BigTV English
Advertisement

Brown Bread: బ్రౌన్ బ్రెడ్ ఎక్కువగా తింటే.. ఏమవుతుందో తెలుసా ?

Brown Bread: బ్రౌన్ బ్రెడ్ ఎక్కువగా తింటే.. ఏమవుతుందో తెలుసా ?

Brown Bread: బ్రౌన్ బ్రెడ్‌ను సాధారణంగా హోల్ వీట్ లేదా తృణధాన్యాలతో తయారు చేస్తారు. అందుకే దీనిలో వైట్ బ్రెడ్ కంటే ఎక్కువ పోషక విలువలు ఉంటాయి. ఇందులో ఫైబర్, ఐరన్, మెగ్నీషియం, బి విటమిన్లు వంటివి పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియకు సహాయపడతాయి. అంతే కాకుండా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.


రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. అయితే.. అన్ని బ్రౌన్ బ్రెడ్‌లు ఒకేలా ఉండవు. కొన్ని బ్రౌన్ బ్రెడ్‌లలో కలర్ కోసం కూడా కారామెల్ కలిపే ప్రమాదం ఉంటుంది. నిజానికి అవి మైదా (శుద్ధి చేసిన పిండి) తోనే తయారై ఉంటాయి. కాబట్టి.. కొనేటప్పుడు హోల్ వీట్ లేదా హోల్ గ్రైన్ అనే లేబుల్‌ను జాగ్రత్తగా చూసుకోవాలి.

తరచుగా బ్రౌన్ బ్రెడ్ తినడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్:
బ్రౌన్ బ్రెడ్ సాధారణంగా ఆరోగ్యకరమైనదిగా పరిగణించబడినప్పటికీ.. కొన్ని సందర్భాల్లో లేదా అతిగా తినడం వల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది.


కలిపిన పదార్థాలు: కొన్ని బ్రౌన్ బ్రెడ్‌లు ఆరోగ్యకరమైనవిగా కనిపించినా.. వాటిలో అధిక చక్కెర, ఉప్పు, నూనెలు, ఎక్కువ రోజులు నిల్వ ఉండటానికి రసాయనాలు కలిపి ఉండొచ్చు. ఇవి బరువు పెరగడానికి, రక్తపోటు పెరగడానికి అంతే కాకుండా ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయి. ముఖ్యంగా.. అధిక సోడియం గుండె సమస్యలకు కారణం కావచ్చు.

కేలరీలు, బరువు పెరుగుదల: బ్రౌన్ బ్రెడ్ ఆరోగ్యకరమైనదే అయినప్పటికీ.. అది కార్బోహైడ్రేట్లు, కేలరీలు కలిగి ఉంటుంది. రోజూ ఎక్కువ మొత్తంలో బ్రౌన్ బ్రెడ్ తినడం వల్ల శరీరానికి అవసరమైన దానికంటే ఎక్కువ కేలరీలు చేరి బరువు పెరిగే అవకాశం ఉంటుంది. ఇది ప్రత్యేకంగా బరువు తగ్గాలనుకునే వారు తినకుండా ఉంటేనే మంచిది.

జీర్ణ సమస్యలు:
బ్రౌన్ బ్రెడ్‌లో ఫైబర్ ఎక్కువగా ఉన్నప్పటికీ.. కొంత మందికి ఇది జీర్ణ సమస్యలను కలిగించే ప్రమాదం కూడా ఉంటుంది. అధికంగా ఫైబర్ తీసుకోవడం వల్ల ఉబ్బరం, గ్యాస్, మలబద్ధకం లేదా విరేచనాలు వంటి సమస్యలు ఎదురయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. ముఖ్యంగా ఫైబర్ తీసుకోవడానికి అలవాటు లేని వారికి. బ్రెడ్‌లోని కొన్ని పదార్థాలు (ఉదాహరణకు, ఎమల్సిఫైయర్‌లు) పేగులోని మంచి బ్యాక్టీరియా (గట్ మైక్రోబయోమ్) ను కూడా ప్రభావితం చేయవచ్చు.

