E-Paper
Advertisement

Brahmamudi Serial Today Episode November 15th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందు సంతకం చేస్తే రాజు ఏం చేశాడో తెలుసా..?

Brahmamudi Serial Today Episode November 15th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందు సంతకం చేస్తే రాజు ఏం చేశాడో తెలుసా..?
Advertisement

Brahmamudi serial today Episode: ఆ సంతకం నువ్వు చేయలేదు కదా ఫోర్జరీ అంటే ఐశ్వర్య పరువు పోతుందని అబద్దం చెప్తున్నావు కదా అంటే లేదు నేనే చేశాను సంతకం అని చెప్తుంది ఇందు. రాజు కోపంగా ఎందుకు చేశావు తను చేసిన ఫస్ట్‌ డీల్ లో ఎం చేసిందో తెలుసా..? అంటూ రాజు అంటే.. అన్ని గుర్తు ఉన్నాయి రాజు తనకు సెన్స్‌ లేదు మనకు ఉంది కదా వదిలేయ్‌ పాజిటివ్‌గా ఆలోచించు రాజు అంటూ ఇందు చెబితే.. నెగెటివ్‌ పీపుల్‌ గురించి పాజిటివ్‌గా ఆలోచించడం నాకు రాదు అయినా ఇంట్లో నా మాటే నీ మాట అన్నావు కదా అంటూ రాజు ప్రశ్నిస్తే… ఇప్పటికి అదే చెప్తాను అంటుంది ఇందు. అంటే నేను నీ పక్కన ఉంటేనే ఇచ్చిన మాట మీద నిలబడతావా..? నువ్వు ఇలా చేస్తే నా మాటకు విలువ ఎక్కడుంటుంది అంటూ రాజు అడిగితే.. నేను ఎందుకు చేశానో అర్థం చేసుకో రాజు అంటూ ప్లాష్‌బ్యాక్‌ చెప్తుంది.

ప్లాష్‌బ్యాక్‌లో..

లక్కీ, ఇందు దగ్గరకు వెళ్లి తనకు ఇందు పెట్టే సంతకం విలువేంటో తెలియదు కానీ ఒక ప్రాణం విలువ మాత్రం బాగా తెలుసు అంటాడు. ఆ మాటకు ఇందు ఎమోషనల్‌ అవుతుంది. లక్కీ చేతిలో ఉన్న పేపర్స్‌ తీసుకుంటుంది. అపర్ణ వద్దని చెప్తుంది. అందుకు ఇందు లక్కీ చెప్పింది నిజమే నాన్నమ్మ సంతకం కంటే ప్రాణమే ముఖ్యం అంటుంది. అది ఆ ప్రాణాన్ని అస్త్రంలా వాడుకుంటుందే అంటే.. చూద్దాం అంటూ పేపర్స్‌ తీసుకుని ఐశ్వర్య దగ్గరకు వెళ్తుంది ఇందు.

Advertisement

ఇందును చూసిన ఐశ్వర్య నువ్వు యూటర్న్‌ తీసుకుని వస్తావని నాకు తెలుసు ఇందు అనగానే.. నేను నీకు బయపడి రాలేదు.. నిన్ను క్షమించి వచ్చాను అంటుంది ఇందు. భయాన్ని ఒప్పుకోలేక ఇలా మాట్లాడుతుంటారు నీలాంటి వాళ్లు అంటూ ఐశ్వర్య చెబితే.. క్షమించడం చేతకానితనం కాదు అది మంచి వాళ్లలో ఉండే ఒక గుణం ఆడదానివే కదా ఐషు ఎందుకు ఇంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావు.. కడుపులో బిడ్డను పెట్టుకుని ఆటలాడుతున్నావు కదా సంతకం కోసమేనా ఇదంతా అంటే ఇంకేమైనా డౌటు ఉందా అంటూ ఐశ్వర్య అంటే.. ఇందు సంతకం పెట్టి నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసం ఇదంతా చేశాను అంటూ పేపర్స్‌ ఐశ్వర్యకు ఇస్తుంది. నేను నీకు ఇస్తున్న సెకండ్‌ చాన్స్ ఇది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకో ఎక్స్‌ఫోకు ప్రపంచం నలుమూలల నుంచి చాలా పెద్ద కంపెనీలు వస్తున్నాయి. వాళ్ల దృష్టిలో నువ్వు పడితే నీకు చాలా మంచిది అర్థం చేసుకో అంటూ ఇందు చెబితే.. నాకు నీ సలహాలు అక్కర్లేదు సంతకం చాలు అక్కడ ఎవరిని ఎలా ఇంప్రెస్‌ చేయాలో నాకు బాగా తెలుసు అంటూ ఐశ్వర్య చెబితే.. ముందు నువ్వు వెళ్లి తిని అంటూ వెళ్లిపోతుంది.

ఇది జరిగింది.. తన కడుపులో ఉన్న బిడ్డ కోసం సంతకం పెట్టాల్సి వచ్చింది అంటూ ఇందు చెబితే.. తప్పు చేశావు ఇందు.. ఇప్పుడు ఈ ఎక్స్‌ఫో లో కూడా ఏదైనా ఫ్రాడ్‌ చేస్తుంది. అది కూడా మన నెత్తి మీదే పడుతుంది అంటూ రాజు చెప్పగానే.. లేదు రాజు.. ఈసారి తను నా మీద గెలవడం కోసమైనా సరే నిజాయితీగా పని చేస్తుంది అంటూ ఇందు చెబితే.. నువ్వు తన గురించి చాలా గొప్పగా ఊహించుకుంటున్నావు ఇందు అంటూ రాజు హెచ్చరిస్తాడు. ఇంతలో  ఇవాళ్టీ బ్రహ్మముడి ఏపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

Advertisement

 

Related News

Illu Illalu Pillalu Today Episodes: ప్రేమ పై రౌడీలు దాడి.. చందు మాటతో వల్లి షాక్.. భద్ర ప్లాన్ అట్టర్ ప్లాప్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. డోంట్ మిస్..

Nindu Noorella Saavasam Serial Today Episode November 15th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: షాపింగ్‌ మాల్‌లో పార్థును చూసిన మనోహరి ఏం చేస్తుంది…?  

ముఖేష్ కు కాళ్లు మొక్కడంపై వర్షిణి మదర్ రియాక్షన్… రామకృష్ణకు క్షమాపణలు!

వర్షిణికి ఫేవర్ గా హౌస్ మేట్స్…పాపం రామకృష్ణ.. కన్నీళ్లు పెట్టుకున్న తల్లి!

వసుంధర సీరియల్లో వసు అత్తగా నటిస్తున్న ఈమె స్టార్ కమెడియన్ కూతురని తెలుసా?

వర్షిణికి షాక్ ఇచ్చిన హౌస్ మేట్స్.. ఫ్రెండ్ అంటూనే ముంచేశారుగా!

Big Stories

Advertisement
×