E-Paper
Advertisement

తల్లి కోసమే ఇండస్ట్రీకి దూరం.. అసలు విషయం చెప్పిన మాస్టర్ భరత్!

తల్లి కోసమే ఇండస్ట్రీకి దూరం.. అసలు విషయం చెప్పిన మాస్టర్ భరత్!
Advertisement

Master Bharath:2002లో ‘నైనా’ అనే చిత్రంతో వెండితెరకు పరిచయమైన చైల్డ్ ఆర్టిస్ట్ మాస్టర్ భరత్ (Master Bharath) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఇక ‘అంజి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన భరత్.. పెదబాబు ,ఆనందమానందమాయే , వెంకీ , గుడుంబా శంకర్, నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్, నీ నవ్వే చాలు, హ్యాపీ, పోకిరి, అందాల రాముడు, ఢీ, దుబాయ్ శీను, ఇలా ఎన్నో చిత్రాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించారు. పైగా భరత్ నటించిన చిత్రాలలో రెడీ, బిందాస్ చిత్రాలకు గానూ ఉత్తమ బాల నటుడు విభాగంలో రెండు నంది అవార్డులను కూడా గెలుచుకున్న విషయం తెలిసిందే. ఇకపోతే ఎంబీబీఎస్ పూర్తి చేయడానికి కొంతకాలం ఇండస్ట్రీకి బ్రేక్ ఇచ్చిన మాస్టర్ భరత్.. విద్యాభ్యాసం పూర్తయ్యాక 2019లో విడుదలైన ఏబిసిడి అనే చిత్రంలో సెకండ్ హీరోగా నటించారు.

ఇండస్ట్రీకి దూరం కాబోతున్న మాస్టర్ భరత్..

ఇక అడపాదడపా సినిమాలు చేస్తూ మళ్లీ మధ్యలో బ్రేక్ ఇవ్వడంతో.. సినిమా ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసి పూర్తిగా వైద్య వృత్తి పైనే దృష్టి పెట్టమని మాస్టర్ భరత్ తల్లి చెప్పారని, అందుకే భరత్ ఇకపై సినిమాలలో కనిపించరంటూ ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన విషయం తెలిసిందే. తాజాగా మాస్టర్ భరత్ స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు. భరత్ స్పందిస్తూ..” నేను నటనకు గుడ్ బై చెబుతున్నట్లు వస్తున్న వార్తలలో ఎటువంటి నిజం లేదు. ముఖ్యంగా మా అమ్మ ఇండస్ట్రీకి దూరం కావాలని, వైద్య వృత్తిపైనే దృష్టి పెట్టాలని చెప్పినట్లు వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం.

రూమర్లపై స్పందించిన భరత్..

Advertisement

సినిమాలంటే నాకు చాలా ఇష్టం. మంచి కథలు, నాకు నప్పే వైవిధ్యమైన పాత్రలు వస్తే తప్పకుండా నటిస్తాను. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ప్రేక్షకులు నన్ను ఆదరిస్తున్న తీరు, వారి ప్రేమ నన్ను రుణపడేలా చేస్తున్నాయి. కాబట్టి నేను సినిమాలకు దూరం అవుతాను అంటూ వస్తున్న వార్తలలో ఎటువంటి నిజం లేదు. ఎవరు నమ్మకండి” అంటూ ఆయన క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమను వదులుకోను.నా తల్లి చెప్పింది.బాధలో ఉన్న వారిని కాపాడమని.. అలాగే ఇండస్ట్రీలో మంచి స్థాయిలో ఉండమని.. అందుకే అమ్మ కోరిక మేరకు రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతాను అంటూ కూడా క్లారిటీ ఇచ్చారు.

also read:అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీలో ఆస్తి వివాదం.. అసలేం జరిగిందంటే?

తన తల్లి కోరిక మేరకు రెండింటిని బ్యాలెన్స్ చేస్తానంటూ క్లారిటీ..

Advertisement

ఇకపోతే ఇటీవల ఎంబిబిఎస్ పూర్తి చేసిన భరత్..తల్లి చివరి కోరికను తీర్చారని కొన్ని రూమర్లు వైరల్ అయ్యాయి. సినిమాల్లో అవకాశాలు తగ్గిన తర్వాత ఆయన చదువుపై దృష్టి పెట్టారని, చెన్నైలో వైద్య వృత్తి పూర్తి చేశారని రూమర్లు కూడా వినిపించాయి. ఇక ఆ రూమార్లన్నింటికీ ఇప్పుడు భరత్ చెక్ పెట్టారు. ఇకపోతే భరత్ తల్లి కమలహాసిని 2025 మే 18న చెన్నైలో గుండెపోటుతో కన్నుమూశారు. అప్పటికీ ఆమె వయసు 53 సంవత్సరాలు. పైగా భరత్ ఒక్కడే సంతానం కావడం , తల్లి ప్రోత్సాహంతోనే చిన్నతనంలోనే సినిమాలోకి అడుగు పెట్టడం అన్నీ జరిగిపోయాయి. భరత్ తల్లి మరణం తర్వాత ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారని రూమర్లు రావడంతోనే ఇప్పుడు ఆయన క్లారిటీ ఇచ్చారు. ముఖ్యంగా తన తల్లి మరణించినప్పుడు ప్రేక్షకులు తనపై చూపించిన ప్రేమ మాటల్లో చెప్పలేనిది అంటూ కూడా తెలిపారు భరత్.

Related News

బిగ్ టీవీ ఫోక్ నైట్ 2026.. జానపద గీతాలకు అదిరిపోయే స్టెప్స్ వేసేద్దామా? ఎప్పుడు.. ఎక్కడంటే?

అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీలో ఆస్తి వివాదం.. అసలేం జరిగిందంటే?

ఐదు దశాబ్దాల సినీ ప్రయాణం.. గిరిబాబు అందుకున్న పురస్కారాలు ఇవే!

గిరిబాబు తెలుగులో నటించిన చివరి చిత్రం ఇదే!

గిరిబాబు మరణంపై చిరంజీవి దిగ్భ్రాంతి.. ఎమోషనల్ పోస్ట్ వైరల్!

ఆ ఒక్క హీరోతో 150 సినిమాలలో కలిసి నటించిన గిరిబాబు!

గిరిబాబుకు తీరని కోరిక అదేనా? పుట్టిన రోజంటే ఊరంతా పండుగేనా?

Big Stories

Advertisement
×