Manchu Lakshmi: మంచు లక్ష్మి(Manchu Lakshmi) తెలుగు సినీ ప్రేక్షకులకు, బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. ప్రముఖ సినీ నటుడు మంచు మోహన్ బాబు(Manchu Mohan Babu) వారసురాలిగా మంచు లక్ష్మి కూడా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక ఈమె ఇప్పటివరకు ఇండస్ట్రీలో నటిగా సరైన గుర్తింపు మాత్రం అందుకోలేకపోయారని చెప్పాలి. నటిగా ఎన్నో విభిన్నమైన పాత్రలలో నటిస్తూ ఎప్పటికప్పుడు తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉన్నారు. ఇలా వెండితెరపై మాత్రమే కాకుండా బుల్లితెరపై కూడా ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తూ ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు. ఇక ఈమె ఫాస్ట్ గా చేసిన బుల్లితెర కార్యక్రమాల ద్వారా వచ్చిన డబ్బుతో ఎన్నో సేవ కార్యక్రమాలను నిర్వహించిన సంగతి తెలిసిందే.
రాజకీయాలలోకి మంచు లక్ష్మి…
ఇలా సినిమాలు బుల్లితెర కార్యక్రమాలు అంటూ ఎంతో బిజీగా గడుపుతున్న మంచు లక్ష్మి ఇటీవల కాలంలో బాలీవుడ్ అవకాశాల కోసం ప్రయత్నాలు కూడా చేస్తున్నారంటూ వార్తలు వినిపించాయి. ప్రస్తుతం ఈమె హైదరాబాద్లో కాకుండా ముంబైలో ఉన్న నేపథ్యంలో బాలీవుడ్ ప్రయత్నాలు చేస్తున్నారంటూ వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇదిలా ఉండగా మంచు లక్ష్మి రాజకీయాలలోకి (Politics)కూడా రాబోతున్నారు అంటూ ప్రతిసారి వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.
రాజకీయ నేపథ్యం…
మంచు కుటుంబానికి మంచి రాజకీయ నేపథ్యం ఉందని చెప్పాలి. తన తండ్రి మోహన్ బాబు రాజ్యసభ సభ్యులుగా కూడా పనిచేశారు సీనియర్ నటుడు దివంగత నందమూరి తారక రామారావు గారు ఉన్న సమయంలోనే మోహన్ బాబు కూడా రాజకీయాలలోకి వచ్చి అప్పట్లో తెలుగుదేశం పార్టీ కోసం ఎంతో కష్టపడి పని చేశారు. ఇక రామారావు గారు మరణించిన తర్వాత మోహన్ బాబు ప్రత్యక్ష రాజకీయాలలో పాల్గొనలేదని చెప్పాలి. ఇలా రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం కావడంతో మంచు వారసులు కూడా రాజకీయాలలోకి రాబోతున్నారు అంటూ ఇటీవల కాలంలో వార్తలు వినపడుతూనే ఉన్నాయి. ఇక మంచు లక్ష్మి కూడా ఈ పార్టీలోకి రాబోతుందని, ఆ పార్టీలోకి రాబోతుంది అంటూ ఎన్నో వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈమె క్లారిటీ ఇచ్చారు.
లీడర్ గా చూడాలనుకుంటున్నారు…
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మంచు లక్ష్మికి రాజకీయాల గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ ప్రశ్నకు ఈమె సమాధానం చెబుతూ ఈ ప్రశ్న గత కొంతకాలంగా వినపడుతూనే ఉందని తెలిపారు. అయితే ప్రజలు నన్ను రాజకీయాలలో ఒక లీడర్ గా చూడాలని కోరుకున్నందుకు తాను చాలా సంతోషపడుతున్నానని తెలిపారు. ఇక కొన్నిసార్లు నేను తెలుగుదేశం పార్టీలోకి వెళ్తున్నానని కూడా వార్తలు వచ్చాయి. అయితే రాజకీయాలకు నేను సెట్ అవ్వనని తెలిపారు. నేను ఎప్పుడు గలగల మాట్లాడుతూనే ఉంటాను. రాజకీయాలకు అది పనికిరాదు రాజకీయాలలోకి వెళ్తే నోటికి తాళం వేసుకోవాల్సి వస్తుంది. అలా నోటికి తాళం వేసుకుని నేను కూర్చోలేనని అందుకే రాజకీయాలలోకి వచ్చే ప్రసక్తి ఏ మాత్రం లేదు అంటూ ఈ సందర్భంగా మంచు లక్ష్మి క్లారిటీ ఇచ్చారు.
Also Read: రష్మితో రొమాన్స్ .. అబ్బో ఈ హీరోకు కోరికలు మామూలుగా లేవే?