E-Paper
Advertisement

గాయపడ్డ మెగా హీరో.. నేడే సర్జరీ!

గాయపడ్డ మెగా హీరో.. నేడే సర్జరీ!
Advertisement

Varun tej:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బడా ఫ్యామిలీగా గుర్తింపు తెచ్చుకున్న మెగా కుటుంబం నుండి హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun tej). నాగబాబు (Nagababu) వారసుడిగా 2000 సంవత్సరంలో హాండ్సప్ అనే చిత్రంతో బాల నటుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన ఈయన.. 2014లో వచ్చిన ముకుంద సినిమాతో హీరోగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.6.4 అడుగుల ఎత్తుతో అందరి దృష్టిని ఆకట్టుకున్నారు వరుణ్ తేజ్. మొదటి నుంచే భిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈయన చివరిగా ఆపరేషన్ వాలెంటైన్ , మట్కా వంటి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కానీ అనుకున్నంత స్థాయిలో ఈ సినిమా సక్సెస్ అవ్వలేదు. ఇక ఇప్పుడు ‘బరి’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

గాయపడ్డ మెగా హీరో వరుణ్ తేజ్..

స్పోర్ట్స్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ వాలీబాల్ ప్లేయర్ గా కనిపించనున్నారు. ఇకపోతే పర్ఫెక్ట్ క్రీడాకారుడిగా కనిపించడానికి గత ఏడు నెలలుగా కఠినమైన శిక్షణ తీసుకుంటున్నారు. అయితే ఈ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో వాలీబాల్ ఆడుతుండగా.. అనుకోకుండా వరుణ్ తేజ్ కాలికి తీవ్రమైన గాయమైంది. ఇక వెంటనే స్పందించిన చిత్ర బృందం వరుణ్ తేజ్ ను ఆసుపత్రికి తరలించారు. సినిమా పట్ల చూపిస్తున్న నిబద్ధత చూసి అందరూ మెచ్చుకుంటున్నా.. ఈ ప్రమాదం జరగడం అభిమానులను పూర్తిగా కలవరపాటుకు గురిచేసింది.

అపోలో హాస్పిటల్లో నేడే సర్జరీ..

Advertisement

ఇకపోతే గాయం తీవ్రతను దృష్టిలో పెట్టుకొని వైద్యులు శస్త్ర చికిత్స అవసరమని సూచించారు. దీంతో హైదరాబాద్లోని అపోలో హాస్పిటల్లో వరుణ్ తేజ్ కు నేడు సర్జరీ జరగనున్నట్లు చిత్ర బృందం తెలిపింది..ఆపరేషన్ పూర్తయిన తర్వాత మూడు రోజులపాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారట. ఇకపోతే తమ అభిమాన హీరోకి నేడు సర్జరీ జరగబోతుందని తెలిసి అభిమానులు సర్జరీ సవ్యంగా సాగాలి అని, త్వరగా ఆయన కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నారు. ఇక ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.

also read:శివాని, శివాత్మిక అందుకే పెళ్లికి అంగీకరించడం లేదా.. రాజశేఖర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో బరి..

Advertisement

ఇక వరుణ్ తేజ్ నటిస్తున్న బరి సినిమా విషయానికి వస్తే.. నిహారిక కొణిదెల పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ లో రూపు దిద్దుకున్న కమిటీ కుర్రోళ్ళు చిత్రానికి దర్శకత్వం వహించిన యదువంశీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. నిహారిక స్వయంగా ఈ సినిమాని నిర్మిస్తూ ఉండడం గమనార్హం. విలేజ్ స్పోర్ట్స్ డ్రామాగా వస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే ఇండస్ట్రీలో అంచనాలు కూడా భారీగా నెలకొన్నాయి. గత నెల అనగా మార్చి 28వ తేదీన గ్రాండ్గా మొదలైన ఈ సినిమాను వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని డైరెక్టర్ యదు వంశీ ప్లాన్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం వరుణ్ తేజ్ గాయపడడంతో షెడ్యూల్స్ మారుతాయేమో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నప్పటికీ.. కచ్చితంగా సంక్రాంతి బరిలోనే ఈ సినిమాను తీసుకురావాలని చిత్ర బృందం గట్టి పట్టుదలతో ఉన్నట్లు సమాచారం.. ఏది ఏమైనా సరైన సక్సెస్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న వరుణ్ తేజ్ ఈ సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×