రక్తంలో చక్కెర స్థాయిలు:

బ్రౌన్ బ్రెడ్‌లో ఫైబర్ ఉన్నప్పటికీ, కొన్ని రకాల బ్రెడ్‌లు గ్లైసెమిక్ ఇండెక్స్ ను కలిగి ఉంటాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. డయాబెటిస్ ఉన్నవారు లేదా డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉన్నవారు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. రక్తంలో చక్కెరలో వేగంగా పెరుగడం వల్ల ఆకలి పెరుగుతుంది. ఇది అతిగా తినడానికి దారితీస్తుంది.

పోషకాల అసమతుల్యత: కేవలం బ్రెడ్ పైనే ఆధారపడటం వల్ల వివిధ రకాల పోషకాలు శరీరానికి అందకపోవచ్చు. సమతుల్య ఆహారంలో కూరగాయలు, పండ్లు, ప్రొటీన్లు, మంచి కొవ్వులు వంటివి కూడా అవసరం. కేవలం బ్రౌన్ బ్రెడ్ తింటే.. ఇతర ముఖ్యమైన పోషకాల లోపం ఏర్పడే ప్రమాదం కూడా ఉంటుంది.

అలర్జీలు, సున్నితత్వం: కొంతమందికి గ్లూటెన్ (గోధుమలో ఉండే ప్రోటీన్) కు సున్నితత్వం లేదా అలర్జీ ఉండవచ్చు. అలాంటి వారికి బ్రౌన్ బ్రెడ్ తినడం వల్ల కడుపు నొప్పి, ఉబ్బరం, విరేచనాలు వంటి సమస్యలు వస్తాయి.

Also Read: ఓక్రా వాటర్ తాగితే.. ఈ వ్యాధులన్నీ పరార్ !

తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
బ్రౌన్ బ్రెడ్‌ను రోజూ తినడం వల్ల తప్పేమీ కాదు. కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

లేబుల్‌ను చెక్ చేయండి: మీరు కొనుగోలు చేసే బ్రౌన్ బ్రెడ్ 100% హోల్ వీట్ లేదా హోల్ గ్రైన్ అని నిర్ధారించుకోండి. చక్కెర, సోడియం, వంటి వాటిని చెక్ చేయండి.

పరిమితంగా తినండి: రోజూ 1-2 స్లైస్‌లకు మించి తినకుండా చూసుకోండి.

సమతుల్య ఆహారం: బ్రౌన్ బ్రెడ్‌తో పాటు.. మీ ఆహారంలో వివిధ రకాల పండ్లు, కూరగాయలు, ప్రొటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండేలా చూసుకోండి.

శారీరక శ్రమ: క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల కేలరీలను బర్న్ చేసి.. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.

Related News

Dark Tourism: చీకటి అధ్యాయాలపై ఉత్సుకత.. నాణేనికి మరో వైపే డార్క్ టూరిజం!

Zumba Dance: బోరింగ్ వర్కౌట్స్‌తో విసుగొస్తుందా.. అయితే మ్యూజిక్ వింటూ స్టెప్పులేయండి!

Karivepaku Rice: కరివేపాకు రైస్ పావు గంటలో చేసేయొచ్చు, రెసిపీ చాలా సులువు

Trial Separation: విడాకులు తీసుకునే ముందు.. ఒక్కసారి ‘ట్రయల్ సెపరేషన్’ ప్రయత్నించండి!

Wasting Money: విలాసవంతమైన కోరికలకు కళ్లెం వేయకుంటే.. మిమ్మల్ని చుట్టుముట్టే సమస్యలివే!

Food noise: నెక్ట్స్ ఏం తినాలో ముందే ప్లాన్ చేస్తున్నారా.. అయితే అది ఫుడ్ నాయిసే!

Crocs: క్రాక్స్ ఎందుకంత ఫేమస్?.. దీని వెనుకున్న ముగ్గురి స్నేహితుల కథేంటి?

Mumbai Style Vada Pav: ముంబై స్టైల్ వడా పావ్ రెసిపీ.. క్షణాల్లోనే రెడీ చేసుకోవచ్చు !

Big Stories

×