GST 2.0: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త జీఎస్టీ వల్ల సామాన్యుడికి ఉపశమనం లభించిందా? దేశంలోని చాలా ప్రాంతాల్లో పాత రేట్లను కంటిన్యూ చేశారా? చాలా ప్రాంతాల్లో పన్ను తగ్గించినా కొత్త ధరలు అమల్లోకి రావడం లేదా? షాపుల్లో కాకుండా ఈ కామర్స్ ఫ్లాట్‌ఫామ్స్‌లో సంస్కరణల ప్రయోజనాలు సామాన్యులకు బదిలీ కావడం లేదా? ధరలు తగ్గలేదని కస్టమర్లు ఆందోళన వ్యక్తం చేయడంతో కేంద్రం రంగంలోకి దిగేసింది. ధరల విషయంలో ఎక్కడైనా తగ్గించకుంటే నేరుగా ఫిర్యాదు చేయవచ్చని టోల్ ఫ్రీ నెంబర్, వాట్సాప్ నెంబర్ అందుబాటులోకి తెచ్చింది.
సెప్టెంబర్ 22 నుంచి దేశవ్యాప్తంగా కొత్త రేట్లు జీఎస్టీ అమల్లోకి వచ్చేసింది. నిత్యావసర సరుకుల మొదలు సిమెంట్, కార్లు, టీవీల తదితర వస్తువులకు పన్ను అమాంతంగా తగింది. గతంలో నాలుగు పన్ను శ్లాబులు ఉండేవి. ఇప్పుడు కొత్తగా రెండు స్లాబులను పెట్టారు. 5, 18 శాతం పన్ను శ్లాబులను కొనసాగించినట్టు కేంద్రం తెలిపింది. కొత్తగా 40 శాతం పన్ను శ్లాబును తీసుకొచ్చింది. కాకపోతే సైన్ గూడ్స్, లగ్జరీ వస్తువులను, పొగాకు ఉత్పత్తులను ఆ జాబితాలోకి చేర్చింది. వాటి ధరలు పెరుగుతాయి. కొన్ని లగ్జరీ వస్తువుల ధరలు తగ్గాయి కూడా.
కొత్త జీఎస్టీ రేట్లతో నిత్యావసర వస్తువులపై కుటుంబానికి అయ్యే ఖర్చులో దాదాపు 13 శాతం తగ్గుతుందని ఓ అంచనా. రోజువారీ వినియోగ వస్తువుల ధర 99 శాతం తగ్గింది. ఇదే సమయంలో కొనుగోలు దారులకు డబ్బు ఆదా అవుతుందని పలు సందర్భాల్లో చెబుతూ వచ్చింది కేంద్రం. కొత్త జీఎస్టీ అమలులోకి వచ్చిన నుంచి ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్స్, కొన్ని షాపుల్లో ఆ ప్రయోజనాలు సామాన్యులకు బదిలీ కాలేదు. దీనిపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.
ఓల్డ్ స్టాక్ అంటూ పాత ధరలకే అమ్ముతున్నారు వ్యాపారులు. ధరలు తగ్గించలేదని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారుల జేబుల్లోకి జీఎస్టీ తగ్గింపు ప్రయోజనం వెళ్లాయి. రేట్లు తగ్గకపోవడంతో సామాన్యులు నిరాశలో ఉన్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. తమకు అందిన ఫిర్యాదులపై ఆరా తీస్తున్నామని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
ALSO READ: ఫ్లిప్ కార్డు కళ్లు చెదిరే దసరా ఆఫర్లు.. ఎథ్నిక్ వేర్ పై ఏకంగా 85శాతం తగ్గింపు
జీఎస్టీ రేటు తగ్గింపు ప్రయోజనాలను పొందని వినియోగదారులు నేరుగా తమకు ఫిర్యాదు చేయవచ్చని పేర్కొంది. టోల్ ఫ్రీ నంబర్ 1915 లేదా 8800001915 వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని కేంద్ర పరోక్ష పన్నులు-కస్టమ్స్ బోర్డు-CBIC తెలిపింది. దీనికితోడు ఇంటిగ్రేటెడ్ గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజం-INGRAM పోర్టల్‌లో ఫిర్యాదులు లేదా ప్రశ్నలను నమోదు చేసుకోవచ్చని CBIC పేర్కొంది. INGRAM అనేది వినియోగదారుల వ్యవహారాలు-ఆహారం-ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ ద్వారా నిర్వహించబడేది. వినియోగదారులు, వ్యాపారాలు, నియంత్రణ సంస్థలు, ప్రభుత్వ సంస్థలను అనుసంధానించే కేంద్రీకృత వేదిక కూడా.