Kalpika Ganesh: టాలీవుడ్ సినీ నటిగా పేరు సొంతం చేసుకున్న కల్పిక గణేష్ మరోసారి వివాదంలో చిక్కుకుంది. మళ్లీ బూతులతో రెచ్చిపోయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పలువురు నెటిజన్స్ సైతం ఈమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు విషయంలోకి వెళ్తే హైదరాబాద్ సమీపంలోని మొయినాబాద్ – కనక మామిడి ప్రాంతంలో ఉన్న బ్రౌన్ టౌన్ రిసార్ట్లో ఈమె చేసిన హంగామా అంతర్జాలంలో చర్చనీయాంశంగా మారింది.
మళ్లీ బూతులతో రెచ్చిపోయిన కల్పిక గణేష్..
అసలు విషయంలోకెళితే.. నిన్న అనగా జూలై 28 సోమవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో క్యాబ్లో ఒంటరిగా మొయినాబాద్ – కనక మామిడి ప్రాంతంలో ఉన్న బ్రౌన్ టౌన్ రిసార్ట్ కు వెళ్ళింది కల్పిక. అక్కడ రిసెప్షన్లో అడుగుపెట్టగానే అక్కడి మేనేజర్ కృష్ణతో చాలా దురుసుగా ప్రవర్తించింది. ముఖ్యంగా ఆమె ప్రవర్తన అటు రిసార్ట్ సిబ్బందిని కూడా పూర్తిగా అయోమయంలో పడేసింది. ఒక్కసారిగా మెనూ కార్డను విసిరివేయడం, రూమ్ కీస్ ను మేనేజర్ ముఖం పైనే విసిరి కొట్టడం అలాగే మేనేజర్ తో అసభ్యకరంగా బూతులు మాట్లాడడం వంటివి కల్పిక చేయడంతో అటు సిబ్బంది కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అంతేకాదు ఆమె మాట్లాడుతున్న బూతులకి అసహ్యంగా చూశారు కూడా.
కనీస అవసరాలు తీర్చలేదంటూ ఫైర్..
రిసార్ట్ సిబ్బందితో సిగరెట్లు కావాలి అంటూ దాదాపు 45 నిమిషాల పాటు రిసార్ట్ ప్రాంగణంలో నాటకాలు చేస్తూ న్యూసెన్స్ సృష్టించింది కల్పిక. ఇక ఈమె కారణంగా రిసార్ట్ కి వచ్చిన గెస్ట్ లు కూడా అసౌకర్యానికి గురయ్యారని, ఆమె ప్రవర్తన చూస్తుంటే ఈమెకేదైనా ఇతర సమస్యలు ఉన్నాయేమో అంటూ సిబ్బంది కూడా అనుమానం వ్యక్తం చేశారు. మొత్తానికైతే రిసార్ట్ మేనేజర్ తో బూతులతో రెచ్చిపోయి మరొక్కసారి వివాదంలో చిక్కుకుంది కల్పిక గణేష్.
రిసార్ట్ వివాదంపై స్పందించిన కల్పిక..
ఇకపోతే ఈ వివాదం అలా జరిగిందో లేదో అప్పుడే తనపై వస్తున్న ఆరోపణలకు ఆమె క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు తన ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా ఒక వీడియో షేర్ చేస్తూ.. రిసార్ట్ లోని సిబ్బంది అనవసరంగా నన్ను టార్గెట్ చేస్తున్నారు. అసలు నేను ఎలాంటి హంగామా చేయలేదు. వారే నా పట్ల దురుసుగా ప్రవర్తించారు. అక్కడ వైఫై పని చేయడం లేదు.. క్యాబ్ సదుపాయం లేదు. కనీసం సిగరెట్టు తీసుకురమ్మని చెప్పినా ఎవరు వినలేదు. నా కనీస అవసరాలపై బాధ్యత చూపించలేదు. బాధతో తట్టుకోలేక బూతులు తిట్టాను. కానీ వారు మాత్రం నన్ను సరిగా అర్థం చేసుకోలేదు.
మనశ్శాంతి లేకుండా చేశారు – కల్పిక
వేరే కేసు విషయంలో పోలీసులు నన్ను వేధిస్తున్నారు. ఆ ఓదార్పు కోసమే రిసార్ట్ కి వెళ్తే అక్కడ కూడా మనశ్శాంతి లేకుండా చేశారు. అసలు నేను ఎవరిని ఇబ్బంది పెట్టలేదు” అంటూ క్లారిటీ ఇచ్చింది. ఇక దీనిపై కల్పిక తన ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా వివరణ ఇచ్చింది కానీ అటు రిసార్ట్ సిబ్బంది ఇంకా ఈ విషయంపై అధికారికంగా స్పందించలేదు.మొత్తానికైతే కల్పికపై ఇప్పుడు నెటిజన్స్ నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
?igsh=ZjFkYzMzMDQzZg==
ALSO READ : Murali Mohan: పెళ్లయిన కొత్తలోనే మురళీమోహన్ కి అలాంటి కండిషన్ పెట్టిన భార్య.. కట్ చేస్తే!