Babu Mohan: సినిమా ఇండస్ట్రీలో నటుడిగా, కమెడియన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో సీనియర్ నటుడు బాబు మోహన్(Babu Mohan) ఒకరు. ఈయన గత కొన్ని దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. అయితే ఇటీవల కాలంలో బాబు మోహన్ రాజకీయాలలో(Politics)కి అడుగుపెట్టిన నేపథ్యంలో సినిమాలను కూడా కాస్త తగ్గించారని చెప్పాలి . గత కొంతకాలంగా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నా ఈయన ప్రస్తుతం తిరిగి సినిమాలలో నటిస్తున్నారు. ఇకపోతే తాజాగా సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు రావాలి అంటే టాలెంట్ ఒకటే కాదు కులం(Caste) కూడా ఉండాలి అంటూ ఈయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
దళితులకు అవకాశాలు ఉండవా?
ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరిలో కూడా క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువగా ఉంది. అయితే సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు రావాలి అంటే ఉన్నత వర్గానికి చెందిన వారే ఉండాలని దళితులకు సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు ఉండవు అంటూ తాజాగా బాబు మోహన్ చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్రదుమారం రేపుతున్నాయి. తాను ఒక దళిత కుటుంబంలో జన్మించిన నేపథ్యంలో ఇండస్ట్రీలో తనకు ఎదురైనా చేదు అనుభవాల గురించి ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో తనకు మంచిగా అవకాశాలు వచ్చేవని బాబు మోహన్ తెలిపారు.
కులానికి ప్రాధాన్యత..
ఇక ఇప్పుడైతే తాను ఒక దళిత కుటుంబానికి చెందిన వ్యక్తి అనే విషయం తెలిసిందో అప్పటినుంచి అవకాశాలు రావడం పూర్తిగా తగ్గిపోయాయని, ఇలా దళితుడని ఒక కారణంతోనే అవకాశాలు ఇవ్వలేదని తెలియజేశారు. తాను రాజకీయాలలోకి వచ్చిన తర్వాత నా కులం ఏంటో అందరికీ తెలిసింది. అప్పుటి నుంచే అవకాశాలు రాలేదని ఈయన వెల్లడించారు. సినిమా ఇండస్ట్రీలో ప్రతిభ ఒకటే ఉంటే సరిపోదని కులానికి కూడా అధిక ప్రాధాన్యత ఇస్తారు అంటూ ఈయన ఇండస్ట్రీలో ఉన్న కుల వివక్షత(Caste discrimination) పై చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సంచలనగా మారాయి. ఇప్పటివరకు ఇండస్ట్రీలో కుల వివక్ష గురించి ఎవరు ప్రస్తావించకపోయిన తాజాగా బాబు మోహన్ చేసిన ఈ వ్యాఖ్యలు మాత్రం చర్చలకు కారణమయ్యాయి.
మంత్రిగా బాధ్యతలు..
బాబు మోహన్ ఖమ్మం జిల్లాలోని బీరోలు గ్రామంలో జన్మించారు. ఈయన తండ్రి ఆంధ్ర ప్రదేశ్ రెవిన్యూ శాఖలో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేశారు. అయితే ఈయనకు సినిమాలంటే ఎంతో ఆసక్తి ఉన్న నేపథ్యంలో సినిమా ఇండస్ట్రీ వైపు అడుగులు వేశారు.బదులేది చిత్రంతో తెరంగేట్రం చేశాడు , ఆ తర్వాత ఆహుతి, అంకుశం మామగారు వంటి వరుస హిట్ సినిమాలలో నటించి నటుడిగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు. ఇక సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు పొందిన తర్వాత ఈయన రాజకీయాలలోకి వచ్చారు. ఎన్టీ రామారావు గారు ఉన్న సమయంలో తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన ఈయన కొంతకాలం పాటు తెలుగుదేశం పార్టీలో కొనసాగారు, అలాగే మంత్రిగా కూడా బాధ్యతలను తీసుకున్నారు. ఇలా సినిమా ఇండస్ట్రీలోనూ రాజకీయ రంగంలోనూ బాబు మోహన్ తనదైన గుర్తింపు సొంతం చేసుకున్నారు.
Also Read: Big tv Kissik Talks: రష్మికతో మాటల్లేవ్… నిజ స్వరూపం బయటపెట్టిన ప్రేరణ?