Terrible accident: ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లా బల్లికురవ మండలంలోని సత్యక్రిష్ణ గ్రానైట్ క్వారీలో 2025 ఆగస్టు 3, ఆదివారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు కార్మికులు బండరాళ్లు విరిగి పడటం వల్ల అక్కడిక్కక్కడే మృతి చెందారు. ప్రమాద సమయంలో క్వారీలో సుమారు 16 మంది కార్మికులు పని చేస్తున్నట్లు సమాచారం ఇచ్చారు. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం, క్వారీ అంచు అకస్మాత్తుగా విరిగిపడటం వల్ల ఈ విషాదం జరిగిందని తెలిపారు. ఈ ఘటన స్థానికంగా విషాద వాతావరణాన్ని నెలకొల్పింది.
ప్రమాద సమయంలో క్వారీలో పనిచేస్తున్న 16మంది కార్మికులు
అయితే ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. శిథిలాల కింద చిక్కుకున్న కార్మికులను బయటకు తీసే ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగించారు. ఇప్పటి వరకు నాలుగు మృతదేహాలను వెలికితీసినట్లు అధికారులు తెలిపారు, మరో ఇద్దరి మృతదేహాలను బయటకు తీసేందుకు రెస్క్యూ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. గాయపడిన 10 మంది కార్మికులను నరసరావుపేట ఆసుపత్రికి తరలించారు, వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. మృతులందరూ ఒడిశాకు చెందిన కార్మికులుగా గుర్తించారు.
ఘటనపై స్పందించిన చంద్రబాబు..
ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గాయపడినవారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశించారు. బాపట్ల జిల్లా కలెక్టర్, ఎస్పీ స్థానిక అధికారులతో సమన్వయం చేస్తూ రెస్క్యూ కార్యకలాపాలను వేగవంతం చేయాలని సూచించారు. ప్రాథమిక దర్యాప్తులో క్వారీ నిర్వాహకులు సరైన భద్రతా చర్యలు తీసుకోకపోవడం ఈ ప్రమాదానికి కారణమని అధికారులు నిర్ధారించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు.
Also Read: వింత ఆచారం.. అక్కడ వధువుగా అబ్బాయి, వరుడిగా అమ్మాయి!
ఈ ప్రమాదం గ్రానైట్ క్వారీలలో భద్రతా ప్రమాణాలపై మరోసారి చర్చకు దారితీసింది. కార్మికుల భద్రతను నిర్ధారించేందుకు కఠినమైన చర్యలు తీసుకోవాలని అక్కడి స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
గ్రానైట్ క్వారీలో ఘోర ప్రమాదం.. ఆరుగురు మృతి!
బాపట్ల జిల్లా బల్లికురవ సమీపంలోని గ్రానైట్ క్వారీలో ప్రమాదం
గ్రానైట్ రాళ్లు విరిగిపడి ఆరుగురు కార్మికులు మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం
మృతులు ఒడిశాకు చెందిన కార్మికులుగా గుర్తింపు
ప్రమాద సమయంలో… pic.twitter.com/F6I58fCIeH
— BIG TV Breaking News (@bigtvtelugu) August 3, 2025