Senthil Kumar: సెంథిల్ కుమార్(Senthil Kumar) పరిచయం అవసరం లేని పేరు. సినిమాటోగ్రాఫర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈయన రాజమౌళి(Rajamouli) సినిమాలకు ఎక్కువగా పని చేశారని చెప్పాలి. రాజమౌళి దర్శకత్వంలో ఇప్పటివరకు సుమారు 12 సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాగ ఒకటి రెండు సినిమాలకు మినహా మిగిలిన అన్ని సినిమాలకు సెంథిల్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు. రాజమౌళి సినిమాలు ఎంతో అద్భుతంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి అంటే అందులో సెంథిల్ పాత్ర కూడా ఎంతో ఉందని చెప్పాలి. ఇటీవల రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRR సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.
రాజమౌళి సెంథిల్ మధ్య విభేదాల?
ఇక ఈ సినిమా తర్వాత రాజమౌళి మహేష్ బాబు(Mahesh Babu)తో సినిమా చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. అయితే ఈ సినిమా కోసం కూడా సెంథిల్ పని చేస్తారని అందరూ భావించారు కానీ ఊహించని విధంగా ఈ సినిమా నుంచి రాజమౌళి సెంథిల్ ను తప్పించారు. ఇలా సెంథిల్ రాజమౌళి సినిమా నుంచి తప్పుకోవడంతో ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయని అందుకే రాజమౌళి మరొకరిని సంప్రదించారు అంటూ ఎన్నో రకాల వార్తలు బయటకు వచ్చాయి. తాజాగా ఈ వార్తలకు సినిమాటోగ్రాఫర్ సెంథిల్ పూర్తిగా చెక్ పెట్టేశారు.
రాజమౌళి ముందే చెప్పారా?
రాధాకృష్ణారెడ్డి దర్శకత్వంలో కిరీటి రెడ్డి హీరోగా నటించిన చిత్రం జూనియర్(Junior). ఈ సినిమాకు సెంథిల్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదలై మంచి సక్సెస్ అందుకున్న నేపథ్యంలో సెంథిల్ కూడా వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. ఈ సందర్భంగా SSMB 29 సినిమా కోసం రాజమౌళి సెంథిల్ ను పక్కన పెట్టడానికి గల కారణం ఏంటని ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు సెంథిల్ సమాధానం చెబుతూ… రాజమౌళి డైరెక్షన్లో నేను ఇదివరకు కొన్ని సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా పని చేయలేదని తెలిపారు..
రూమర్లకు చెక్ పెట్టిన సెంథిల్…
ఇకపోతే రాజమౌళి కథ బట్టి ఎవరు సినిమాటోగ్రాఫర్ గా ఉండాలి, ఎవరు నటీనటులుగా ఉండాలి, ఇతర టెక్నీషియన్లు ఎవరనే విషయాలన్నింటినీ ముందుగానే ఫైనల్ చేసుకుంటారని అందుకు అనుగుణంగానే నేను ఈ సినిమాకు సూట్ అవ్వనన్న ఉద్దేశంతోనే కొత్త వాళ్లను అప్రోచ్ అయ్యారే, తప్ప మా ఇద్దరి మధ్య ఎలాంటి విభేదాలు మనస్పర్ధలు లేవని క్లారిటీ ఇచ్చారు. అయితే రాజమళి ఈ విషయాన్ని నాకు సినిమా షూటింగ్ ప్రారంభం కాకముందే చెప్పారు. వల్లి గారు ఫోన్ చేసి ఇలా మహేష్ బాబుతో చేయబోయే సినిమా కోసం వేరే సినిమాటోగ్రాఫర్ ను అనుకుంటున్నాము అంటూ నాకు ముందే చెప్పేశారు. ఇలా ఈ సినిమాకు మేం పని చేయకపోయినా తదుపరి సినిమా కోసం పని చేస్తామని ఈయన క్లారిటీ ఇచ్చారు. ఈ విధంగా సెంథిల్ రాజమౌళి మహేష్ బాబు సినిమా గురించి క్లారిటీ ఇవ్వడంతో ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయని వార్తలకు పూర్తిగా పులిస్టాప్ పెట్టినట్టు అయింది.
Also Read: War 2Trailer: వార్ 2 ట్రైలర్ రిలీజ్ థియేటర్లలోనే.. రచ్చ మామూలుగా ఉండదుగా?