This week Release Movies : టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రతినెల కొత్త సినిమాలు రిలీజ్ అవుతూనే ఉంటాయి.. అయితే ఈ మధ్య నెల మొదటి వారంలోనూ లేదా చివరివారంలోనూ సినిమాల సందడి ఎక్కువగానే ఉంటుంది. ఈ జూలై నెలలో చివరి వారంలో కూడా బోలెడు సినిమాలు థియేటర్లలోకి రాబోతున్నాయి. విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉండగా.. విజయ్ సేతుపతి, నిత్యా మీనన్ జంటగా నటించిన ‘సార్ మేడమ్’ ఆగస్టు 1న విడుదల కానుంది. ఇందులో ఎక్కువగా విజయ్ దేవరకొండ సినిమాపై ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ నెల చివరి వారంలో థియేటర్లలోకి ఏ సినిమాలు రాబోతున్నాయో ఇప్పుడు కాస్త వివరంగా తెలుసుకుందాం..
ఈ వారం థియేటర్లలోకి రిలీజ్ కాబోతున్న సినిమాలు..
జూలై నెల ఆఖరకు వచ్చేసాము.. గత వారం లాగే ఈ వారం కూడా సినీ ప్రియులను అలరించడానికి బోలెడు కొత్త సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. ఓవైపు థియేటర్లలో, మరోవైపు ఓటీటీలో సందడి చేయడానికి సరికొత్త కంటెంట్ రెడీగా ఉంది.. ఓటీటీలో ఈ వారం 20 సినిమాల వరకు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. ఇప్పుడు థియేటర్లలోకి ఏ హీరో సినిమాలు రిలీజ్ కాబోతున్నాయో ఒకసారి చూద్దాం..
విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’…
గత ఏడాది వచ్చిన ఖుషి సినిమా విజయ్ దేవరకొండకు నిరాశను మిగిల్చింది. భారీ అంచనాల నడుమ థియేటర్లోకి వచ్చిన ఏ సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా కొట్టింది. దాంతో ఇప్పుడు భారీ అంచనాలను నెలకొనేలా సరికొత్త స్టోరీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు విజయ్ దేవరకొండ..గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కింగ్డమ్’. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై రూపొందిన ఈ పాన్ ఇండియా సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించారు.. నటుడు సత్యదేవ్ ఇందులో కీలక పాత్రలో నటించారు. జులై 31న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్, సాంగ్స్ విశేషంగా ఆకట్టుకున్నాయి. చాలాకాలంగా హిట్టు కోసం పట్టువదలని విక్రమార్కుడిలా ట్రై చేస్తున్న విజయ్ కు ఈసారి హిట్ పక్కా అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.. మరో రెండు రోజుల్లో అసలు జాతకం బయట పడుతుంది.
విజయ్ సేతుపతి ‘ సార్ మేడమ్ ‘..
తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి, ముద్దుగుమ్మ నిత్యామీనన్ జంటగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం సార్ మేడమ్.. తమిళ్లో రిలీజ్ అయిన ఈ సినిమా మంచి రెస్పాన్స్ ని అందుకుంది. తెలుగులో మాత్రం ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. పెళ్లి తర్వాత భార్యాభర్తల మధ్య వచ్చే చిన్న చిన్న తగాదాల నేపథ్యంలో కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రూపొందింది.. విజయ్ సేతుపతి, నిత్యామీనన్కు తెలుగులో మంచి మార్కెట్ ఉండడం వల్ల ఈ సినిమా ఇక్కడ కూడా మంచి రెస్పాన్స్ ని అందుకుంటుందని టాక్ వినిపిస్తుంది.
అరుణాచలం ‘ఉసురే’..
అరుణాచలం, జననీ కునశీలన్ హీరో హీరోయిన్లుగా నవీన్ డి గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఉసురే’. ఇందులో సీనియర్ నటి రాశి కీలక పాత్ర పోషించారు.. గ్రామీణ నేపథ్యంలో చక్కని ప్రేమకథ తో ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో ప్రతి పాత్ర ఎంతో చక్కగా నటించారని టీజర్ ని ట్రైలర్ ని చూస్తే అర్థమవుతుంది. ఈ మూవీ కూడా ఆగస్టు 1న థియేటర్లలోకి రాబోతుంది.
Also Read:మంగళవారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. డోంట్ మిస్..
అజయ్ దేవగన్ ‘ మర్యాద రామన్న’..
బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన హిందీ చిత్రం ‘సన్నాఫ్ సర్దార్ 2’. గతంలో ‘మర్యాద రామన్న’ సినిమాకి రీమేక్ గా వచ్చిన ‘సన్నాఫ్ సర్దార్’కు సీక్వెల్ ఇది. ఈసారి సర్దార్ ని స్కాట్లాండ్ తీసుకెళ్లి నవ్వించబోతున్నారు. విజయ్ కుమార్ అరోరా దర్శకత్వం వహించారు.. ఈ సినిమా ఎలాంటి టాక్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి..