E-Paper
Advertisement

Maheshbabu: మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇచ్చిన చిత్రాలు.. వాటి ఫలితాలు ఏంటో తెలుసా?

Maheshbabu: మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇచ్చిన చిత్రాలు.. వాటి ఫలితాలు ఏంటో తెలుసా?
Advertisement

Maheshbabu:టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు (Maheshbabu) స్క్రీన్ మీద కనిపిస్తేనే ఫ్యాన్స్‌కు పూనకాలు వస్తాయి. అలాంటిది ఆయన తన గంభీరమైన వాయిస్‌తో వేరే సినిమాలకు ప్రాణం పోస్తే ఆ కిక్కే వేరు! కేవలం నటనలోనే కాదు, తన స్వరంతో ఇతర హీరోల సినిమాలకు బలాన్ని చేకూర్చడంలోనూ మహేష్ ముందుంటారు. పవన్ కళ్యాణ్ నుంచి చిరంజీవి వరకు, అలాగే హాలీవుడ్ రేంజ్ సినిమాల వరకు మహేష్ ఇచ్చిన వాయిస్ ఓవర్లు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభావం చూపాయో ఇప్పుడు వివరంగా చూద్దాం.

జల్సా నుంచి బాద్ షా వరకు – అదిరిపోయే హిట్లు:

మహేష్ బాబు వాయిస్ ఓవర్ ప్రయాణం 2008లో పవన్ కళ్యాణ్ ‘జల్సా’తో మొదలైంది. త్రివిక్రమ్ కోరిక మేరకు మహేష్ ఇచ్చిన ఆ వాయిస్ సినిమాకు పెద్ద ప్లస్ అయ్యింది. సుమారు 30 కోట్ల పైగా వసూళ్లతో ఆ ఏడాది బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలిచింది. ఆ తర్వాత 2013లో ఎన్టీఆర్ ‘బాద్ షా’ కోసం మహేష్ గళం విప్పారు. శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 47 కోట్ల షేర్ వసూలు చేసి ఎన్టీఆర్ కెరీర్‌లో అప్పట్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది.ఇక ఈ రెండు సినిమాల విజయాల్లో మహేష్ వాయిస్ ఓవర్ ఒక స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచిందని చెప్పడంలో సందేహం లేదు.

మిశ్రమ ఫలితాలు అందుకున్న మూవీస్ :

Advertisement

అయితే మహేష్ వాయిస్ ఇచ్చిన ప్రతిసారీ మ్యాజిక్ రిపీట్ అవ్వలేదు. 2018లో తన సోదరి మంజుల దర్శకత్వం వహించిన ‘మనసుకు నచ్చింది’ సినిమాకు మహేష్ వాయిస్ ఇచ్చారు. ఐతే సందీప్ కిషన్ నటించిన ఈ మూవీ ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయింది. ఇక 2022లో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించిన ‘ఆచార్య’ సినిమాకు కూడా మహేష్ పరిచయ వాయిస్ ఇచ్చారు.ఇక భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. దాదాపు 100 కోట్లకు పైగా థియేట్రికల్ బిజినెస్ చేసిన ఈ సినిమా భారీ నష్టాలను మూటగట్టుకుంది.

ALSO READ:HBD Viraj Ashwin: బేబీతో గుర్తింపు.. ఎవరీ విరాజ్ అశ్విన్.. బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్!

హాలీవుడ్ రేంజ్ సక్సెస్:

Advertisement

చివరిగా 2024లో వచ్చిన హాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్ ‘ముఫాస: ది లయన్ కింగ్’ తెలుగు వెర్షన్ కోసం మహేష్ బాబు తన వాయిస్ అందించారు. ముఫాస పాత్రకు మహేష్ గంభీరమైన స్వరం పర్ఫెక్ట్‌గా సెట్ అవ్వడంతో ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు క్యూ కట్టారు. ఇక ఈ సినిమా ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లను సాధించి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. అలా మహేష్ వాయిస్ ఓవర్ ఇస్తే సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా, ఆ చిత్రానికి వచ్చే హైప్ మాత్రం మామూలుగా ఉండదని మరోసారి నిరూపితమైంది.

Related News

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

పవన్‌ కల్యాణ్‌ ఆస్తుల లెక్క ఇదిగో.. కళ్లు తిరిగే నంబర్లు!

Big Stories

Advertisement
×