Mahavatar Narasimha Collections : తెలుగు చిత్ర పరిశ్రమలో ఈమధ్య ఎక్కువ మంది స్టార్ డైరెక్టర్లు పురాణాల ఆధారంగా కొత్త సినిమాలను తెరకెక్కిస్తున్నారు. ఇలా వచ్చిన సినిమాలు బాక్స్ ఆఫీస్ ని షేర్ చేసేలా కలెక్షన్స్ ని వసూలు చేస్తున్నాయి. పాజిటివ్ టాక్ ని అందుకోవడంతో ఎక్కువమంది పురాణాల మీద సినిమాలను తెరకెక్కించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఒకప్పుడు యాక్షన్ చిత్రాలకు పెద్ద పీట వేసింది తెలుగు పరిశ్రమ ఈ మధ్య పౌరాణిక కథలతో సినిమాలు వస్తున్నాయి. మొన్న వచ్చిన కల్కి మూవీ బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు అలాంటి ఒక కథతో వచ్చింది మహావతార్ నరసింహ.. ఈ మూవీ ఎటువంటి అంచనాలు లేకుండా థియేటర్లలోకి వచ్చింది. మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇక ఎనిమిది రోజులకు గాను ఎంత వసూల్ చేసిందో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..
‘మహావతార్ నరసింహ ‘ టోటల్ కలెక్షన్స్..
పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు మూవీ రిలీజ్ తర్వాత రోజు అంటే జూలై 25 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నరసింహ స్వామి జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది. ఈ సినిమా మైథాలజికల్ గా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కలెక్షన్లు కూడా బాగానే రాబడుతుంది. ఫస్ట్ డే కోటి 70 లక్షల కలెక్షన్స్ ను మాత్రమే రాబట్టింది.. మొత్తం నాలుగు రోజులకు గాను దాదాపుగా 23 కోట్లు వసూల్ చేసింది. ఐదో రోజు వసూళ్లు పెరగడంతో 30 కోట్లకు పైగా వచ్చాయి. ఆరు రోజులకు గాను 42 కోట్లు రాబట్టిందని తెలుస్తుంది. ఏడు రోజులకు 50 కోట్లు వసూల్ చెయ్యగా, 8 రోజులకు 61 కోటికి పైగా గ్రాస్ ను వసూల్ చేసిందని టాక్.. మరి ఈ కలెక్షన్స్ నిజమో కాదో తెలియాలంటే టీమ్ అధికారికంగా ప్రకటించేవరకు వెయిట్ చెయ్యాల్సిందే..
Also Read : మహేష్ బాబు మనసున్న మాహారాజు.. మరో చిన్నారికి పునర్జన్మ..
ఈ మూవీ బడ్జెట్ & బ్రేక్ ఈవెన్…
మహావతార్ నరసింహ జులై 25న ఎలాంటి ప్రచార ఆర్భాటాలు లేకుండా రిలీజైన ఈ చిత్రం వెండితెరపై ప్రకంపనలు సృష్టిస్తోంది. పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఈ సినిమా చూసేందుకు ఎగబడుతున్నారు. మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ ను అందుకుంది. ఇందులో నటీనటులు లేకుండా కేవలం యానిమేషన్‌తోనే తెరకెక్కిచడం వల్ల పాత్రలతోనూ, ఆ భావోద్వేగాలతోనూ ప్రేక్షకులు మరింత ఎక్కువగా కనెక్ట్ అవుతున్నారు.. మొత్తానికి మూవీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. 4 కోట్ల వ్యయంతో తెరకెక్కిన ఈ మూవీ 61 కోట్లకు పైగా వసూల్ చెయ్యడం మామూలు విషయం కాదు. ఇలాంటి సినిమాలకు ప్రేక్షకులు ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నారు. ఈమధ్య ఈ సినిమాను చూడడానికి ఎక్కువ మంది థియేటర్ల వైపు పరుగులు పెడుతున్నారని తెలుస్తుంది. దేవుడు సినిమా కాబట్టి చాలామంది చెప్పులను బయటే వదిలేసి లోపలికి వెళ్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కలెక్షన్ల జోరు చూస్తుంటే ఈ రెండు రోజుల్లో 100 కోట్లు దాటే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా కూడా కలెక్షన్ల వర్షం కురుస్తున్న ఈ సినిమాకే ప్రేక్షకులు ఓట్లు వేస్తున్నారు..