Pawan Kalyan: వైసీపీపై మరోసారి డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ విరుచుకుపడ్డారు. నేతల వ్యవహారశైలిపై దుమ్మెత్తిపోశారు. నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారని అన్నారు. పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీ బైపోల్‌పై వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చారు డిప్యూటీ సీఎం.
పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత అక్కడ టీడీపీ జెండా రెపరెపలాడింది. ఈ ఘన విజయాన్ని టీడీపీ ఎంజాయ్ చేయడంపై వైసీపీ నేతలు తమదైన శైలిలో విమర్శలు ఎక్కుపెట్టారు. సాక్షి గెజిట్ తాటికాయంత అక్షరాలతో బ్యానర్ వార్త వేసింది. ‘రిగ్గింగ్ ఎన్నికల్లో.. సిగ్గుపడే గెలుపు’ అంటూ రాసుకొచ్చింది.
నామినేషన్ల నుంచి పోలింగ్ వరకు ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందని ప్రస్తావించింది. స్వేచ్ఛగా ఎన్నికలు నిర్వహిస్తే.. వెబ్ కాస్టింగ్ బయటపెట్టాలని డిమాండ్ చేశారు. వైసీపీ నేతల చేసిన వ్యాఖ్యలపై తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు డిప్యూటీ సీఎం. 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కాకినాడలో జాతీయ జెండా ఎగురు వేశారు డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్.
రాష్ట్ర అభివృద్ధి గురించి వివరిస్తూనే ఇటీవల ఉప ఎన్నికలను ప్రస్తావించారు. తాను ప్రతి పక్ష నాయకులను నిత్యం చూస్తున్నానని, ఎన్నికల్లో ఓడిపోతే ఓటు చోరీ అని అంటున్నారని, గెలిచినప్పుడు ఓటు చోరీలు కనిపించవా అంటూ ప్రశ్నించారు. గతంలో 2019 అసెంబ్లీ, 2021 స్థానిక సంస్థల ఎన్నికలు చూశామని అన్నారు.
ALSO READ: ఏపీలో నేటి నుంచి ఫ్రీ బస్సు.. వారికి షాకింగ్ న్యూస్
వారు గెలిచినప్పుడు తాము ఏమీ అనలేదని, ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించామన్నారు. 2024 లో కూటమికి 164 సీట్లు వచ్చాయని అన్నారు. ఈవీఎంలు తప్పంటూ వైసీపీ నేతలు చెప్పడాన్ని తప్పుబట్టారు. గెలిస్తే ఒకలా.. ఓడిపోతే మరొకలా? ఇదేమి న్యాయమని వ్యాఖ్యానించారు. వైసీపీ వ్యవహారశైలిని అధినేత ఎత్తి చూపారని అంటున్నారు జనసేన నాయకులు.
ఇలాంటి విషయాలను నార్మల్‌గా మాట్లాడడం కరెక్టు కాదని, ఆ తరహా వేదికలపై మాట్లాడితే వైసీపీ నేతల గురించి ప్రజలకు తెలుస్తుందని అంటున్నారు. ప్రతీ విషయాన్ని భూతద్దంలో చూడడం మొదలు పెట్టారని అంటున్నారు కొందరు నేతలు. మొత్తానికి ఏదైతేనేం వైసీపీకి అధినేత సరైన కౌంటరిచ్చారని అంటున్నారు.
ఓడిపోతే ఓటు చోరీ అంటున్నారు: పవన్ కళ్యాణ్
గెలిస్తే మాత్రం ఓటు చోరీలు కనిపించవు
ఓడిపోతే ఒక న్యాయం.. గెలిస్తే మరో న్యాయమా..?
– పవన్ కళ్యాణ్ pic.twitter.com/LIUm1k4S0I
— BIG TV Breaking News (@bigtvtelugu) August 15, 2025