Hasin jahan on Shami: భారత క్రికెట్ జట్టు ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ గత కొంతకాలంగా తన వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు షమీ తన కుటుంబ జీవితం కారణంగా మరోసారి వార్తల్లో నిలిచాడు. షమీకి.. తన భార్య హాసిన్ జహన్ తో జరుగుతున్న న్యాయపోరాటంలో భారీ ఎదురు దెబ్బ తగిలింది. కొంతకాలంగా షమీతో విడిగా ఉంటున్న అతడి భార్య హాసిన్ జహాన్ కు, వారి కుమార్తెకు కలిపి నెలకు నాలుగు లక్షల మధ్యంతర భరణం చెల్లించాలని కలకత్తా హైకోర్టు షమీని ఆదేశించింది.
Also Read: Memes on BAN: ఇదేంది మామ.. 5 పరుగులు చేసేందుకు 7 ఔట్.. బంగ్లాదేశ్ అత్యంత చెత్త రికార్డు
కోర్టు ఆదేశాల ప్రకారం షమీ తన మాజీ భార్య హాసిన్ కి నెలకు రూ. 1.5 లక్షలు, కూతురి పెంపకం కోసం నెలకు రూ. 2.5 లక్షలు చెల్లించాలి. షమీ ఆదాయం, అతడి ఆర్థిక పరిస్థితిని పరిగణలోకి తీసుకొని.. ఈ మొత్తాన్ని అతడు చెల్లించగలడని న్యాయస్థానం పేర్కొంది. ఇక కోర్టు తీర్పు అనంతరం హాసిన్ జహాన్ మీడియాతో మాట్లాడారు. ” నేను పెళ్లికి ముందు ఓ మోడల్ ని. నాకంటూ ఓ కెరీర్ ఉండేది. కానీ అతడి కోసం, అతడి పై ఉన్న ప్రేమతో వాటిని వదులుకున్నాను.
నా వృత్తిని వదిలేయమని అతడు నన్ను బలవంతం చేశాడు. ఇప్పుడు నన్ను, నా కూతుర్ని పట్టించుకోకుండా వదిలేశాడు. అతడు ఓ క్రిమినల్. ఓ వ్యక్తి నేరస్థుడు అని, అతడు భవిష్యత్తులో మన జీవితాలతో ఆడుకుంటాడని వారి ముఖం మీద రాసి ఉండదు కదా..? నేను అలాగే మోసపోయాను. ఇప్పుడు నా కూతుర్ని పోషించాల్సిన బాధ్యత అతడిదే. అందుకే న్యాయపోరాటం చేస్తున్నాను” అంటూ కన్నీటి పర్యంతమైంది.
ఈ క్రమంలో గతంలో షమీ స్నేహితుడు ఉమేష్ కుమార్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి వైరల్ గా మారాయి. “2018లో షమీ భార్య అతనిపై గృహహింస కేసు పెట్టింది. అదే సమయంలో షమీపై ఫిక్సింగ్ ఆరోపణలు కూడా వచ్చాయి. అంతేకాకుండా తనకి పాకిస్తాన్ కి చెందిన ఓ యువతి తో వివాహేతర సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు కూడా వచ్చాయి. ఈ ఆరోపణలతో అతడు చాలా నలిగిపోయాడు. ఆ సమయంలో షమీ నాతోపాటు మా ఇంట్లోనే ఉండేవాడు.
తనపై వచ్చిన ఈ ఆరోపణలను అతడు తట్టుకోలేకపోయాడు. దేశానికి ద్రోహం చేశాడని చేసిన ఆరోపణలు అతడిని తీవ్ర మనోవేదనకు గురిచేశాయి. దీంతో అతడు కఠిన నిర్ణయం తీసుకోవాలనుకున్నాడు. నేను ఓ రోజు తెల్లవారుజామున 4 గంటలకే మంచినీళ్ల కోసం నిద్ర లేచాను. అప్పుడు షమీ 19వ అంతస్తులో ఉన్న మా ఇంటి బాల్కనీలో నిల్చొని ఉన్నాడు. దీంతో షమీని చూసి నేను షాక్ అయ్యాను. అతడు ఏం నిర్ణయం తీసుకున్నాడో నాకు అర్థమైంది.
Also Read: Shikhar Dhawan: వాడి వల్లే… టీమిండియాలో నా కెరీర్ ముగిసింది.. ధావన్ ఎమోషనల్
ఆ రాత్రి షమీ జీవితంలో చాలా సుదీర్ఘమైంది. కాసేపటికి కొంత ప్రశాంతంగా మారాడు. అలా కొద్ది రోజులకు ఫిక్సింగ్ ఆరోపణల పై దర్యాప్తు చేస్తున్న కమిటీ నుండి షమీకి క్లీన్ చీట్ వచ్చింది. ఆ సందర్భంలో అతడు ఎంత సంతోషపడ్డాడో మాటల్లో చెప్పలేను” అని షమీ స్నేహితుడు ఉమేష్ కుమార్ వివరించారు. అయితే ఇప్పుడు కోర్టు తీర్పు నేపథ్యంలో షమీ జీవితంలో గతంలో జరిగిన సంఘటనలు తెరపైకి వచ్చాయి.
?utm_source=ig_web_copy_link