Mohan Babu:లెజెండ్రీ నటులుగా పేరు సొంతం చేసుకున్న కోటా శ్రీనివాసరావు (Kota Srinivas Rao) 83 ఏళ్ల వయసులో వయోభారంతో పాటూ అనారోగ్య కారణాల వల్ల తుది శ్వాస విడిచారు. ఆయన మరణంతో సినీ ఇండస్ట్రీ మూగబోయింది. పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు కోటా శ్రీనివాసరావు మరణానికి సంతాపం తెలియజేశారు. ఇక చాలామంది ఆయన కుటుంబాన్ని కలిసి పరామర్శించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ జాబితాలోకి కలెక్షన్ కింగ్, డాక్టర్ మోహన్ బాబు (Mohan Babu) కూడా వచ్చి చేరారు. తాజాగా కోట శ్రీనివాసరావు కుటుంబాన్ని పరామర్శించిన మోహన్ బాబు “ఆప్తుడి మరణం భరించరానిది” అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు.
కోట శ్రీనివాసరావు కుటుంబాన్ని పరామర్శించిన మోహన్ బాబు..
తాజాగా కోట శ్రీనివాసరావు కుటుంబాన్ని పరామర్శించిన మోహన్ బాబు పలు కీలక విషయాలను గుర్తు చేసుకున్నారు.
ఆయన మాట్లాడుతూ.. “కోటా శ్రీనివాసరావు మరణించిన రోజు నేను హైదరాబాదులో లేను. ఆయన మరణం నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. కోటా శ్రీనివాసరావు నాకు అత్యంత ఆప్తుడు. ఇటీవల కన్నప్ప రిలీజ్ రోజు కూడా ఫోన్ చేసి సినిమా చాలా బాగుంది. విష్ణుకి మంచి పేరు వచ్చింది అని అంటున్నారు అంటూ నాతో చెప్పారు. 1987వ సంవత్సరంలో ‘వీర ప్రతాప్’ అనే సినిమాలో మాంత్రికుడిగా, మెయిన్ విలన్ క్యారెక్టర్ లో నా బ్యానర్ లోనే అవకాశం కల్పించాను. ఇక మా బ్యానర్ తో పాటు ఇతర బ్యానర్లలో కలసి మేమిద్దరం చాలా సినిమాలలో నటించాము.
ఆయన ఒక గొప్ప విలక్షను నటుడు – మోహన్ బాబు
ఏ పాత్రలోనైనా అవలీలగా పోషించగలిగిన గొప్ప నటుడు కోటా శ్రీనివాసరావు. విలన్ గా, కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా డిఫరెంట్ టైప్ ఆఫ్ మాడ్యులేషన్లో ఏ డైలాగ్ అయినా చెప్పగలిగే గొప్ప నటుడు కోటా శ్రీనివాసరావు. కోట శ్రీనివాసరావు మా ఫ్యామిలీకి అత్యంత సన్నిహితులు. ఆయన మరణం నా కుటుంబానికే కాదు సినిమా పరిశ్రమకు కూడా తీరనిలోటు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి మనశ్శాంతి కలగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను” అంటూ మోహన్ బాబు తెలిపారు. ప్రస్తుతం కోటా శ్రీనివాసరావు కుటుంబాన్ని పరామర్శించిన మోహన్ బాబు కోట శ్రీనివాసరావును తలుచుకొని కన్నీటి పర్యంతమయ్యారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
కోట శ్రీనివాసరావు చివరి సినిమా..
గత కొన్ని రోజులుగా వయోభారంతో బాధపడిన ఆయన ఇంట్లో ఖాళీగా కూర్చోలేక సినిమాలలో నటించాలనుకున్నారు. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ సహాయంతో ‘హరిహర వీరమల్లు’ సినిమాలో అవకాశం దక్కించుకున్నారు. ఇక అదే ఆయన చివరి సినిమా కావడం గమనార్హం. ఇకపోతే ఈ సినిమా కోసం ఏకంగా నాలుగు రోజులకు గాను నాలుగు లక్షల రూపాయలు రెమ్యూనరేషన్ గా తీసుకున్నట్లు సమాచారం. జూలై 24వ తేదీన విడుదల కాబోతున్న ఈ సినిమా చూడకుండానే ఆయన మరణించడం బాధాకరమని చెప్పాలి.
ALSO READ:HHVM Press Meet : టైం ఇవ్వలేను… తప్పు ఒప్పుకున్న పవన్ కళ్యాణ్