Mahesh Babu : టాలీవుడ్ స్టార్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఒకవైపు వరస సినిమాలు చేస్తూనే.. మరోవైపు సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ ప్రేక్షకుల మనసులో రియల్ హీరో అనే స్థానాన్ని దక్కించుకున్నాడు. ఇప్పటివరకూ మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా వేల మంది పిల్లలకి ఉచితంగా హార్ట్ సర్జరీలు చేయించారు. ఎంతోమంది ఇళ్లలో సంతోషాలను నింపాడు మహేష్. ఎందరో చిన్నారుల ప్రాణాలను కాపాడి జనాల హృదయాలల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు. ఆయన ఫ్యామిలీలో ఒక్క మహేష్ బాబు మాత్రమే కాదు అటు నమ్రత, సితార కూడా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రేక్షకుల మనసు దోచుకుంటున్నారు. తాజాగా మహేష్ బాబు మరో చిన్నారి ప్రాణాలను కాపాడారు. అందుకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
చిన్నారికి పునర్జన్మ ఇచ్చిన మహేష్ బాబు..
మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా మరో చిన్నారి ప్రాణం నిలబడింది. ఆంధ్రప్రదేశ్ పశ్చిమగోదావరి జిల్లాలోని పాలకోడేరు మండలం కుముదవల్లికి చెందిన 9 ఏళ్ల పిల్లి వర్షితకు మహేష్ బాబు ఫౌండేషన్ పునర్జన్మ ప్రసాదించింది. విజయ్ కుమార్ మార్తమ్మ దంపతులకు జన్మించిన వర్షితకు పుట్టుకతోనే గుండెలో రంధ్రం పడింది. వాళ్లకు ఆర్థిక స్తోమత అంతంత మాత్రమే. ఈ క్రమంలో వాళ్లు మహేష్ బాబు ఫౌండేషన్ను సంప్రదించారు. వెంటనే స్పందించిన టీం ఆ చిన్నారికి విజయవాడలోని ఆంధ్ర బ్రెయిన్, హార్ట్ ఆసుపత్రిలో చికిత్సను అందించారు. ప్రస్తుతం ఆ చిన్నారి ఆసుపత్రిలో కోలుకుంటుంది.. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో మహేష్ అభిమానులు తమ అభిమాన హీరో పై ప్రశంశలు కురిపిస్తున్నారు.
మహేష్ బాబు ఫౌండేషన్..
మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా వేల మంది పిల్లలకి ఉచితంగా హార్ట్ సర్జరీలు చేయించారు మహేష్.. విజయవాడలోని ఆంధ్రా హాస్పిటల్స్‌తో కలిసి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు మహేష్. ఇలా మహేష్ బాబు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు 4500 లకి పైగా పిల్లలకి ఉచితంగా హార్ట్ ఆపరేషన్స్ చేయించినట్లు ఆంధ్రా హాస్పిటల్స్ కూడా ప్రకటించింది.. ఈరోజుల్లో డబ్బు గురించి ఆలోచించడమే తప్ప ఇలాంటి కార్యక్రమాలు ఆలోచించే హీరోలు చాలా తక్కువ అని మహేష్ బాబు అభిమానులు సోషల్ మీడియా ద్వారా పోస్ట్లు పెడుతున్నారు.
Also Read: తేజాకు అడ్డంగా దొరికిపోయిన శోభా శెట్టి.. ఇంత పగేంటి భయ్యా..
మహేష్ బాబు సినిమాల విషయానికొస్తే..
మహేష్ బాబు గత కొన్నేళ్లుగా బ్యాక్ టు బ్యాక్ హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకుంటున్నాడు. గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ మూవీ మిక్స్డ్ టాక్ ని అందుకున్న కూడా కలెక్షన్ మాత్రం భారీగానే వసూలు చేసింది.. ప్రస్తుతం దర్శకదీరుడు రాజమౌళి కాంబినేషన్లో తన 29వ సినిమాని చేస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 26న ప్రేక్షకులు ముందుకు రాబోతుందని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మూవీ తర్వాత సందీప్ రెడ్డి వంగతో ఓ సినిమా చేయబోతున్నట్లు గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.