Nara Rohith: నారా రోహిత్ (Nara Rohit)విభిన్నమైన కథా చిత్రాలను ఎంపిక చేసుకుంటూ హీరోగా ప్రేక్షకుల ముందుకు వస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఇటీవల నారా రోహిత్ భైరవం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.. ఇలా భైరవం సినిమా ద్వారా మంచి సక్సెస్ అందుకున్న ఈ హీరో ఇక త్వరలోనే సుందరకాండ(Sundarakanda) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా వినాయక చవితి పండుగను పురస్కరించుకొని ఆగస్టు 27 తేదీ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేస్తున్నారు.
విమర్శలను ఎదుర్కోవాల్సిందే…
ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా నారా రోహిత్ వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. ఇందులో భాగంగానే ఈయన ఒక ఇంటర్వ్యూ సందర్భంగా సినిమాల గురించి వచ్చే నెగెటివిటీ గురించి ముఖ్యంగా తన సినిమాల విషయంలో జరిగే ట్రోల్స్ గురించి స్పందించారు. ఒక సినిమాని తెరకెక్కించడం ఎంత కష్టమో ఇటీవల కాలంలో సినిమాని విడుదల చేయడం అంతే కష్టంగా మారిందని, సినిమా విడుదల చేసిన తర్వాత వచ్చే ట్రోల్స్ ఎదుర్కోవడం మరింత కష్టతరం అవుతుందని తెలిపారు. సినిమా అంతా బాగుండి ఏదో ఒకచోట ప్రేక్షకులను డిసప్పాయింట్ చేసిన అదే విషయంపై విమర్శలు చేస్తారని రోహిత్ వెల్లడించారు.
ఇంటి పేరే సమస్యగా మారింది…
ఇక నా విషయంలో ఇలాంటి వాటి గురించి చెప్పాల్సిన పనిలేదు. నా సినిమాల విషయంలో నా ఇంటిపేరు(Sur Name) నాకు సమస్యగా మారుతోందని వెల్లడించారు. నేను టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మాత్రమే సినిమాలు చేస్తానని విమర్శలు కూడా నాపై ఉన్నాయి. తాను సుందరకాండ సినిమాని గత మూడు సంవత్సరాల క్రితం కమిట్ అయ్యాను. ఈ సినిమా ఇప్పుడు విడుదలవుతుంది. రెండు నెలల వ్యవధిలోనే రెండు సినిమాలు రావడంతో చాలామంది మా ప్రభుత్వం ఉన్నప్పుడే సినిమాలు వస్తాయాంటూ విమర్శిస్తుంటారు. ఇలాంటి విమర్శలను ఎదుర్కోవడం అలవాటుగా మారిపోయిందని రోహిత్ వెల్లడించారు.
హీరోయిన్ గా రీ ఎంట్రీ ఇచ్చిన శ్రీదేవి..
ఇక నారా రోహిత్ పెదనాన్న నారా చంద్రబాబు నాయుడు(Nara Chandrababu Naidu) స్వయంగా ఏపీ ముఖ్యమంత్రి కావడంతో తన పట్ల కూడా రాజకీయాల పరంగా కొన్ని విమర్శలు వస్తుంటాయని రోహిత్ తెలిపారు. సినిమా కూడా రాజకీయం లాంటిదేనని గత నాలుగు సంవత్సరాలు చేసిన మంచిని మర్చిపోయి చివరి ఒక సంవత్సరం ఏమైతే తప్పు చేసి ఉంటామో దాన్ని దృష్టిలో పెట్టుకొని విమర్శిస్తుంటారు. సినిమాలో కూడా అంతే సినిమా అంత బాగుండి క్లైమాక్స్ బాగలేకపోతే తప్పకుండా విమర్శలు వస్తాయి అంటూ రోహిత్ ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. ఇక సుందరకాండ విషయానికి వస్తే వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వంలో రోహిత్, శ్రీదేవి(Sridevi), వృతి వాఘాని(Vriti Vaghani) హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ వాసుకి కీలక పాత్రలో నటిస్తున్నారు. ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా ఆగస్టు 27న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.