BigTV English
Advertisement

Mahesh Babu : స్టార్ డైరెక్టర్ తో మహేష్ మూవీ.. ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే..

Mahesh Babu : స్టార్ డైరెక్టర్ తో మహేష్ మూవీ.. ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే..

Mahesh Babu : టాలీవుడ్ స్టార్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈమధ్య బ్యాక్ టు బ్యాక్ చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. గత ఏడాది వచ్చినా గుంటూరు కారం సినిమా యావరేజ్ దాకుని అందుకున్న కూడా కలెక్షన్ల పరంగా బాక్సాఫీస్ ని దుమ్ము దులిపేసింది. ఈ మూవీ తర్వాత మహేష్ బాబు ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్లో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబోలో రాబోతున్న సినిమా కోసం యావత్ సినీ ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ వచ్చే ఏడాది థియేటర్లోకి రాబోతుంది అన్న విషయం తెలిసిందే. మహేష్ బాబు ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే మరో స్టార్ డైరెక్టర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరు? ఎటువంటి స్టోరీ తో సినిమా రాబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం..


సందీప్ రెడ్డి వంగాతో మహేష్ మూవీ..

పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా గురించి అందరికీ తెలుసు. ఈయన తీసిందే తక్కువ సినిమాలు అయినా కూడా ఇండస్ట్రీలో వెయిట్ ఉన్న డైరెక్టర్లలో ఈయన పేరు వినిపిస్తుంది. తెలుగులో విజయ్ దేవరకొండ తో అర్జున్ రెడ్డి సినిమాను తెరకెక్కించాడు. ఆ మూవీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అలాంటి స్టోరీ తోనే బాలీవుడ్ లో యానిమల్ చిత్రాన్ని తెరకెక్కించారు. బాలీవుడ్ రికార్డులను బ్రేక్ చేసే విధంగా ఆ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ సినిమా తర్వాత ప్రస్తుతం ప్రభాస్ తో స్పిరిట్ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ తర్వాత మరో సినిమా చేయబోతున్నట్లు సమాచారం. అయితే ఈసారి మహేష్ బాబుతో సినిమా చేసే అవకాశాలు ఉన్నట్లు ఓ వార్త ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతుంది. అందులో నిజం ఎంత ఉందో తెలియదు గానీ ప్రస్తుతం ఈ వార్త అయితే ఇండస్ట్రీని షేక్ చేస్తుంది. మహేష్ బాబు రాజమౌళి సినిమా తర్వాత ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కూడా ఓ వార్త ప్రచారంలో ఉంది. త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.


Also Read :ఈ వారం థియేటర్లలో రిలీజ్ అవుతున్న సినిమాలు.. ఆ రెండింటిపైనే ఫోకస్..

SSMB29 షూటింగ్ అప్డేట్.. 

రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్లో రాబోతున్న సినిమాపై రోజురోజుకీ అంచనాలు పెరుగుతున్నాయి. ఈ సినిమా కోసం మహేష్ బాబు గతంలో ఎన్నడూ లేని విధంగా గుబురు గడ్డం పొడవు జుట్టుతో కనిపిస్తున్నాడు. ప్రస్తుతం మహేష్ బాబు లుక్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఈ మూవీతో మహేష్ బాబు పాన్ ఇండియా స్టార్ అవుతాడు. ప్రస్తుతం ఆఫ్రికన్ అడవుల్లో షూటింగ్ దశలో ఉంది. వచ్చే ఏడాది మార్చిలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అటు సందీప్ రెడ్డి వంగ కూడా ప్రభాస్ తో స్పిరిట్ మూవీని త్వరగా ఫినిష్ చేసే ఆలోచనలో ఉన్నాడు.

Related News

Dheeraj Mogilineni: ఇద్దరు ఆడపిల్లలతో రాహుల్ కష్టాలు.. బంపర్ ఆఫర్ ప్రకటించిన నిర్మాత

Mithra Mandali: ఓటీటీకి వస్తున్న మిత్రమండలి.. ఎక్కడ చూడొచ్చు అంటే

NTR: ఎన్టీఆర్ డెడికేషన్ కి సినీ లవర్స్ ఫిదా.. అందుకే గ్లోబల్ యాక్టర్!

Peddi: చికిరి హుక్ స్టెప్ బావుంది.. కాపీ కొట్టకుండా ఒరిజినల్ అయ్యి ఉంటే ఇంకా బావుండేది

Dies Irae Trailer : ‘డీయస్ ఈరే’ ట్రైలర్ వచ్చేసింది.. మిస్టరీ థ్రిల్లర్ సీన్ల తో థియేటర్లు దద్దరిల్లాల్సిందే..

Salman Khan: సల్మాన్ ఖాన్ కు లీగల్ నోటీసులు.. ఎప్పుడూ డబ్బేనా.. ప్రాణాలతో పనిలేదా?

NTR: ఎన్టీఆర్ లుక్స్.. భయపడుతున్న ఫ్యాన్స్.. నీల్ మావా నువ్వే కాపాడాలి

Chikiri Song Promo : మొత్తానికి ‘చిక్రి’ అంటే ఏంటో చెప్పేసిన బుచ్చిబాబు

Big Stories

×