Swiggy: డిజిటల్ యుగంలో కాలు కదపకుండా స్మార్ట్ ఫోన్‌లో ఒక్క బటన్ నొక్కితే చాలు. కావాల్సిన వన్నీ మన ముందుకొస్తాయి. కంపెనీలు, షాపులు ఎంత రేట్లు వడ్డిస్తున్నాయో పట్టించుకోము. ఫలితంగా జేబుకి చెల్లు పడుతోంది. ఇక ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీల గురించి చెప్పనక్కర్లేదు. ఇంట్లో కూర్చుని ఫుడ్ ఆర్డరిస్తే చాలు నిమిషాల వ్యవధిలో మన ముందుకొస్తుంది. అందుకు అయ్యే ఖర్చు చూస్తే వినియోగదారులకు షాక్ తప్పదు. రెస్టారెంట్‌కి వెళ్లి నేరుగా కొనుగోలు చేస్తే.. యాప్‌లో ఆర్డర్ చేసే ధరకు భారీ తేడా ఉంటోంది. అందుకు ఎగ్జాంఫుల్ ఓ కస్టమర్.
తమిళనాడులోని కోయంబత్తూరుకి చెందిన సుందర్, స్విగ్గీ యాప్‌లో కనిపించే ధరల గురించి తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు. తన ఇంటికి రెండు కిలోమీటర్ల దూరంలోవున్న ఓ రెస్టారెంట్ నుంచి స్విగ్గీ ద్వారా వస్తువులు ఆర్డర్ చేశాడు. ఆ వస్తువులను నేరుగా అదే రెస్టారెంట్‌కు వెళ్లి కొనుగోలు చేశాడు. రెండు బిల్లులను కంపేర్ చేసిన తర్వాత అతడికి దిమ్మతిరిగే వాస్తవాలు బయటపడ్డాయి.
స్విగ్గీలో ఆర్డర్ చేసినందుకు మొత్తం బిల్లు రూ. 1,473 వచ్చింది. అదే ఆహారాన్ని రెస్టారెంట్‌లో కొనుగోలు చేసినందుకు ఖర్చు కేవలం రూ. 810. దాదాపు 81 శాతం ఎక్కువ ధర అన్నమాట. ఇంట్లో కూర్చుని కాలు కదపలేనందుకు ఏకంగా రూ. 663 అదనంగా చెల్లించాడు. ఈ విషయాలను ఎక్స్ వేదికగా షేర్ చేశాడు. స్విగ్గీ- ఆఫ్ లైన్ రెస్టారెంట్ బిల్లులకు సంబంధించి స్క్రీన్ షాట్లను జతచేశాడు.
దీనిపై దయచేసి వివరణ ఇవ్వాలంటూ స్విగ్గీ నిర్వాహకులను కోరాడు. 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న రెస్టారెంట్ నుంచి ఫుడ్ తెప్పించుకున్నందుకు ఇంత వ్యత్యాసం ఎందుకని ప్రశ్నించాడు. ఆన్‌లైన్ సౌకర్యానికి అసలైన మూల్యం ఇదేనా? అని ప్రశ్నించాడు. కామన్ మేన్ పెట్టిన పోస్ట్ క్షణాల్లో వైరల్ అయ్యింది.
ALSO READ: పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. భారీ పెరిగిన ధర
ఏకంగా 30 లక్షల మంది దీన్ని వీక్షించారు. ఈ వ్యవహారంపై స్విగ్గీని సంప్రదించాడు. వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఇది కేవలం సుందర్ మాత్రమేకాదు. దేశంలో లక్షలాది మంది కస్టమర్లు ఉన్నారు. వారిపై ఏ స్థాయిలో స్విగ్గీ వడ్డిస్తుందో? అన్న ప్రశ్నలు సోషల్ మీడియాలో రైజ్ అవుతున్నాయి.
నార్మల్ గా అయితే ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలైన స్విగ్గీ, జొమాటో పండగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని ప్లాట్‌ఫామ్ ఫీజులు పెంచుతాయి. స్విగ్గీ మూడుసార్లు ఆ తరహా ఫీజును పెంచి జీఎస్‌టీతో కలిపి ఆర్డర్‌కు రూ. 15 వసూలు చేస్తోంది. జొమాటో తన ఫీజును 20 శాతం పెంచేసిన విషయం తెల్సిందే.
Hey @Swiggy, please explain. Why does ordering food in the app, 81% expensive than buying the same food from the same outlet, just 2kms away. Is this the real cost of convenience ? The extra that I have to pay to get the food delivered is INR 663. pic.twitter.com/rvLghtJJ3H
— Sunder (@SunderjiJB) September 7, 2025