Big Tv Kissik Talks: బిగ్ బాస్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్(Pallavi Prashanth) తాజాగా బిగ్ టీవీ కిసిక్ టాక్స్(Big tv Kissik Talks) కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా తన వ్యక్తిగత విషయాల గురించి అలాగే వృత్తిపరమైన విషయాల గురించి కూడా పల్లవి ప్రశాంత్ మాట్లాడారు. అలాగే బిగ్ బాస్ కార్యక్రమంలో కొనసాగే సమయంలో మరొక కంటెస్టెంట్ అమర్ దీప్ (Amar Deep)తో పెద్ద ఎత్తున విభేదాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. అలాగే గ్రాండ్ ఫినాలే రోజు వీరిద్దరి అభిమానుల మధ్య కూడా భారీ స్థాయిలో వివాదం చెలరేగి ఒకరిపై మరొకరు దాడి చేసుకున్న సంఘటనలు అందరికీ తెలిసిందే.
ఆ దాడి ఎవరు చేశారో తెలియదు…
బిగ్ బాస్ 7 గ్రాండ్ ఫినాలే రోజు అన్నపూర్ణ స్టూడియో ఎదుట కొంతమంది యువకులు పెద్ద ఎత్తున ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు. అదేవిధంగా అమర్ దీప్ ప్రయాణిస్తున్న కారుపై కూడా రాళ్ల దాడి చేయడంతో అప్పట్లో ఈ విషయం కాస్త సంచలనంగా మారడమే కాకుండా పల్లవి ప్రశాంత్ పై కేసు కూడా నమోదు కావడం ఆయన జైలుకు వెళ్లడం జరిగింది. తాజాగా ఈ కార్యక్రమంలో భాగంగా పల్లవి ప్రశాంత్ ఈ విషయాల గురించి మాట్లాడారు. అందరూ నేనే చేయించానని అనుకుంటున్నారు. నా కారుపై కూడా దాడి జరిగింది ఆ విషయం ఎవరికీ తెలియదు. ఆరోజు అక్కడ దాడి చేసింది ఎవరో కూడా నాకు తెలియదని, ఉద్దేశపూర్వకంగానే ఆరోజు దాడి చేశారు అంటూ ఈయన అసలు విషయం బయట పెట్టారు.
అమర్ అన్నా ఆ పంచాయతీలన్నీ విడిచిపెట్టు…
ఆరోజు ఆ దాడి ఎవరు చేశారు అన్నది తెలియదు కానీ , వారిని మాత్రం కర్మ అసలు వదిలిపెట్టదని ఏదో ఒక రోజు రిటర్న్ గిఫ్ట్ ఇస్తుంది అంటూ ఈ సందర్భంగా పల్లవి ప్రశాంత్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. మరి పల్లవి ప్రశాంత్ అభిమానులు కాకుండా ఈ దాడి చేసింది ఎవరు అనే విషయంపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. అదేవిధంగా అమర్ తో ఉన్న విభేదాలు గురించి కూడా పల్లవి ప్రశాంత్ ఈ సందర్భంగా స్పందించారు. అన్న ఆ పంచాయతీలన్నీ విడిచిపెట్టన్నా .. లవ్ యు అన్నా అంటూ ఈ సందర్భంగా అమర్ గురించి పల్లవి ప్రశాంత్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఇక బిగ్ బాస్ హౌస్ లో శివాజీ (Shivaji)పల్లవి ప్రశాంత్ కు పూర్తిస్థాయిలో మద్దతు తెలియజేసిన సంగతి తెలిసిందే. వ్యవసాయంలో నువ్వు చేస్తావు బిడ్డ అంటూ నాన్న నన్ను ఎంతగా ప్రోత్సహించారో బిగ్ బాస్ హౌస్ లో కూడా శివాజీ అన్న అంతగా ప్రోత్సహించారని, ఈరోజు నేను ఇక్కడ కూర్చున్నాను అంటే అందుకు కారణం శివాజీ అన్న కూడా అంటూ ఆయనతో ఉన్న బాండింగ్ గురించి ఈ సందర్భంగా తెలియజేశారు. ఇక బిగ్ బాస్ కంటెస్టెంట్ రతిక గురించి కూడా ప్రస్తావనకు రావడంతో తనతో బిగ్ బాస్ తర్వాత మాట్లాడలేదని ఆమె ఎక్కడున్నా తనేం చేయాలనుకున్న అన్నింటిలోనూ విజయం సాధించాలని ప్రశాంత్ తెలిపారు. అలాగే తనకు కాబోయే భార్య గురించి కూడా ప్రశ్నలు ఎదురవడంతో నా తల్లితండ్రులను తన తల్లిదండ్రులు లాగా చూసుకునే అమ్మాయి అయితే చాలు అంటూ కాబోయే భార్యలో ఉండాల్సిన లక్షణాలను కూడా ఈ సందర్భంగా పల్లవి ప్రశాంత్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Also Read: Big Tv Kissik Talks: పల్లవి ప్రశాంత్ గొప్ప మనసు.. బిగ్ బాస్ డబ్బుతో గొప్ప పనికి శ్రీకారం!