2024 ఎన్నికల్లో వైసీపీకి వచ్చిన సీట్లు 11. అప్పట్లో ఆ 11 నెంబర్ పై విపరీతమైన ట్రోలింగ్ నడిచింది. 2019 ఎన్నికల్లో 151 స్థానాల్లో గెలిచిన వైసీపీ ఐదేళ్లలో ఆ మధ్యలో 5 కోల్పోయి 11 సీట్లకు పరిమితమైందని అన్నారు. ఏడాది క్రితం ఎన్నికల ఫలితాలు రాగా, ఇప్పటి వరకు ఆ 11 నెంబర్ తో వైసీపీని తెగ ట్రోల్ చేస్తున్నారు. తాజాగా ట్రోలర్లకు, వల్లభనేని వంశీ రూపంలో మరో ఎగ్జాంపుల్ దొరికింది. ఇటీవలే వల్లభనేని వంశీ బెయిల్ పై విడుదలయ్యారు. ఆయన అరెస్ట్ తర్వాత 137 రోజులు జైలులో ఉండి 138వ రోజున బెయిల్ పై బయటకు వచ్చారు. అంటే ఇక్కడ కూడా 11 సెంటిమెంట్ ఉంది. 137 రోజులు వంశీ జైలులో ఉన్నారు కాబట్టి 1+3+7=11 అంటూ సెటైర్లు పేలుస్తున్నారు నెటిజన్లు. దీంతో మరోసారి 11 సెంటిమెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
#Tillutrolls pic.twitter.com/mXiQWIMZta
— Tillu Trolls (@tillutrolls) July 2, 2025
వైసీపీనుంచే ట్రోలింగ్ మొదలు..
గతంలో టీడీపీని కూడా వైసీపీ ఇలాగే ట్రోల్ చేసింది. 2014లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 23మంది వైసీపీ ఎమ్మెల్యేలను వారివైపు తిప్పుకున్నారని, ఆ తర్వాత 2019 ఎన్నికల్లో టీడీపీకి కేవలం 23 సీట్లు మాత్రమే వచ్చాయని, అది దేవుడు రాసిన స్క్రిప్ట్ అని వైసీపీ నేతలు ఎగతాళి చేసేవారు. కానీ 2024 ఎన్నికల నాటికి దేవుడి స్క్రిప్ట్ టీడీపీకి ఫేవర్ గా వచ్చింది, ఇక్కడ వైసీపీ బుక్కైపోయింది. 151 స్థానాల్లో మధ్యలోని 5 ఎగిరిపోయి 11 సీట్లకు వైసీపీ పరిమితం అయింది. ఇక్కడ ఇంకో సెంటిమెంట్ కూడా ఉంది. కూటమికి వచ్చిన మొత్తం స్థానాలు 164 అంటే ఇక్కడ 1+6+4=11 గా చెప్పుకోవచ్చు. సో జగన్ ని 11 స్థానాలకు పరిమితం చేసిన దేవుడు.. కూటమికి కూడా 11 కలిసొచ్చేలా 164 స్థానాలు ఇచ్చారని చెప్పుకోవచ్చు.
ఎన్నికల తర్వాత ఏపీలో అసెంబ్లీ సమావేశాల ప్రారంభాన్ని కూడా 11తో ముడిపెడుతూ వైసీపీపై ట్రోలింగ్ మొదలైంది. సెప్టెంబర్ నెల అంటే 11వ నెల 11వతేదీనుంచి ఉదయం 11 గంటలకు మొదలయ్యే అసెంబ్లీ సమావేశాలకు ఆ 11 మంది వస్తారా అంటూ టీడీపీ నేతలు ప్రశ్నించారు. ఆ సమావేశాల గడువు కూడా 11 రోజులే కావడం అక్కడ మరో విశేషం. ఇలా పదే పదే వైసీపీని 11తో లింక్ చేస్తూ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేశారు టీడీపీ నేతలు. తాజాగా వల్లభనేని వంశీ బెయిల్ వ్యవహారం మరోసారి వారికి దొరికింది. దీంతో ఈ 11 సెంటిమెంట్ మళ్లీ కంటిన్యూ అయింది.
సెంటిమెంట్ సంగతి పక్కనపెట్టినా వంశీపై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ జరుగుతోంది. జైలునుంచి బెయిల్ పై విడుదలైన ఆయన ఒక్కరోజు గ్యాప్ లోనే వెళ్లి జగన్ ని కలిశారు. వాస్తవానికి వంశీ ఇంటికే జగన్ వచ్చి కలిసి ఉంటే బాగుండేదని, కానీ వంశీనే పిలిపించుకుని ఓదార్చడమేంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇక వంశీ అందగాడు అనే డైలాగ్ కూడా బాగానే నలుగుతోంది. అందగాడి అసలు రూపం బయటపడిందని అంటున్నారు. అటు వల్లభనేని వంశీ మాత్రం మీడియాతో మాట్లాడటంలేదు, మైక్ లకు దూరంగా ఉన్నారు. బెయిల్ కండిషన్ల వల్ల ఆయన మీడియాతో మాట్లాడటంలేదని చెబుతున్నారు వైసీపీ నేతలు.