Priyanka – Siri: శ్రావణమాసం కావడంతో ప్రతి ఒక్కరు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తూ ఉంటారు. అయితే శ్రావణ మాసంలో వచ్చే వరలక్ష్మీ వ్రతాన్ని(Varalakshmi Vratam) ఎంతో ఘనంగా జరుపుకుంటారు. వరలక్ష్మీ వ్రతం ఆగస్టు 8వ తేదీ రాబోతున్న నేపథ్యంలో ఇప్పటికే పలువురు వరలక్ష్మి వ్రతం కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే కొంతమంది బుల్లితెర నటీమణులు మాత్రం ఇప్పటికే వరలక్ష్మి వ్రతం జరుపుకొని అందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు. తాజాగా బిగ్ బాస్ కంటెస్టెంట్ గా మంచి సక్సెస్ అందుకున్న సిరి హనుమంత్ (Siri Hanumanth) తన ప్రియుడు శ్రీహన్(Srihan) తో కలిసి వరలక్ష్మీ వ్రతం జరుపుకున్నారు.
తల్లితో కలిసి వ్రతం చేసిన ప్రియాంక…
ఇలా సిరి తన వరలక్ష్మీ వ్రతానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఇవి కాస్త వైరల్ అవుతున్నాయి. అదేవిధంగా తాజాగా ప్రియాంక జైన్(Priyanka Jain) కూడా వరలక్ష్మీ వ్రతం ఎంతో ఘనంగా జరుపుకున్నారు. తాజాగా ఈ వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన వీడియోని ఈమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఎంతో ఘనంగా భక్తిశ్రద్ధలతో అమ్మవారికి పూజ చేయడమే కాకుండా బుల్లితెర సెలబ్రిటీలను ఆహ్వానించి వారికి తాంబూలాలు కూడా ఇచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ వరలక్ష్మి వ్రత వేడుకలలో భాగంగా ప్రియాంక ఎంతో చూడముచ్చటగా ఉన్నారు.
పెళ్లి కాకుండా వ్రతం చేయొచ్చా?
చాలా సాంప్రదాయబద్ధంగా ఈ పూజ వేడుకను నిర్వహించారని తెలుస్తోంది. ఇక ఈ పూజా కార్యక్రమంలో భాగంగా ప్రియాంక తన తల్లితో కలిసి ఈ వ్రతం ఆచరించారు. ఇక ఈ వేడుకలో పాల్గొన్న వారందరూ కూడా త్వరగా పెళ్లి కావాలి అంటూ ఆశీర్వదించారు. ఇలా ఇక్కడి వరకు బానే ఉన్నా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది ప్రియాంకపై విమర్శలు కురిపించడం మొదలుపెట్టారు. వరలక్ష్మీ వ్రతం ఆగస్టు 8వ తేదీ అయితే ఇప్పుడే వరలక్ష్మీ వ్రతం చేయడం ఏంటి అంటూ కొంతమంది నెటిజన్స్ ఈ వీడియోలపై విమర్శలు చేస్తున్నారు.
?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA%3D%3D
ఇక పెళ్లి కాకుండానే సిరి తన ప్రియుడితో కలిసి పూజ చేసుకోవడం, ప్రియాంక తన తల్లితో కలిసి పూజ చేసుకోవడంతో పెళ్లి కాకుండానే వ్రతాలు చేసుకోవడం ఏంటో అంటూ కూడా విమర్శలు కురిపిస్తున్నారు. ఇలా వీరందరూ వరలక్ష్మీ వ్రతం చేసుకోవడం వెనుక భక్తి ఒక కారణమైతే యూట్యూబ్ వ్యూస్ కోసమే ఇలా చేస్తున్నారంటూ వీరిపై విమర్శలు కురిపిస్తున్నారు. అయితే మరి కొంతమంది మాత్రం వీరికి మద్దతుగా కామెంట్లు చేస్తున్నారు. పెళ్లి కాని వారు కూడా తల్లితో కలిసి పూజ చేసుకోవడంలో తప్పులేదు అంటూ ప్రియాంకకు మద్దతుగా నిలుస్తున్నారు. ఇక ప్రియాంక జైన్ ఇటీవల వరుస బుల్లితెర కార్యక్రమాలలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు. ఇక ఈమె మరో బుల్లితెర నటుడు శివకుమార్(Siva Kumar) తో గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే త్వరలోనే ఈ జంట కూడా పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు.
Also Read: Jr.NTR Fans: యుద్ధ ట్యాంకర్లతో ర్యాలీ … ఇదెక్కడి మాస్ క్రేజ్ రా బాబు!