E-Paper
Advertisement

రూ. 4000 కోట్లా? అంత సీన్ లేదు..‘రామాయణ’, ‘వారణాసి’లపై మనోజ్ భాజ్‌పేయి సెన్సేషన్ కామెంట్స్

రూ. 4000 కోట్లా? అంత సీన్ లేదు..‘రామాయణ’, ‘వారణాసి’లపై మనోజ్ భాజ్‌పేయి సెన్సేషన్ కామెంట్స్
Advertisement

Manoj Comments: మనోజ్ భాజ్‌పేయి…బాలీవుడ్ వెర్సటైల్ గా క్రేజ్ కొట్టేసిన ఈ యాక్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తనదైన నటనతో, డిఫరెంట్ రోల్స్ తో సత్తా చాటి ఇండియన్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు పొందిన సంగతి తెల్సిందే. కేవలం హిందీలోనే కాకుండా టాలీవుడ్‌లోనూ ఆయనకు మంచి గుర్తింపు ఉంది కూడా. 2006లో అల్లు అర్జున్ కథానాయకుడిగా ఏ కరుణాకరన్ దర్శకత్వంలో వచ్చిన ‘హ్యాపీ’ సినిమాలో పోలీస్ ఆఫీసర్‌గా మనోజ్ భాజ్‌పేయి చేసిన యాక్టింగ్, పండించిన కామెడీ తెలుగు ప్రేక్షకులను ఎంతగా అలరించిందో చెప్పక్కర్లేదు.ఆ తర్వాత కూడా పలు దక్షిణాది చిత్రాల్లో మెరిసిన ఆయన, ప్రస్తుతం వరుస బాలీవుడ్ ప్రాజెక్టులతో బిజీ అయిపోయారు.

షాకింగ్ కామెంట్స్ చేసిన మనోజ్ భాజ్‌పేయి

ఈ క్రమంలోనే ఆయన తాజాగా నటించిన ‘గవర్నర్’ అనే సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. అయితే ఈ చిత్ర ప్రమోషన్లలో భాగంగా మనోజ్ భాజ్‌పేయి చేసిన కొన్ని సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు అటు బాలీవుడ్‌తో పాటు ఇటు టాలీవుడ్‌లోనూ హాట్ టాపిక్ గా మారాయి. చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం నడుస్తున్న భారీ బడ్జెట్ ట్రెండ్, బాక్సాఫీస్ కలెక్షన్ల హడావుడిపై ఆయన ఎవరూ ఊహించని విధంగా షాకింగ్ కామెంట్స్ చేశారు.
రాజమౌళి – సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ మూవీ ‘వారణాసి’,అలాగే బాలీవుడ్‌లో నితీష్ తివారీ దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా తెరకెక్కుతున్న‘రామాయణం’ చిత్రాల బడ్జెట్‌లపై వస్తున్న వార్తలను ఆయన పూర్తిగా కొట్టిపారేశారు.

ఈ బడ్జెట్ నంబర్లన్నీ కేవలం పీఆర్ స్టంట్‌లో భాగమే

Advertisement

రాజమౌళి సినిమా దాదాపు రూ. 1400 కోట్ల భారీ బడ్జెట్‌తో, రణబీర్ కపూర్ ‘రామాయణ’ ఏకంగా మూడు భాగాలుగా రూ. 4000 కోట్ల భారీ వ్యయంతో రూపుదిద్దుకుంటున్నాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీనిపై స్పందించిన మనోజ్ భాజ్‌పేయి, ఈ బడ్జెట్ నంబర్లన్నీ కేవలం పీఆర్ (పబ్లిక్ రిలేషన్స్) స్టంట్‌లో భాగమేనని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సినిమాలకు హైప్ తీసుకురావడానికి, లార్జర్ ద్యాన్ లైఫ్ ఇమేజ్ క్రియేట్ చేయడానికి ఇలాంటి నంబర్లను మార్కెట్లోకి వదులుతుంటారని, గత 15 ఏళ్లుగా చిత్ర పరిశ్రమలో ఇలాంటి వింత ధోరణిని తాను చూస్తున్నానని మండిపడ్డారు.

