E-Paper
Advertisement

ఇరాన్‌తో యుద్ధం.. ఏ క్షణమైనా ఖార్గ్ ద్వీపంపై దాడులకు అవకాశం, రంగంలోకి 3,500 మంది అమెరికా మెరైన్లు

ఇరాన్‌తో యుద్ధం.. ఏ క్షణమైనా ఖార్గ్ ద్వీపంపై దాడులకు అవకాశం, రంగంలోకి 3,500 మంది అమెరికా మెరైన్లు
Advertisement

War with Iran: ఇరాన్ యుద్దంతో పశ్చిమాసియాలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్నాయి. దీనికితోడు చమురు వ్యవహారం ఆసియా, యూరప్ దేశాలను వెంటాడుతోంది. ఇరాన్‌తో శాంతి చర్చలు జరుగుతున్న అమెరికా, వినకపోతే భూతల-వైమానిక దాడులు తీవ్రతరం చేయాలని ఆలోచన చేస్తోంది. మరోవైపు ఇరాన్‌కు మద్దతుగా హౌతీలు రంగంలోకి దిగడం, దాడులు చేయడంతో అగ్గి మీద గుగ్గిలం అవుతోంది. ఈ నేపథ్యంలో 3,500 మంది మెరైన్లు సిబ్బందిని రంగంలోకి దించింది. దీంతో ఏం జరుగుతుందోనన్న టెన్షన్ మధ్యప్రాఛ్యంలో నెలకొంది.

ఏ క్షణమైనా  ఖార్గ్ ద్వీపంపై అమెరికా దాడులు చేసే అవకాశం

Advertisement

ఇరాన్‌తో యుద్ధం జఠిలమవుతున్న నేపథ్యంలో అమెరికా వేగంగా అడుగులు వేస్తోంది. ముఖ్యంగా పశ్చిమాసియాలో సైనిక శక్తిని గణనీయంగా పెంచుతోంది. తాజాగా 3,500 మంది మెరైన్లతో కూడిన ఓ టాస్క్‌ఫోర్స్‌ టీమ్‌ని యూఎస్ఎస్ ట్రిపోలీ యుద్ధనౌకపై అక్కడకు తరలించింది. యూఎస్‌ నేవీలో అత్యంత ఆధునిక నౌకలలో ఇది కూడా ఒకటి.

ఆయా బలగాలు మార్చి 27న మధ్యప్రాచ్యానికి చేరుకున్నాయని యూఎస్ సెంట్రల్ కమాండ్ ఓ ప్రకటనలో పేర్కొంది. అందులో దాదాపు 3,500 మంది మెరైన్లు, ఫైటర్ విమానాలు, దాడులకు అవసరమైన యుద్ధ సామాగ్రి ఉన్నట్లు తెలుస్తోంది. సైనిక ఉనికిని బలోపేతం చేయడమే కాకుండా, దాడి విమానాలను కూడా మోహరించింది.

Advertisement

రంగంలోకి 3,500 మంది అమెరికా మెరైన్లు,  పరిణామాలను గమనిస్తున్న ఇరాన్

కొత్తగా మోహరించిన మెరైన్‌లు మధ్యప్రాచ్యం అంతటా మోహరించనుంది. సుమారు 50 వేల మందితో ఆ ప్రాంతంలో సైనిక బలగాలను బలోపేతం చేయనున్నట్లు నిపుణులు చెబుతున్నారు. కేవలం సముద్రం పైనుంచి కాకుండా నేలపై నుంచి ఏకకాలంలో దాడులు చేయగల సామర్థ్యం ఈ బలగాల సొంతం.

వ్యూహాత్మక ప్రాంతాలను స్వాధీనం చేసుకోవడం ఆ తర్వాత అక్కడి పౌరులను సురక్షిత ప్రాంతాలకు తరలించడం లక్ష్యాలపై దాడులు చేయడం కోసం ఈ తరహా యూనిట్లను ఉపయోగిస్తారు. ప్రస్తుతం పరిస్థితుల్లో అమెరికా వేస్తున్న అడుగుల గురించి మాజీ సీఐఏ విశ్లేషకుడు లారీ జాన్సన్ కొన్ని విషయాలు బయటపెట్టారు.

ALSO READ: ఇరాన్ యుద్ధ వేళ.. రష్యా ఊహించని నిర్ణయం, ఇకపై కష్టాలు రెట్టింపు 

ఇరాన్ చమురు మౌలిక సదుపాయాలను స్వాధీనం చేసుకునే లక్ష్యంతో అమెరికా భూతల కార్యకలాపాలను దిగనున్నట్లు ఆయన అంచనా.  ఖార్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకోవడం, ఇరాన్ చమురు రవాణాను నిలిపి వేయడానికి ఒక చర్యగా ఆయన చెప్పారు. అటువంటి ఓడరేవుపై నియంత్రణను కొనసాగించడానికి లక్షల సంఖ్యలో సైనిక బలం అవసరమవుతుందని చెబుతున్నారు.

అమెరికా-ఇజ్రాయెల్ ఆర్థిక వ్యవస్థలపై ఒత్తిడి తెచ్చేందుకు హౌతీల రంగంలోకి దిగడం వంటి పరిణామాలు వ్యూహాత్మక ఎత్తుగడగా సీఐఏ మాజీ అధికారి లారీ జాన్సన్ వివరిస్తున్నారు. ఎర్రసముద్రంలో బాబ్ ఎల్-మండేబ్ జలసంధి ద్వారా హౌతీలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేయగలరని అంటున్నారు. ప్రపంచం ఈ స్థాయి ఆర్థిక ఒత్తిడిని ఎక్కువ కాలం తట్టుకోలేదన్నారు.

 

Related News

అమెరికా స్థావరాలపై ఇరాన్ భీకర దాడులు.. ఇద్దరు అమెరికా సైనికులు మృతి, ట్రంప్‌పై ఖమేని ఘాటు వ్యాఖ్యలు

హార్మూజ్ జలసంధిలో హైటెన్షన్.. సముద్రంలో పేలిన రెండు చమురు ట్యాంకర్లు!

మెక్సికోలో భారీ భూకంపం.. ఒక్కసారిగా ఊగిపోయిన భవనాలు! సునామీ ముప్పు పొంచి ఉందా?

అమెరికా చదువులపై ట్రంప్ ‘వీసా’ దెబ్బ.. భారతీయులకు డబుల్ షాక్!

ఇరాన్‌పై అమెరికా దాడులు.. కుప్పకూలిన చాబహార్ టవర్.. భారత్‌కు కోలుకోలేని దెబ్బ!

అల్జీరియాలో భారీ అగ్నిప్రమాదం.. 11 మంది అనాథలు సజీవదహనం, 19 మందికి తీవ్ర గాయాలు

సముద్రంలో పెను విషాదం.. రోహింగ్యా శరణార్థుల పడవలు బోల్తా.. 500 మందికి పైగా మృతి!

బీచ్‌లో గుండె గుభేల్.. నడినెత్తి మీద నుంచి దూసుకెళ్లిన యుద్ధ విమానాలు.. గాల్లోకి ఎగిరిన టెంట్లు!

Big Stories

Advertisement
×