Samson brothers : టీమిండియా క్రికెటర్ సంజు శాంసన్ గురించి దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. అతను టీ-20 ఇండియా జట్టులో ఆడుతున్నాడు. రాజస్థాన్ రాయల్స్ జట్టుకి కెప్టెన్ గా కూడా వ్యవహరించాడు. 2012 అండర్ -19 ప్రపంచ కప్ లో భారత్ కి ప్రాతినిధ్యం వహించేందుకు శాంసన్ ని UAE కి పంపారు. అయితే అతను సెలెక్టర్లను మాత్రం నిరాశ పరచలేదు. భారత్ తరపున అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. ఆ సమయంలో మూడు హాఫ్ సెంచరీుల చేసిన ఏకైక ఆటగాడిగా నిలిచాడు. భారత్ సెమీ ఫైనల్ కి అర్హత సాధించలేదు. కానీ టోర్నమెంట్ మొత్తంలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్ మెన్ జాబితాలో 6వ స్థానంలో నిలిచాడు సంజు శాంసన్. ఇక ఆతరువాత ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ తరపున.. టీమిండియా తరపున ఆడాడు.
Also Read : Riley Norton : 2024లో క్రికెట్ వరల్డ్ కప్.. 2025లో రగ్బీ వరల్డ్ కప్..!
కొచ్చి బ్లూ టైగర్స్ కెప్టెన్ గా శాంసన్ అన్న
తాజాగా సంజు శాంసన్ మరో లీగ్ లోో కూడా ఆడనున్నాడు. అదే మరేదో కాదు.. కేరళ క్రికెట్ లీగ్ 2025 సీజన్ లో టీమ్ ఇండియా స్టార్ వికెట్ కీపర్, బ్యాటర్ సంజు శాంసన్ ఆడనున్న విషయం తెలిసిందే. గత నెలలో జరిగిన వేలంలో శాంసన్ ను కొచ్చి బ్లూ టైగర్స్ రూ.26.80 లక్షల భారీ ధరకు కొనుగోలు చేసింది. దీంతో కొచ్చి బ్లూ టైగర్స్ కెప్టెన్ గా సంజు శాంసన్ ఎంపిక అవుతాడని అంతా భావించారు. కానీ చివరి నిమిషంలో వచ్చి ఫ్రాంచైజీ అందరికి షాక్ ఇచ్చింది. సంజు శాంసన్ ని కాదని అతని అన్నయ్య సాలి శాంసన్ ని నియమించింది. అప్పటి వరకు సంజు శాంసన్ కి ఒక అన్నయ్య ఉన్నాడనే విషయం చాలా మందికి తెలియదు. తన అన్నయ్యకు డిప్యూటీగా సంజు శాంసన్ వ్యవహరించనున్నాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా కొచ్చి ఫ్రాంచైజీ వెల్లడించింది.
సంజు శాంసన్ ఆడడం ఇదే తొలిసారి
కేసీఎల్ వేలంలో సాలీ శాంసన్ కి రూ. 75 వేలకు కొచ్చి కొనుగోలు చేసింది. 34 సంవత్సరాల సాలీ శాంసన్ తన కెరీర్ ప్రారంభం నుంచి గాయాలతో సతమతమవుతూ వస్తున్నాడు. గత నాలుగేళ్లుగా అతను కేరళ జట్టుకు దూరంగా ఉన్నాడు. క్లబ్ క్రికెట్ లో మాత్రం ఆడుతూ వస్తున్నారు. కేరళ తరఫున ఇప్పటివరకు 6 లిస్ట్ ఏ మ్యాచ్ లు ఆడిన అతను కేవలం 38 పరుగులు మాత్రమే చేశాడు. అతనికి బ్యాట్ తో పాటు బంతితో కూడా రాణించే సత్తా ఉంది. క్లబ్ క్రికెట్ లో శాంసన్ కెప్టెన్సీ అనుభవం ఉంది. ఈ క్రమంలోనే అతడి కెప్టెన్సీ స్కిల్ పై నమ్మకంతో కొచ్చి తమ జట్టు పగ్గాలను అప్పగించింది. కేసీఎల్ మొదటి సీజన్లో కొచ్చి బ్లూ టైగర్స్ తీవ్ర నిరాశ పరిచింది. వరుస ఓటములతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో బ్లూ టైగర్స్ నిలిచింది. ఇప్పుడు సంజు శాంసన్ రాకతో ఎలాగైనా ఈ ఏడాది ఛాంపియన్ గా నిలవాలని కొచ్చి బ్లూ టైగర్స్ ఉవ్విళ్లూరుతోంది. కేరళ క్రికెట్ లీగ్ లో సంజు శాంసన్ ఆడడం ఇదే తొలిసారి. పైగా అన్నయ్య కెప్టెన్సీలో శాంసన్ ఆరంగేట్రం చేయనుండటం విశేషం.