Mahesh Babu: ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన సినిమా వారణాసి. ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఈ సినిమాకి సంబంధించి ఒక గ్రాండ్ ఈవెంట్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్ లో రాజమౌళి మాట్లాడిన మాటలు తీవ్ర దుమారాన్ని రేపాయి. ఈ సినిమా ఈవెంట్ లో వారణాసి సినిమాకి సంబంధించిన ఒక వీడియో ప్లాన్ చేశారు.
ఆ వీడియోను ప్రేక్షకులు అందరూ ముందు రివిల్ చేసి వారణాసి సినిమా వరల్డ్ ఎలా ఉండబోతుందో చూపిద్దామని రాజమౌళి అనుకున్నారు. అయితే ఆ వీడియో ప్లే చేసే టైం కి అది ప్లే కాలేదు. కొంచెం టెక్నికల్ ఎర్రర్ రావడం వలన ఆగిపోయింది.
అయితే ఊహించిన విధంగా రాజమౌళి అసహనంతో మాట్లాడిన మాటలు ఇప్పుడు తీవ్రమైన చర్చకు దారి తీసాయి. ఏం జరిగినా కూడా ఏం భయపడకు హనుమంతుడు వెన్ను తట్టి నడిపిస్తాడు అని మా నాన్నగారు ఎప్పుడూ చెబుతూ ఉంటారు. ఈ వీడియో ప్లే అవ్వకపోయేసరికి చాలా బాధనిపించింది. నేను అసలు దేవుని నమ్మను. కానీ ఇదేనా నడిపించడం అంటే అనిపించింది. మా భార్య కూడా హనుమంతుడిని విపరీతంగా ఇష్టపడుతుంది అతనిని ఒక ఫ్రెండ్ లా ట్రీట్ చేస్తుంది. నా భార్య నా మీద హనుమంతుడు ఏం చేస్తాడో చూడాలి అంటూ మాట్లాడారు.
రీసెంట్ టైమ్స్ లో మనోభావాలు దెబ్బ తినడం. దీని గురించి ఎప్పటి నుంచో వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. ముఖ్యంగా సినిమా వాళ్ల మీద అయితే మరీ గట్టిగా ఎక్కుతుంటారు. గతంలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన బిజినెస్ మెన్ సినిమా ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.
ఆ సినిమా టైంలో కూడా చాలా వివాదాలు అయ్యాయి. అయితే అప్పట్లో ఒక జర్నలిస్ట్ హిందువులు మనోభావాలు దెబ్బతిన్నాయి అని మహేష్ బాబుని అడిగారు. అప్పుడు మహేష్ బాబు మాట్లాడుతూ అవునా మీరు చెప్పినంత వరకు మాకు తెలియదండి రేపు అందరం ఒకసారి ఆఫీసులో కూర్చుని దీని గురించి ఆలోచిస్తామని ఆ టైంలో అన్నారు. ఇప్పుడు సేమ్ సిచువేషన్ ఎదురయింది కాబట్టి ఆ వీడియోను వైరల్ చేస్తున్నారు కొంత మంది మహేష్ అభిమానులు.
అయితే అప్పుడు జరిగినప్పుడు వెంటనే పూరి జగన్నాథ్ మైక్ తీసుకుని, ఇండియాలో పని పాట లేని వాళ్లకు మాత్రమే మనోభావాలు దెబ్బతింటాయి అంటూ మాట్లాడారు. అప్పట్లో దీనిని పెద్దగా ఎవరు వైరల్ చేయలేదు సోషల్ మీడియా కూడా అప్పట్లో తక్కువ కాబట్టి సరిపోయింది.
అయితే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాకు మాత్రం విపరీతమైన గొడవలు జరిగాయి. ఏకంగా పూరి మీడియా ముందుకు వచ్చి బాగా క్లారిటీ ఇచ్చి చాలా సందర్భాలు సారీ చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. రాజమౌళి స్పీచ్ పైన విపరీతమైన కామెంట్స్ వస్తూనే ఉన్నాయి. దీని గురించి మళ్ళీ రాజమౌళి ఏమైనా క్లారిటీ ఇస్తాడేమో చూడాలి. ప్రాబ్లమ్ స్పీచ్ గురించి మాత్రమే కాకుండా నంది పైన మహేష్ బాబు త్రిశూలం పట్టుకుని వస్తున్న వాటిపైన కూడా కొంతమంది హిందువులు మనోభావాలు దెబ్బతిన్నాయి అని చెప్పినట్లు సమాచారం వినిపిస్తుంది.