Vijay Antony: బుల్లితెరపై ఎన్నో కార్యక్రమాలు ప్రసారం అవుతూ, ప్రేక్షకులను కడుపుబ్బానవ్విస్తూ వారికి కావలసిన వినోదాన్ని అందిస్తున్నాయి. ఇలా ప్రతి ఒక్క ఛానల్ లో కూడా ఎన్నో రకాల కార్యక్రమాలు ప్రసారమవుతూ ప్రతిరోజు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నాయి. ఇక ఈటీవీలో ప్రసారమయ్యే కార్యక్రమాలకు విపరీతమైన ఆదరణ ఉందని చెప్పాలి. ఈ ఛానల్ లో ప్రసారమయ్యే జబర్దస్త్ కార్యక్రమంతో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ డాన్స్ షో వంటి కార్యక్రమాలకు ఎంతో మంచి ఆదరణ లభిస్తుంది.
మార్గన్ సినిమా ప్రమోషన్స్…
ఇక జబర్దస్త్ కార్యక్రమంలో సందడి చేసే కమెడియన్స్ తో పాటు పలువురు బుల్లితెర నటీనటులు శ్రీదేవి డ్రామా కంపెనీ (sridevi Drama Company) కార్యక్రమంలో సందడి చేస్తూ ప్రతివారం సరికొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇక త్వరలోనే బోనాలు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో బోనాల స్పెషల్ అంటూ ఒక స్పెషల్ ఎపిసోడ్ ద్వారా శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమం ఈ ఆదివారం ప్రసారం కాబోతోంది.. ఇక ఈ కార్యక్రమానికి సంబంధించి తాజాగా ఒక ప్రోమో విడుదల చేశారు. ఇక ఈ ప్రోమోలో భాగంగా నటుడు విజయ్ ఆంటోని (Vijay Antony)నటించిన మార్గన్ సినిమా(Margan Movie) ద్వారా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈయన ప్రమోషన్లలో భాగంగా ఈ కార్యక్రమంలో సందడి చేశారు.
రొమాంటిక్ పర్ఫామెన్స్…
ఇక ఈ కార్యక్రమంలోకి విజయ్ ఎంట్రీ ఇవ్వగానే యాంకర్ రష్మీ(Rashmi) తనకు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. అనంతరం విజయ్ రష్మితో మాట్లాడుతూ మీరు నాకు తెలుగు నేర్పిస్తారా అంటూ ప్రశ్నించారు. దీంతో వెంటనే నటి ఇంద్రజ రష్మీ నేర్పించే తెలుగులో మీరు మాట్లాడతారా అంటూ షాక్ అయ్యారు. అనంతరం విజయ్ రష్మితో మాట్లాడుతూ నీతో కలిసి స్టేజ్ పై డాన్స్ చేయాలనుకుంటున్నాను అంటూ ఆమెతో కలిసి ఒక రొమాంటిక్ డాన్స్ పర్ఫామెన్స్ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఈ ప్రోమో వీడియో వైరల్ అవుతుంది.
ఇలా స్టేజ్ మీదనే హీరో విజయ్ ఆంటోని రష్మితో కలిసి డాన్స్ చేయడంతో అభిమానులు షాక్ అవ్వడమే కాకుండా, ఇలా మీరు మా రష్మితో డాన్స్ చేస్తే సుధీర్ అన్న ఫీల్ అవ్వడా? అంటూ నెటిజన్స్ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున బోనాలకు సంబంధించిన సన్నివేశాలతో పాటు ఆటపాటలతో ప్రేక్షకులను మెప్పించబోతున్నారని స్పష్టమవుతుంది. ఇక హీరో విజయ్ సినిమా విషయానికి వస్తే ఈ చిత్రం ఒక మర్డర్ మిస్టరీ-క్రైమ్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.లియో జాన్ పాల్ దర్శకత్వంలో విజయ్ ఆంటోనీ ఫిల్మ్స్ కార్పొరేషన్ నిర్మించిన ఈ సినిమా జూన్ 27వ తేదీ తమిళంలో మాత్రమే కాకుండా తెలుగులో కూడా విడుదల కాబోతున్న నేపథ్యంలో ఇక్కడ కూడా విజయ్ పెద్ద ఎత్తున ప్రమోషన్లలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు. ఇక బిచ్చగాడు సినిమా సమయం నుంచి విజయ్ ఆంటోని తన సినిమాలను తెలుగులో కూడా విడుదల చేస్తున్న విషయం తెలిసిందే.
Also Read: రోజంతా నా బెస్టీతోనే.. బాబోయ్ నిహారిక కోరికలు మాములుగా లేవుగా!