BigTV English

Teja Sajja: మరోసారి మహేష్ ఫ్యాన్స్ ని హర్ట్ చేసిన తేజ సజ్జా.. మిరాయ్ పై ఎఫెక్ట్..

Teja Sajja: మరోసారి మహేష్ ఫ్యాన్స్ ని హర్ట్ చేసిన తేజ సజ్జా.. మిరాయ్ పై ఎఫెక్ట్..

Mahesh Babu Fans Fires on Teja Sajja: మిరాయ్ విడుదల సమయంలో సూపర్ హీరో తేజ సజ్జా తప్పులో కాలేసి విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ముఖ్యంగా సూపర్ స్టార్ ఫ్యాన్స్ నుంచి తేజ సజ్జాకు ప్రస్తుతం తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఇప్పటికే తేజ సజ్జాపై మహేష్ ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు. ఇప్పుడు ssmb29 టైటిల్ పేరు తప్పుగా చెప్పి మహేష్ అభిమానుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తేజ సజ్జ చేసిన ఈ తప్పు ఇప్పుడు మిరాయ్ పై ప్రభావం పడుతోంది. తేజ సజ్జా మిరాయ్ ని బాయ్ కాట్ చేస్తామంటూ మహేష్ ఫ్యాన్స్ విమర్శలు చేస్తున్నారు.


ఇండియ మోస్ట్ అవైయిటెడ్ ప్రాజెక్ట్ గా

ఇంతకి అసలు విషయం ఏంటంటే.. ఇండియా మోస్ట్ అవైయిటెడ్ చిత్రాల్లో #SSMB29  ఒకటి. రాజమౌళి, మహేష్ బాబు కాంబోలో  పాన్ వరల్డ్ ఈ ప్రాజెక్ట్ రూపొందుతోంది. మహేష్ ప్రధాన పాత్రలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జక్కన్న ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. #SSMB29 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమాను ప్రకటించారు. ప్రస్తుతం ఇదే టైటిల్ తో ఈ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటోంది. మూవీ టీం, సోషల్ మీడియా.. ఇతర ప్లాట్ ఫాంలో ఇదే టైటిల్ ట్రెండ్ అవుతోంది. ఆఖరికి కెన్యా ప్రభుత్వ అధికారులు కూడా ఈ చిత్రాన్ని #SSMB29 గా పిలిచారు. అలాంటి ఈ ప్రెస్టెజియస్ ప్రాజెక్ట్ ని తాజాగా ఈ కుర్ర తప్పుగా మెన్షన్ చేశాడు.

టైటిల్ పేరు కూడా తెలియదా?

ప్రస్తుతం తన మూవీ మిరాయ్ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో జరిగిన ఈవెంట్ లో మాట్లాడుతూ.. రాజమౌళి, మహేష్ మూవీ ప్రస్తావన తీసుకువచ్చాడు. ఈ సందర్భంగా #SSMB29ని #SSRMB29 అని రిఫర్ చేశాడు. ఇది మహేష్ అభిమానులను హర్ట్ చేసింది. దీంతో మహేష్ అభిమానులంతా ఈ కుర్ర హీరోపై మండిపడుతున్నారు. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ రాజమౌళి సైతం SSMB29గానే పిలుస్తున్నారు. ఫ్యాన్స్ అభిప్రాయం ప్రకారం.. ఈ ప్రాజెక్ట్ పూర్తిగా మహేష్ స్టార్ పవర్‌పై నడుస్తోంది. ఈ విషయం పక్కన పెడితే.. #SSMB29 ప్రస్తుతం బ్రాడ్ టైటిల్. అంతర్జాతీయ వ్యాప్తంగా వినిపిస్తున్న టైటిల్ ఇది.


తేజ సజ్జాపై ఫ్యాన్స్ ఫైర్

ఒక హీరో అయ్యుండి ఇంత పెద్ద ప్రాజెక్ట్ టైటిల్ తప్పుగా పలకడం ఏంటీ? ఆ మాత్రం అవగహన లేకుండా ఉన్నాడా? అని మహేష్ ఫ్యాన్స్ విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు మిరాయ్ మూవీపై కూడా వాళ్లు ట్రోల్ చేస్తున్నారు. ఇప్పటికే గుంటూరు కారం రిలీజ్ విషయంలో తేజ సజ్జాపై కోపంగా ఉన్న ఫ్యాన్స్ ని… అతడి తాజా తీరు మరింత రెచ్చగొట్టింది. గతేడాది సంక్రాంతికి మహేష్ గుంటూరు కారం, తేజ సజ్జా హనుమాన్ మూవీ రెండు ఒకసారి బాక్సాఫీసు వద్ద పోటీ పడ్డాయి. ఒక కుర్ర హీరో.. మహేష్ బాబుకు పోటీ రావడాన్ని ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోయారు. ఇప్పటికే ఆ విషయంలో తేజ సజ్జాపై గుర్రుగా ఫ్యాన్స్.. ఇప్పుడు తన వ్యాఖ్యలతో మరింత రెచ్చగోట్టాడు ఈ సూపర్ హీరో.

Related News

Megastar Chiranjeevi : ఏంటి బాసు ఇప్పటికీ నీ గ్రేసు, కొంపదీసి టైం ట్రావెల్ మిషన్ దొరికిందా?

The Conjuring-Last Rites: హర్రర్ సీన్స్ వస్తుంటే జోకులు.. ‘కంజూరింగ్’ మూవీ థియేటర్‌లో కొట్టుకున్న జంటలు!

Sree Vishnu : శ్రీ విష్ణు కామ్రేడ్ అవతారం… కామెడీ చేసుకోకుండా ఇవన్నీ ఎందుకో?

Sharwanand : చేసినవి కొన్ని.. చేయాల్సినవి మరిన్ని… దిక్కుతోచని స్థితిలో శర్వా

AA22xA6 : అట్లీ-అల్లు అర్జున్ రేంజ్ సినిమా చేస్తా.. కొరియోగ్రాఫర్ ఓపెన్ ఛాలెంజ్

SYG Shooting: హమ్మయ్యా.. షూట్ స్టార్ట్ అయింది… బాలీవుడ్ స్టార్‌ని ఢీ కొడుతున్న సుప్రీం హీరో

×