E-Paper

Tamil Nadu Elections 2026: తమిళనాడు ఎన్నికలు.. పోలింగ్ కేంద్రాలకు సెలబ్రిటీలు క్యూ.. ఓటు హక్కు వినియోగం

Tamil Nadu Elections 2026: తమిళనాడు ఎన్నికలు.. పోలింగ్ కేంద్రాలకు సెలబ్రిటీలు క్యూ.. ఓటు హక్కు వినియోగం
Advertisement

Tamil Nadu Elections 2026: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా సాగుతున్నాయి. ఉదయం 7 గంటలకు పోలింగ్ మెుదలుకాగా.. ప్రజలు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. తమ ఇష్టమైన నేతను గెలిపించుకునేందుకు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అయితే ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని కోలివుడ్ కు చెందిన సినీ తారలు సైతం ఉదయాన్నే క్యూలో నిలబడి మరీ ఓట్లు వేస్తున్నారు. సాధారణ పౌరులతో కలిసి వెళ్లి తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.

టీవీకే చీఫ్ విజయ్..

కోలీవుడ్ నటుడు, టీవీకే పార్టీ అధినేత విజయ్.. చెన్నైలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలీసుల భారీ భద్రత నడుమ పోలింగ్ కేంద్రంలోకి వెళ్లిన విజయ్.. రాజ్యాంగం కల్పించిన తన హక్కును వినియోగించుకున్నారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాగా, ఈ ఎన్నికల్లో టీవీకే పార్టీ తరపున విజయ్.. సీఎం అభ్యర్థిగా ఉన్నారు. ఈ ఎన్నికలను ఆయన తీవ్రంగా ప్రభావితం చేస్తారన్న విశ్లేషణలు ఉన్నాయి.

Advertisement

ఓటు వేసిన రజనీ

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ చెన్నైలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. స్టెల్లా మారిస్ కాలేజీలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం వద్దకు కూతురు ఐశ్వర్యతో కలిసి వెళ్లి ఓటు వేశారు. అయితే పోలింగ్ కేంద్రంలో రజనీ కాంత్ ను చూసి.. ఓటర్లు ఒక్కసారిగా ఆయన్ను చుట్టుముట్టారు. షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు ఎగబడ్డారు. పోలీసులు కలుగజేసుకొని రజనీకాంత్ ను అక్కడి నుంచి ఎలాంటి ఇబ్బంది లేకుండా తీసుకెళ్లారు.

Advertisement

కమల్, శృతి హాసన్..

స్టార్ హీరో, మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్ సైతం.. ఉదయాన్నే తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కూతురు శృతి హాసన్ తో చెన్నైలోని ఆల్వార్ పేట్ పాఠశాలకు వెళ్లి నచ్చిన అభ్యర్థికి ఓటు వేశారు.

Also Read: నేడే బెంగాల్, తమిళనాడు ఎన్నికలు.. 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం.. ఓట్లు వేస్తున్న ప్రజలు!

అజిత్ కుమార్, ఖుష్బూ

మరోవైపు కోలీవుడ్ యాక్షన్ హీరో అజిత్ కుమార్ సైతం.. చెన్నైలోని తిరువాన్మియూర్ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. అనంతరం చేతి వేలికి ఉన్న సీరా గుర్తును చూపిస్తూ.. ప్రతీ ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్న సందేశాన్ని ఇచ్చారు. అంతకుముందు బీజేపీ నేత, సినీ నటి కుష్బూ సైతం చెన్నై మైలాపూర్ లోని పోలింగ్ బూత్ కు వచ్చి ఓటువేశారు.

Also Read: నరరూప రాక్షసుడు.. రెండ్రోజుల్లో 2 అత్యాచారాలు, ఒక హత్య.. బాధితుల్లో IRS అధికారి కుమార్తె!

Related News

అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందం.. ప్రధాని మోడీ రియాక్షన్ ఇదే!

అన్నాడీఎంకేకు బిగ్ షాక్.. స్టార్ క్యాంపెయినర్ గౌతమి అవుట్!

అస్సాంలో ఘోర ప్రమాదం.. జోర్హాట్ ఐఏఎఫ్ బేస్‌లో కుప్పకూలిన కార్గో విమానం!

Meenakshi Natarajan: మీనాక్షి నాటరాజన్‌కు ఎదురుదెబ్బ.. జోక్యానికి నిరాకరించిన సుప్రీంకోర్టు

తెరపైకి మళ్లీ డీలిమిటేషన్.. కొత్త ఫార్ములా దక్షిణాదికి లాభమా? నష్టమా? పార్టీలు ఏమంటున్నాయి?

బెంగాల్‌‌లో ఏం జరుగుతోంది? బూడిదైన 4 వేల ఈవీఎంలు, ఎవరి పని? నివేదిక కోరిన సీఈసీ

స్కూల్లో రైడ్.. రూ.కోటి నగదు, మద్యం, కం*డోమ్స్ లభ్యం.. పోలీసులకే మైండ్ బ్లాక్!

కాక్రోచ్‌ జనతా పార్టీ దేశవ్యాప్త ఉద్యమం.. ఎడ్యుకేషన్ వ్యవస్థపై ఫోకస్, జూన్ 20 జంతర్ మంతర్ వద్ద ఆందోళన

×