E-Paper
Advertisement

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతిహాసన్ సందడి.. స్పెషల్ సాంగ్‌తో కిక్కివ్వనున్న ‘ఎవడు’ జోడీ!

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతిహాసన్ సందడి.. స్పెషల్ సాంగ్‌తో కిక్కివ్వనున్న ‘ఎవడు’ జోడీ!
Advertisement

Peddi Movie : మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ హీరోగా ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న భారీ చిత్రం ‘పెద్ది’. గతంలో వచ్చిన గేమ్ చేంజర్ మూవీ డిజాస్టర్ అవ్వడంతో పెద్ది పై అంచనాలు కాస్త ఎక్కువగానే ఉన్నాయి. ఎప్పుడెప్పుడు ఈ మూవీని థియేటర్లలో చూస్తామా అని మెగా ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల చిత్రం వాయిదా పడింది. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమా టాకీ పార్ట్ చిత్రీకరణ పూర్తి చేసుకుని, విడుదలకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన ఒక క్రేజీ అప్‌డేట్ టాలీవుడ్‌ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో ఉండే ఒక స్పెషల్ సాంగ్ కోసం చిత్ర బృందం ఎట్టకేలకు అగ్ర కథానాయికను ఎంపిక చేసినట్లు టాక్. ఆమె ఎవరో కాదు శృతి హాసన్..ఈ వార్త బయటకు రావడంతో ఎవడు జోడీ కుదిరిందని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

శృతి హాసన్ ను అందుకే తీసుకున్నారా..? 

శృతిహాసన్ ఈమధ్య సినిమాలకన్నా ఐటమ్ సాంగ్ లలో ఎక్కువగా కనిపిస్తుంది. నాని నటించిన హాయ్ నాన్న చిత్రంలో ఈమె స్పెషల్ సాంగ్ లో మెరిసింది.. ఆ సాంగ్ హిట్ అయ్యింది. గతంలో మహేష్ బాబుతో కలిసి ‘ఆగడు’ సినిమాలో ‘జంక్షన్‌లో..’ అంటూ సందడి చేసిన శ్రుతి, తెలుగులో చేస్తున్న రెండో ప్రత్యేక గీతం ఇదే కావడం విశేషం. గతంలో రామ్ చరణ్‌తో కలిసి ‘ఎవడు’ సినిమాలో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ , ఇప్పుడు ఈ మాస్ సాంగ్‌లో చరణ్‌తో కలిసి స్టెప్పులేయడానికి సిద్ధమైంది.. మరి ఈ సాంగ్ జనాలను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.

Advertisement

Also Read :‘ముక్కుపుడక ‘ అవని ఒక్కరోజు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

పెద్ది మూవీ..

RRR తర్వాత భారీ బడ్జెట్ చిత్రం గా రాబోతున్న పెద్ది సినిమాపై ఇండస్ట్రీలో అంచనాలు కాస్త ఎక్కువగానే ఉన్నాయి. ఈసారి రామ్ చరణ్ కథలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ పడడం ఖాయం అంటూ మెగా అభిమానులు కూడా ఈగరుగా వెయిట్ చేస్తున్నారు.. ఈ సినిమాని ఏప్రిల్ 30న రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా జూన్ కి వాయిదా పడింది. ప్రస్తుతం మూవీ షూటింగ్ అప్డేట్ గురించి చూస్తే..హైదరాబాద్ శివార్లలో వేసిన ప్రత్యేక సెట్‌లో ఈ నెల 26 నుంచి ఈ పాట షూటింగ్ ప్రారంభం కానుంది. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సహకారంతో వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. భారీ అంచనాలు వస్తున్న ఈ పీరియాడిక్ డ్రామా జూన్ నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది. దేవి శ్రీ ప్రసాద్ అందించిన ఈ స్పెషల్ సాంగ్ మాస్ ఆడియన్స్‌కు ఐ-ఫీస్ట్ లా ఉంటుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటివరకు మూవీ నుంచి రిలీజ్ అయిన పోస్టర్లు, టీజర్ అలాగే సాంగ్స్ జనాలని విపరీతంగా ఆకట్టుకున్నాయి.. మరి సినిమా ఎలాంటి టాక్కుని అందుకుంటుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే…

Related News

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

ఎన్టీఆర్ డ్రాగన్ లో బాలీవుడ్ స్టార్స్… ఏం ప్లాన్ చేస్తున్నావ్ నీల్?

RC16పై మాస్ అప్డేట్..చరణ్–సుకుమార్ మూవీ గ్రాండ్ లాంచ్ ఎప్పుడో తెలుసా?

Big Stories

Advertisement
×