E-Paper
Advertisement

Sreeleela: తల్లి వల్ల శ్రీలీల కెరియర్ ఇబ్బందులలో.. డిమాండ్లు మరీ ఎక్కువయ్యాయా?

Sreeleela: తల్లి వల్ల శ్రీలీల కెరియర్ ఇబ్బందులలో.. డిమాండ్లు మరీ ఎక్కువయ్యాయా?
Advertisement

Sreeleela: టాలీవుడ్ ఇండస్ట్రీలోకి పెళ్లి సందD అనే సినిమా ద్వారా హీరోయిన్ గ పరిచయమయ్యారు యంగ్ బ్యూటీ శ్రీ లీల(Sreeleela). మొదటి సినిమాతో మంచి సక్సెస్ అందుకోలేకపోయిన, తన నటన అందంతో మాత్రం శ్రీ లీల ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక ఈ సినిమా తర్వాత ఈమెకు తెలుగులో వరుసగా అవకాశాలు రావడం మొదలయ్యాయి. ఇక రవితేజతో కలిసి నటించిన ధమాకా(Dhamakha) సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకోవడంతో శ్రీ లీలకు సుమారు అరడజనకు పైగా తెలుగులో అవకాశాలు వచ్చాయి. ఇక వీటిలో భగవంత్ కేసరి, గుంటూరు కారం వంటి సినిమాలు మినహా మిగిలిన ఏ సినిమాలు పెద్దగా ప్రేక్షకాదరణ నోచుకోలేకపోయాయి.

ఇబ్బందులలో శ్రీ లీల కెరియర్…

Advertisement

ఇలా శ్రీలీల సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయిన ఈమె మాత్రం వరుస అవకాశాలను అందుకుంటున్నారు. ప్రస్తుతం సౌత్ సినిమాలు మాత్రమే కాకుండా బాలీవుడ్ సినిమా అవకాశాలను కూడా అందుకుంటూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. అయితే ఇటీవల శ్రీ లీల కొన్ని సినిమాలకు కమిట్ అవుతూ కొద్దిరోజులు షూటింగ్లో పాల్గొని తిరిగి ఆ సినిమాల నుంచి తప్పుకుంటున్న సంగతి తెలిసిందే. ఇలా శ్రీల మధ్యలో సినిమాల నుంచి తప్పుకోవడం వెనుక తన తల్లి ప్రమేయం ఉంది అంటూ కూడా గతంలో వార్తలు వచ్చాయి. శ్రీ లీల కెరియర్ మొత్తం తన తల్లి స్వర్ణలత(Swarnalatha) చేతులలోనే ఉందనే ఆమె చెప్పిన విధంగానే శ్రీ లీల సినిమాలకు కమిట్ అవుతున్నారని సమాచారం.

రెమ్యూనరేషన్ ఓకే అయితే చాలా?

Advertisement

సినిమాల విషయంలో శ్రీ లీలకు సరైన స్వేచ్ఛ లేదని, కథ కథనం ఎలా ఉన్నా రెమ్యూనరేషన్ ఓకే అయితే తన తల్లి శ్రీలీలకు ఇష్టం లేకపోయినా సినిమాలకు సైన్ చేయిస్తున్నారంటూ పలువురు నిర్మాతలు తెలియజేస్తున్నారు. ఇలా శ్రీ లీల కెరియర్ లో సూపర్ హిట్ సినిమాలు లేకపోవడానికి ఆమె కెరియర్ ఇబ్బందులలో పడటం వెనక కూడా తన తల్లి స్వర్ణలత ప్రమేయం ఉందని ఆరోపణలు ఇండస్ట్రీలో వెలబడుతున్నాయి. ఇకపోతే సినిమాల విషయంలో శ్రీ లీల చేసే డిమాండ్ల కంటే కూడా తన తల్లి చేసే డిమాండ్లు కూడా ఎక్కువయ్యాయని నిర్మాతలు వాపోతున్నారు.

కార్తీక్ ఆర్యన్ తో రిలేషన్?

ఈ విషయంలో శ్రీ లీల సరైన నిర్ణయం తీసుకోకపోతే ఆమె కెరియర్ కి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయని స్పష్టమవుతుంది. ఇక ఈమె సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం రవితేజ హీరోగా నటిస్తున్న మాస్ జాతర (Mass Jathara)సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు అలాగే పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో కూడా నటిస్తున్నారు. ఇలా ఈ సినిమాలతో పాటు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా రెండు సినిమాలకు కమిట్ అయ్యారని తెలుస్తుంది. ప్రస్తుతం కార్తీక్ ఆర్యన్ కు జోడిగా ఒక సినిమాలో నటిస్తున్నారు అలాగే అట్లీ డైరెక్షన్ లో రణవీర్ సింగ్ హీరోగా నటిస్తున్న సినిమాలో కూడా శ్రీ లీల నటించబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఇలా బాలీవుడ్ సినిమాలలో బిజీ అవుతున్న తరుణంలో ఈమె హీరో కార్తీక్ ఆర్యన్(Karthik Aryan) తో రిలేషన్ లో ఉన్నారనే వార్తలు కూడా హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే.

Also Read: Priyanka – Siri: వరలక్ష్మి వ్రతం ఈ వారం కాదమ్మా.. పెళ్లి కాకుండానే పూజలేంటో.. ప్రియాంక, సిరిలపై నెటిజన్స్ ఫైర్

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×