ఒక్క రూపాయి కూడా ప్రేక్షకుల జేబుల్లోకి వెళ్లదు 

సినిమా అనేది పూర్తిగా నిర్మాతకు సంబంధించిన వ్యాపారమని, ఎంత ఖర్చు పెట్టాలి, ఎంత వెనక్కి రాబట్టాలి అనేది కేవలం మేకర్స్ వ్యక్తిగత విషయమని మనోజ్ స్పష్టం చేశారు. సాధారణ ప్రేక్షకులకు ఈ బడ్జెట్ లెక్కలతో ఎలాంటి సంబంధం లేదని, ఒక సినిమా చూశాక అది నచ్చిందా లేదా అనేదే ప్రేక్షకుడికి ముఖ్యం కావాలని అభిప్రాయపడ్డారు. ఈ మధ్య కాలంలో సినిమా బిజినెస్ ట్రెండ్ ఎంతగా మారిపోయిందంటే, చివరికి ఎయిర్‌పోర్టుల్లో నన్ను కలిసే సామాన్య జనం కూడా సినిమా కథ గురించి కాకుండా, ఆ సినిమా ఎన్ని కోట్లు వసూలు చేసింది, బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతొచ్చాయి అనే విషయాల గురించే మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
also read :సైలెంట్‌గా ‘సెంచరీ’ కొట్టేసిన వైష్ణవ్ తేజ్…ఈసారైనా హిట్ కొడతావా గురూ ?

Advertisement

రూ. 500 కోట్లు లేదా రూ. 600 కోట్ల బడ్జెట్ పెట్టి సినిమా తీస్తే అందులోంచి ఒక్క రూపాయి కూడా ప్రేక్షకుల జేబుల్లోకి వెళ్లదని, ఆ డబ్బు అంతా నిర్మాత ఖాతాకే చెందుతుందని ఆయన గుర్తుచేశారు. కాబట్టి కలెక్షన్ల లెక్కలు పక్కనపెట్టి, కంటెంట్ బాగుందా లేదా అనే కోణంలోనే సినిమాను చూడాలని ప్రేక్షకులకు హితవు పలికారు.

పీఆర్ మాయాజాలాన్ని ఆయన ఎండగట్టిన మనోజ్ 

అయితే, మనోజ్ భాజ్‌పేయి చేసిన ఈ ఘాటు వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్న ‘గవర్నర్’ సినిమాపై మార్కెట్లో ఆశించిన స్థాయిలో బజ్ లేదని, అందుకే ఈ సినిమా ప్రమోషన్ల కోసం, నెటిజన్ల దృష్టిని ఆకర్షించేందుకే రాజమౌళి, రణబీర్ కపూర్ వంటి పెద్ద ప్రాజెక్టులను టార్గెట్ చేస్తూ ఇలాంటి క్రేజీ కామెంట్స్ చేశారంటూ కొందరు విమర్శిస్తున్నారు.
గతంలో ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్‌తో ఓటీటీ ప్రపంచంలో సంచలనం సృష్టించిన మనోజ్, ఈ ఏడాది ‘భయ్యాజీ’ వంటి యాక్షన్ సినిమాలతో మెప్పించారు. ఇప్పుడు ‘గవర్నర్’తో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. సినిమా ప్రమోషన్ల స్ట్రాటజీ ఏదైనప్పటికీ, భారీ బడ్జెట్ సినిమాల హైప్ వెనుక ఉన్న పీఆర్ మాయాజాలాన్ని ఆయన ఎండగట్టిన విధానం మాత్రం ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా నిలిచింది.
also read :తల్లి మరణించిన కొన్ని రోజులకే రేసింగ్ హెల్మెట్ పట్టిన అజిత్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ‘తలా’ లుక్!

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×