E-Paper
Advertisement

మలేషియాలో ‘మన్యం ధీరుడు’ చిత్రానికి అవార్డ్.. ఆర్.వి.వి.సత్యనారాయణకు ఉగాది పురస్కారం..

మలేషియాలో ‘మన్యం ధీరుడు’ చిత్రానికి అవార్డ్.. ఆర్.వి.వి.సత్యనారాయణకు ఉగాది పురస్కారం..
Advertisement

Manyam Dheerudu: తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు సరిహద్దులు దాటి ప్రపంచవ్యాప్తంగా వెలుగొందుతున్నాయి. తాజాగా మలేషియాలో నిర్వహించిన ఉగాది పురస్కార్ – 2026 వేడుకల్లో తెలుగు చలనచిత్రం ‘మన్యం ధీరుడు’ ఉత్తమ చిత్రంగా అవార్డును గెలుచుకొని అంతర్జాతీయ వేదికపై తెలుగువారి సత్తాను చాటింది. మలేషియా తెలుగు సంఘం (AMTS) క్లాంగ్ శాఖ ఆధ్వర్యంలో, అక్కడి సుందర్ పెరుమాళ్ ఆలయ ఆడిటోరియంలో ఈ ఉగాది సంబరాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో భాగంగా, ఆర్.వి.వి. సత్యనారాయణ స్వయంగా నటించి, నిర్మించిన ‘మన్యం ధీరుడు’ చిత్రానికి “ఉత్తమ చిత్ర పురస్కారం” లభించింది. మలేషియా తెలుగు సంఘం చైర్మన్ సుబ్రహ్మణ్యం గారి పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు 600 మంది తెలుగు సంఘం సభ్యులు పాల్గొని సందడి చేశారు.

Read also-మాధురి సినిమాలలో నటించాలంటే దువ్వాడ కండిషన్లు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే ?

ఘనంగా సత్కారం

Advertisement

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన క్లాంగ్ ఉత్తర జిల్లా పోలీస్ కమిషనర్ విజయరావు, చిత్ర నిర్మాత నటుడు ఆర్.వి.వి. సత్యనారాయణ ఆయన భార్య శ్రీమతి ఆర్. పార్వతి దేవి దంపతులను ఘనంగా సత్కరించారు. శాలువా కప్పి, మెమెంటోను అందించి, వారి సేవలను కొనియాడారు. ఈ గౌరవ ప్రదానోత్సవంలో గౌరవ అతిథులు సుబ్రమణ్యం రామానాయుడు కమిటీ సభ్యులు కూడా పాల్గొన్నారు.

Read also-విక్రమ్ సహిదేవ్ ‘అనకాపల్లి’ టీజర్ వచ్చేసింది చూశారా?.. ఎలా ఉందంటే?

విప్లవ వీరుడి గాథ

Advertisement

ముఖ్య అతిథి విజయరావు మాట్లాడుతూ, మన్యం ధీరుడు చిత్రం ద్వారా భారతదేశ ఆత్మగౌరవాన్ని, స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు వీరగాథను నేటి తరానికి చాటిచెప్పిన ఆర్.వి.వి. సత్యనారాయణ కృషిని ప్రశంసించారు. “భారతదేశ ఔన్నత్యాన్ని చాటిచెప్పే కథలను ఎంచుకోవడం గొప్ప విషయం. ముఖ్యంగా ఈ సినిమాలో దేశభక్తిని ప్రేరేపించేలా రూపొందించిన గీతం, భారతదేశంలోని ప్రతి పౌరుడు గర్వంగా పాడుకునేలా ఉండటం సత్యనారాయణ గారి ప్రతిభకు నిదర్శనం.” అని ఆయన పేర్కొన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమకు, ముఖ్యంగా చారిత్రక నేపథ్యం ఉన్న సినిమాలకు విదేశీ గడ్డపై ఇలాంటి గౌరవం దక్కడం గర్వకారణం. మన్యం వీరుడి చరిత్రను అంతర్జాతీయ వేదికపై ప్రదర్శించి, అవార్డు గెలుచుకున్న ‘మన్యం ధీరుడు’ బృందానికి తెలుగువారందరి తరపున ప్రముఖులు అభినందనలు తెలుపుతున్నారు.

Related News

సాంప్రదాయబద్ధంగా సమంత  సీమంతపు వేడుక వైరల్ అవుతున్న ఫోటోలు!

నటుడిగా మెప్పించి ‘నాగపూర్ పవిత్ర”టేక్డీ గణపతి ఆఫ్ నాగపూర్’ పుస్తకంతో రచయితగా మారుతున్న హీరో సూర్య తేజ్

పావలా శ్యామల కుమార్తె విషయంలో ‘మా’ కీలక నిర్ణయం!

నా ముందే ఆటిట్యూడ్‌తో తిరుగుతున్నావ్.. శోభితపై చైతూ ఓపెన్ కామెంట్స్.. వీడియో చూశారా?

ఆకట్టుకుంటున్న రాగ్ మయూర్ ‘అనుమాన పక్షి’ ట్రైలర్!

హీరో అజిత్ కు  కారు గిఫ్ట్ గా ఇచ్చిన సీఎం విజయ్.. లవ్లీ బ్రదర్ అంటూ!

తరుణ్ నీలో ఈ టాలెంట్ కూడా ఉందా.. ‘ENE రిపీట్’ కోసం భలే కాకా పడుతున్నావే!

డైరెక్టర్ ఇంట్లో వినాయక చవితి చేసుకున్న నటి.. ఆ రిలేషన్ ఎదో కన్ఫర్మ్ చేసేయండయ్యా?

Big Stories

Advertisement
×