Manchu Vishnu: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎంతో మంచి క్రేజ్ ఉన్న కుటుంబాలలో మంచు కుటుంబం(Manchu Family) కూడా ఒకటి. మంచి మోహన్ బాబు ఇండస్ట్రీలో ఉన్నటుడిగా నిర్మాతగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. మోహన్ బాబు వారసులుగా ఇండస్ట్రీలోకి తన ముగ్గురు పిల్లలు ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే విష్ణు, మనోజ్, లక్ష్మీ ప్రసన్న ఇండస్ట్రీలో అనుకున్న స్థాయిలో మాత్రం సక్సెస్ అందుకోలేకపోయారు. ఇక మంచు విష్ణు(Manchu Vishnu) ఇటీవల కన్నప్ప(Kannappa) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. విష్ణు తన కెరీయర్ లో నటించిన సినిమాలలో కన్నప్ప సినిమా కూడా మంచి పేరు ప్రఖ్యాతలను తీసుకువచ్చింది.
మనసులో కోరిక బయటపెట్టిన విష్ణు…
ఇలా కన్నప్ప సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విష్ణు ఈ సినిమా ద్వారా మంచి సక్సెస్ అందుకున్న నేపథ్యంలో ఈయన మరో సినిమా గురించి తన మనసులో కోరికను బయటపెట్టారు. తనకు రామాయణం(Ramayanam) సినిమా చేయాలని ఉందంటూ అసలు విషయం బయటపెట్టారు. ఇప్పటికే రామాయణం ఆధారంగా ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి త్వరలోనే బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి మరొక సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇలాంటి తరుణంలోనే మంచు విష్ణు కూడా రామాయణం సినిమా చేయాలని ఉందనే విషయాన్ని బయట పెట్టడంతో ఇది కాస్త సంచలనంగా మారింది.
హనుమంతుడిగా విష్ణు..
మరి ఈయన రామాయణం సినిమా చేస్తే కనుక అందులో ఎవరెవరు నటించబోతున్నారు? ఎవరు ఏ పాత్రలో నటించబోతున్నారనే విషయాలు గురించి కూడా ఒక సందర్భంలో తెలియచేశారు. ఒకవేళ మంచు విష్ణు రామాయణం సినిమా చేస్తే అందులో రాముడి పాత్రలో కోలీవుడ్ నటుడు సూర్య(Suriya) అయితే బాగుంటుందని తెలియజేశారు. ఇక సీత పాత్రలో బాలీవుడ్ నటి ఆలియా భట్(Alia Bhatt) ను తీసుకుంటానని వెల్లడించారు. ఇక రావణాసురుడి పాత్రలో మోహన్ బాబు(Mohan Babu), తాను హనుమంతుడి పాత్రలో నటిస్తానని తెలిపారు. ఇక జటాయుగా సత్యరాజ్(Satya Raj), ఇంద్రజిత్ గా కోలీవుడ్ నటుడు కార్తి(Karthi)ను తీసుకుంటాను అంటూ ఈ సందర్భంగా రామాయణం గురించి అందులో నటీనటుల గురించి కూడా మంచి విష్ణు తెలిపారు.
బాలీవుడ్ రామాయణ…
ఇలా మంచు విష్ణు రామాయణం గురించి ఈ విషయాలను తెలియచేయడంతో ఇది కాస్త సంచలనంగా మారింది. కన్నప్ప డ్రీం ప్రాజెక్టు కోసం దాదాపు పది సంవత్సరాలపాటు కష్టపడిన విష్ణు ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నారు. మరి ఈయన అనుకున్న విధంగా రామాయణం సినిమా ఎప్పుడు పట్టాల పైకి వెళ్తుందో, ఈ సినిమా చేయాలనుకుంటే ఈ నటీనటులందరూ ఈ ప్రాజెక్టులో భాగమవ్వడానికి ఒప్పుకుంటారా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇకపోతే ఇదివరకే రామాయణం గురించి చాలా సినిమాలు వచ్చాయి. తాజాగా బాలీవుడ్ దర్శకుడు నితేష్ తివారి దర్శకత్వంలో రణబీర్ కపూర్, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా రామాయణ అనే సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు ఇక ఇందులో రావణాసురుడిగా కన్నడ స్టార్ యష్ నటించబోతున్న సంగతి తెలిసిందే.
Also Read: Fish Venkat Death: మా నాన్న చావుకు వాళ్లే కారణం… దారుణంగా మోసం చేశారు!