BigTV English

కన్నప్ప కుప్పకూలిపోవడానికి ప్రధాన కారణాలు – రీ(సెర్చ్)

కన్నప్ప కుప్పకూలిపోవడానికి ప్రధాన కారణాలు – రీ(సెర్చ్)

ప్రేక్షకులలో చులకన భావన, మాటల్లో అతి, సొంత డప్పు, డబ్బా, గోల, గొడవలు, రచ్చ, కొట్టుకోవడం జనం చూసి, చూసి వీళ్ళు ఇక ఇంతే అని సమాజంలో ఒక ఈసడింపును చేతులారా సృష్టించుకున్న పరిస్థితుల్లో, మంచు విష్ణు, తన కుటుంబంతో గొప్ప ప్రయత్నం చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన చిత్రం కన్నప్ప.


కన్నప్ప చిత్రం స్టార్ కాస్టింగ్ తో కమర్షియల్ గా, స్టాండర్డ్ కమర్షియల్ ఫార్మట్ లో చాల బాగా డిజైన్ చేసుకున్నారు. కాని చేతులారా చెడకొట్టుకున్నారు. ఇక్కడ శివుని ఆశిస్సులు అందలేదని తెలుస్తుంది.

టేకింగ్ అటు పూర్తిగా ఇంటర్నేషనల్ లా లేదు, ఇటు డొమెస్టిక్ కి సూట్ అయ్యే విధంగాను లేదు. అటు యాక్షన్ సినిమాలా లేదు, ఇటు భక్తీ సినిమాలానూ లేదు. దాంతో మ్యూజిక్ డైరెక్టర్ మోడరన్ గా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొట్టి భక్తీ, డివైన్ ఫీల్ ని గంగలో కలిపాడు. సీన్లు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి కాని దేనికి కనెక్ట్ కాము. 85% తెలుగు ప్రేక్షుకుల మార్కెట్ ఉన్న సినిమా ఇది, అలాంటిది పాన్ ఇండియా, పాన్ ఇంటర్ నేషనల్ మోజులో కన్నప్ప అంటే కనెక్ట్ అయ్యే తెలుగు ప్రేక్షకుల మనోభావాలను విస్మరించి వేషాలు వెయ్యడం అనేది నేల విడిచి సాము చేసినట్లే.


ఏవైతే ప్రేక్షకులు కంప్లైంట్ ఇస్తున్నారో వాటినే గొప్పగా చెప్పడం, చెప్పుకోవడం విష్ణుబాబు అతితెలివి తేటలు. ఒక్క డార్లింగ్ ప్రభాస్ విషయంలో, అతనికి ఉన్న ఫాలోయింగ్ దృష్ట్యా కావొచ్చు మంచి స్పూర్తిని పొంది ఒళ్ళు దగ్గర పెట్టుకొని అద్భుతంగా ప్రభాస్ సన్నివేశాలు పండించారు. అదే పట్టు మొత్తం సినిమాకి పెట్టుంటే ముఖ్యంగా భక్తీ, సెంటిమెంట్స్ పైన అసలు శ్రీకాళాహస్తి కథ పైన పెట్టుంటే జనం హర్షించేవారు.

అతి పెద్ద సాలీడు పురుగు, అనకొండలాంటి పాము, ఏనుగు మూడు కలిసి హీరోయిన్ ను కాపాడటం ఏంటి! ఇదా మీరు ఇన్ని కోట్లు పెట్టి రీసెర్చ్ చేసి తెలుసుకొని చిత్రీకరించింది! ఇదా మీరు యువతకి హిస్టరి, మైతాలజి పేరుతొ శివైక్యం అయిపోయిన జీవులతో అడవిలో అభూతకల్పన చేసి చూపించేది!

వాయు లింగం మహిమలు లేవు, ఐదు తెగల గూడేలు ఉండవు, వాళ్ళ జీవితాలు చూపించారు, మాట్లాడితే మైదానంలోకి వచ్చి గొడవ పడతారు ఆ ఐదు తెగలు. పేరుకే గూడెం పెద్దలు, నటించినందుకు ఆయా పెద్ద నటుల ఫాన్స్ ఎంతలా బాధపడి ఉంటారో వాళ్ళను చూసి వాళ్ళ పాత్రల చావుని చూసి. కెరీర్ రిస్క్ తీసుకొని నటించినందుకు ఆయా పేరు మోసిన నటులకు అభినందనలు తెలపాలి.

స్క్రీన్ ప్లే బ్లండర్ – తండ్రిని ఒక ప్రక్కన చంపుతున్నారు, అయిదు గూడేల ప్రజల కోసం అతను త్యాగం చేస్తున్నాడు, మరణిస్తున్నాడు – అరే! అంత గొప్ప త్యాగాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించకుండా, అర్థంతరంగా కట్ చేసి, తండ్రి ఆత్మ కన్నప్పకు దారిలో కనిపించి ఉపోద్ఘాతం ఇవ్వడం ఏంటి! అందులో మనిషన్నవాడు ఎవడు చెప్పిన మారనోడికి ఉపోద్ఘాతం ఏంటి!! ఆత్మ కన్నప్ప వళ్ళో పడి చనిపోవడం ఏంటి!!! అదేమంటే మా నాన్న ముందే చెప్పాడు టైటిల్స్ కి ముందు ఈ సినిమాలో సన్నివేశాలు ఫిక్షన్ అని.

మీకు, మీ నాన్నగారికి, మీ కన్నప్పకి వెయ్యి దండాలు దొరా అని జనం తీర్పును ఇచ్చారు!

ప్రయత్నం గొప్పది, ఫలితం చిన్నది.
తేడా తెలుసుకుంటే మరో భక్తీ చిత్రం ప్రయత్నం చేయవచ్చు. బిజినెస్ మార్కెట్ ఎలానో పెరిగింది కదా.

— శ్రీచక్ర మల్లికార్జున

Related News

Peddi Movie: రామ్ చరణ్ పెద్ది నుంచి బిగ్ అప్డేట్… స్పెషల్ వీడియో వదిలిన టీమ్!

Heroine Poorna: ఈ దూరం భరించలేను.. సంచలన పోస్ట్ పెట్టిన పూర్ణ!

Chiranjeevi: స్పిరిట్ సినిమాలో మెగాస్టార్…అసలేం ప్లాన్ చేస్తున్నావ్ వంగ మామ!

Actor Rajesh: లైవ్ ఈవెంట్ లో నటుడికి గుండెపోటు… పరిస్థితి విషమం!

Lavanya Tripati: బేబీ బంప్ తో వినాయకుడి పూజలో మెగా కోడలు!

Shah Rukh Khan-Deepika Padukone: కోర్టు ఆదేశం.. షారుక్ ఖాన్, దీపికాపై చీటింగ్ కేసు..

Big Stories

×