుపోతుంది. రోజు రోజుకు వసూళ్లు పెంచుకుంటూ బాక్సాఫీసు వద్ద దండయాత్ర చేస్తోంది. మూడు వారాల క్రితం వచ్చిన ఈ సినిమా ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ రూ. 200 కోట్లకు పైగా వసూళ్లు చేసింది. ఇప్పటికీ పెద్ద సినిమాలకు ఇది గట్టి పోటీ ఇస్తుంది. కూలీ, వార్ 2లకు పోటీగా ఈ మూవీ టికెట్స్ బుక్ అవ్వడం విశేషం.
Also Read: Sravanthi Chokkarapu: జాతీయ జెండాను అవమానించిన యాంకర్ స్రవంతి చొక్కారపు? నెటిజన్స్ పైర్..