HHVM Press Meet: చివరిగా ‘బ్రో’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు పవన్ కళ్యాణ్. ఈ సినిమా పెద్దగా ఇంపాక్ట్ చూపించలేదు. ఆ తర్వాత డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి (Krish jagarlamudi) దర్శకత్వంలో ‘హరిహర వీరమల్లు’ సినిమా అనౌన్స్ చేశారు. కానీ ఈ సినిమా షూటింగ్ పూర్తి అవడానికి దాదాపు 4 ఏళ్లు పట్టింది. ఇక ఎట్టకేలకు పలుమార్లు వాయిదా పడుతూ.. జూలై 24వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది ఈ సినిమా. ఈ క్రమంలోనే తాజాగా పవన్ కళ్యాణ్ తన సమయాన్ని కుదుర్చుకొని మరీ హరిహర వీరమల్లు సినిమా కోసం ప్రెస్ మీట్ గ్రాండ్గా నిర్వహిస్తున్నారు. ఈ ప్రెస్ మీట్ లో సినిమా గురించి పలు విషయాలు పంచుకున్న ఈయన.. తన సినిమా జీవితంపై కూడా పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇక సినిమాలు చేయను – పవన్ కళ్యాణ్
తాజాగా ప్రెస్ మీట్ లో పాల్గొన్న పవన్ కళ్యాణ్ తన తదుపరి చిత్రాల గురించి మాట్లాడుతూ..” ఇక భవిష్యత్తులో నేను సినిమాలు చేస్తానో.. చేయనో నాకు తెలియదు.. దాదాపు సినిమాలకు దూరంగా ఉంటాను” అంటూ షాకింగ్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. మొత్తానికైతే ఇక భవిష్యత్తులో సినిమాలు చేయను అని డైరెక్ట్ గా చెప్పేయడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఈ షాకింగ్ స్టేట్మెంట్ కి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్ సినిమాలు..
పవన్ కళ్యాణ్ సినిమాల విషయానికొస్తే హరిహర వీరమల్లు సినిమాను జూలై 24వ తేదీన విడుదల చేయబోతున్నారు. ఈ సినిమా తర్వాత ప్రముఖ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో ఓజీ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 25న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఎలాగైనా సరే ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంటారు అని అభిమానులే కాదు సినీ ప్రేమికులు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కూడా చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల చేయబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే
హరిహర వీరమల్లు 2 హింట్ ఇచ్చిన నిధి అగర్వాల్..
ఇక ఈ సినిమాల తర్వాత హరిహర వీరమల్లు 2 కూడా ఉండబోతుంది అని హీరోయిన్ నిధి అగర్వాల్ హింట్ ఇచ్చింది. ఇక దీంతో హరిహర వీరమల్లు 2 ఖచ్చితంగా ఉంటుంది అని అందరూ ఫిక్స్ అయిపోయారు. కొంత భాగం షూటింగ్ కూడా పూర్తయినట్టు తెలిపింది ఈ ముద్దుగుమ్మ. మరి ఇలాంటి సమయంలో ఇక సినిమాలు చేయను అని పవన్ కళ్యాణ్ చెబుతున్నారు. ఇక దీంతో హరిహర వీరమల్లు 2 పవన్ కళ్యాణ్ చివరి సినిమా కానుందా అని అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.
ALSO READ:HHVM Press Meet : టైం ఇవ్వలేను… తప్పు ఒప్పుకున్న పవన్ కళ్యాణ్