E-Paper
Advertisement

తండ్రి పై బాంబు బ్లాస్ట్.. మంచు లక్ష్మీ బయట పెట్టిన నిజం!

తండ్రి పై బాంబు బ్లాస్ట్.. మంచు లక్ష్మీ బయట పెట్టిన నిజం!
Advertisement

Manchu Lakshmi: చిత్ర సీమలో సెలబ్రిటీ కిడ్ గా తనకంటూ ఒక మంచి పేరు సొంతం చేసుకోవడమే కాకుండా తన గొప్ప మనసుతో ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తుకు పాటుపడుతూ.. విద్యాదానం చేస్తూ అందరి దృష్టిని ఆకట్టుకుంటున్న మంచు లక్ష్మీ (Manchu Lakshmi) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ముఖ్యంగా సినిమాలతో బిజీగా ఉన్నా.. అప్పుడప్పుడు పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలలో పాల్గొంటూ.. సందడి చేసే ఈ ముద్దుగుమ్మ.. తాజాగా ప్రముఖ సినీ నటుడు రాజా రవీంద్ర స్టార్ట్ చేసిన పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొని ఎన్నో విషయాలను పంచుకుంది. అందులో భాగంగానే “శ్రీరాములయ్య” సినిమా ఓపెనింగ్ సమయంలో తన తండ్రి మోహన్ బాబు పై జరిగిన బాంబు బ్లాస్ట్ గురించి విస్తుపోయే నిజాలు బయటపెట్టింది. ముఖ్యంగా తన తండ్రి ఎందుకు బ్రతికున్నారు? అనే ప్రశ్న తనలో మొదలైంది అనే ఆశ్చర్యకర విషయాన్ని బయటపెట్టింది మంచు లక్ష్మీ.. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

బాంబు బ్లాస్ట్ పై స్పందించిన మంచు లక్ష్మీ..

ఈ నేపథ్యంలోనే తన తండ్రిపై జరిగిన బాంబు బ్లాస్ట్ గురించి మంచు లక్ష్మీ మాట్లాడుతూ.. ” ఆ సమయంలో నాకు ఫోన్ వచ్చింది ..ఎక్కడ ఉన్నావ్ లక్ష్మి.. డాడీకి బాంబ్ బ్లాస్ట్ అయింది. ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. ఈ విషయం అన్నపూర్ణ స్టూడియో వరకు వినిపించిందని అన్నారు. అప్పుడు నాకేం అర్థం కాలేదు. మా నాన్న ఎందుకు బ్రతికారు? వీళ్ళు ఎందుకు చనిపోయారు ? మా నాన్న బ్రతుకుతారా? లేదా? ఆయన ముందున్న కారులో అందరూ చనిపోయారు. అలాగే వెనుకున్న కారులో కూడా అందరూ చనిపోయారు.. ఆయన ఉన్న కారులో వెనకాల బాడీగార్డ్స్ కూడా చనిపోయారు.. దేవుడు వచ్చి ఒక కవచం వేసినట్టే జరిగింది” అంటూ ఎమోషనల్ అయ్యింది మంచు లక్ష్మీ. ఏది ఏమైన మంచు లక్ష్మీ చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.. ఇకపోతే తాజాగా విడుదల చేసిన ఈ ప్రోమో అందరినీ ఆకట్టుకుంటోంది. అలాగే క్యూరియాసిటీని కూడా పెంచేస్తోంది. మంచు లక్ష్మీ ఇంకా ఈ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో ఏమేం చెబుతుందో చూడాలి.

బాంబ్ బ్లాస్ట్ ఎప్పుడు? ఎలా జరిగిందంటే?

Advertisement

మోహన్ బాబు 1997లో శ్రీరాములయ్య సినిమా ఓపెనింగ్ నుంచీ వస్తుండగా బాంబు బ్లాస్ట్ జరిగింది. ఈ సినిమాని అప్పటి రాజకీయ నాయకులు పరిటాల రవి తండ్రి పరిటాల శ్రీరాములు జీవితం ఆధారంగా రూపొందించారు.. శంకర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఓపెనింగ్ రామానాయుడు స్టూడియోలో జరిగింది. దీనికి గెస్ట్ గా పరిటాల రవి కూడా హాజరయ్యారు . ఓపెనింగ్ జరిగాక పరిటాల రవి , మోహన్ బాబు ఒకే కారులో బయలుదేరారు. ముందు , వెనుక కార్లలో వారి మనుషులు , సెక్యూరిటీ సిబ్బంది కూడా ఉన్నారు. అయితే రామానాయుడు గేటు దాటగానే బాంబు ఒక్కసారిగా బ్లాస్ట్ అయింది . ముందు కారులో ఉన్న వారంతా చనిపోయారు . వెనుకల కారులో ఉన్న వాళ్ళు కూడా చనిపోయారు. మిడిల్ కారులో పరిటాల రవి, మోహన్ బాబు మాత్రమే ఉన్నారు. అయితే వీరితో పాటు కారులో ఉన్న గన్ మెన్స్ అందరూ చనిపోయారు. కానీ పరిటాల రవి , మోహన్ బాబు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు.

also read:మళ్లీ చిక్కుల్లో పడ్డ నోరాఫతేహి.. మహిళా కమీషన్ ఫైర్!

మోహన్ బాబు సినిమా కెరియర్..

Advertisement

మోహన్ బాబు విషయానికి వస్తే.. చిత్ర పరిశ్రమలో అంచలంచెలు ఎదుగుతూ ఉన్నత స్థాయికి చేరుకున్నారు. అయితే ఈ స్టేజికి రావడానికి ఆయన ఎన్ని కష్టాలు పడ్డారో.. ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నారో అందరికీ తెలిసిందే . మొదట్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ విలన్ గా చేసి ఆ తర్వాత హీరోగా సెటిల్ అయ్యారు. మళ్లీ విలన్ గా చేసి ఆ తర్వాత హీరోగా ఎదిగారు. అలా విలక్షణ నటుడిగా పేరు దక్కించుకున్న ఈయన కలెక్షన్ కింగ్ గా టాలీవుడ్లో ఎదురులేని హీరోగా పేరు దక్కించుకున్నారు.. సుమారుగా 500కి పైగా చిత్రాలు చేసి ప్రేక్షకులను మెప్పించిన ఈయన ఇప్పుడు మళ్లీ విలన్ గా సినిమాలు చేస్తున్నారు.. అందులో భాగంగానే నాని హీరోగా నటిస్తున్న “ది ప్యారడైజ్” చిత్రంలో విలన్ గా నటిస్తున్నారు మోహన్ బాబు.

Related News

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

Big Stories

Advertisement
×